వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check : సీరం, భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్ల తిరస్కరణ- ఫేక్‌ న్యూస్‌ అని కేంద్రం క్లారిటీ

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ దీని దేశీయ తయారీ సంస్ధలు భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాలని డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియాను కోరాయి. వీటిని కేంద్రం పరిశీలిస్తున్న తరుణంలోనే అనుమతి నిరాకరించిందంటూ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఇవాళ పలు మీడియా సంస్ధల్లో ప్రసారం, ప్రచురణ అయిన వార్తలపై కేంద్రం స్పందించి క్లారిటీ ఇచ్చింది.

జాతీయ వార్తా ఛానల్‌ ఎన్డీటీవీలో ఈ వ్యాక్సిన్ల సమర్ధతపై సంతృప్తి చెందనందున కేంద్రం వీటికి అనుమతి నిరాకరించినట్లు తెలిపింది. దీన్ని కోట్‌ చేస్తూ కేంద్ర ఆరోగ్య సంక్షేమశాఖ ఫేక్ న్యూస్ అంటూ ఇచ్చిన క్లారిటీని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో విడుదల చేసింది. దీంతో కేంద్రం వీటిని తిరస్కరించినట్లు వెలువడిన వార్తలకు చెక్‌ పెట్టినట్లయింది. మరోవైపు ఈ వ్యాక్సిన్ల ట్రయల్స్‌ భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వెలువడిన వార్తల వల్ల వ్యాక్సిన్లపై అనుమానాలు నెలకొంటాయనే ఉద్ధేశంతో కేంద్రం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Fact Check : Emergency use of Serum, Bharat Biotechs vaccine has not been rejected

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే దేశంలోని 25 చోట్ల తమ కోవాక్సిన్‌ వ్యాక్సిన్‌ను మూడు దశల్లో పరీక్షించింది. వీటిలో మంచి ఫలితాలే వచ్చాయి. అలాగే పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా ఆక్స్‌పర్డ్‌ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంస్దలతో కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను సైతం బ్రిటన్‌తో పాటు పలు దేశాల్లో పరీక్షిస్తోంది. ఈ వ్యాక్సిన్‌కు సంబందించి కూడా సంతృప్తి కర ఫలితాలు వెలువడుతున్నాయని ఆయా సంస్ధలు ప్రకటించాయి.

Fact Check

వాదన

భారత్‌లో అత్యవసర సమయాల్లో తమ వ్యాక్సిన్‌ వాడేందుకు సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్ధలు చేసిన అభ్యర్ధన తిరస్కరించిన కేంద్రం

వాస్తవం

సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్ధల అభ్యర్ధనను తాము తిరస్కరించలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
emergency use of serum and bharat biotech vaccine, centre not reject emergency use of serum and bharat biotech vaccines, centre on serum and bharat biotech vaccines
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X