వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check:హెల్త్ ఐడీ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం వ్యక్తిగత సమాచారం అడుగుతోందా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆగష్టు 15న నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది. హెల్త్ ఐడీ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిందనే వార్త ప్రచారంలో ఉంది. కేవలం ఒకవారం రోజుల సమయం మాత్రమే ప్రభుత్వం ఇచ్చినట్లు వార్త హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం అప్రజాస్వామికం అంటూ ఆ వార్త వైరల్ అవుతోంది.

Recommended Video

#IndependenceDay2020: One Nation One Health Card ఇక ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలు ప్రభుత్వం వద్ద !

ఇది ఇక్కడితో ఆగలేదు.. వ్యక్తిగత సమాచారంలో భాగంగా పలు అంశాలను సేకరించేందుకు రంగం సిద్ధమైందంటూ వార్త ప్రచారంలో ఉంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తికి సంబంధించి ఆరోగ్య విషయాలు, ఆర్థిక పరమైన విషయాలు, జెనెటిక్స్, సెక్స్ లైఫ్, కులం, మతం, ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే విషయాలను కూడా సేకరించి స్టోర్ చేస్తోందంటూ వార్త ప్రచారంలో ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న ఈ వార్తను ప్రభుత్వ అధికార సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది. ప్రభుత్వంపై వస్తున్న ప్రచారం అబద్ధమని తేల్చింది. హెల్త్ ఐడీ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఎవరి వద్ద నుంచి ఎలాంటి వ్యక్తిగత సమాచారం అడగలేదని స్పష్టం చేసింది.

 Fact Check: Is Govt asking for personal data for the registration of Health ID ?

ఆగష్టు 15వ తేదీన ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ ఆరోగ్య వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని ఇందులో భాగంగానే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆరోగ్య రంగంలో ఈ కార్యక్రమం పెనుమార్పు తీసుకొస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. ప్రతి భారతీయుడికి ఒక డిజిటల్ హెల్త్ ఐడీ వస్తుందని చెప్పారు.

ఇక ప్రతిసారీ ఆరోగ్యపరంగా డాక్టరును కలిసి చికిత్స తీసుకుంటే దానికి సంబంధించిన పూర్తి విషయాలు హెల్త్ కార్డులో నమోదవుతాయని చెప్పారు. డాక్టర్ అపాయింట్‌మెంట్ నుంచి మెడికేషన్ వరకు ఈ హెల్త్ ప్రొఫైల్‌లో పొందుపర్చబడతాయని ప్రధాని మోడీ చెప్పారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద వస్తుంది. ఈ పథకం కింద ప్రతి పేషెంట్‌కు ఒక ఐడీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఆ వ్యక్తి మెడికల్ డేటా మొత్తం ఉంటుంది. అంటే ప్రిస్క్రిప్షన్, డయాగ్నస్టిక్ రిపోర్టు, డిశ్చార్జ్ సమరీలాంటివి ఉంటాయి.

ఒక వ్యక్తి ఏదైనా జబ్బు చేసి డాక్టరు లేదా హెల్త్ ప్రొవైడర్ల దగ్గరకు వెళ్లినప్పుడు తన హెల్త్ ఐడీని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రతిసారీ డాక్టరు దగ్గరకు వెళ్లినప్పుడల్లా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ మరో సదుపాయం కల్పిస్తోంది. టెలిఫోన్ ద్వారా కన్సల్ట్ అయి పేషెంట్లు ఆరోగ్య సేవలు పొందేలా వీలు కల్పిస్తోంది.

Fact Check

వాదన

హెల్త్ ఐడీ నమోదు కోసం ప్రభుత్వం వ్యక్తిగత సమాచారం అడుగుతోంది

వాస్తవం

ప్రభుత్వం ఎవరి వ్యక్తిగత సమాచారం అడగలేదు

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
A media portal has claimed that the government is asking for sensitive personal data for the registration of Health ID.PIB had condemned this report and clarified that Govt is not asking for any personal data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X