వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check:దోమల నుంచి కరోనా సోకుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

|
Google Oneindia TeluguNews

దోమలు కరోనావైరస్‌ను వ్యాప్తి చేయగలవా..? దోమల నుంచి కరోనావైరస్ సోకుతుందా..? దోమ కాటుకు మలేరియా వచ్చే అవకాశం ఉంది. మలేరియా కోసం హెచ్‌సీక్యూ మాత్రలు వాడొచ్చని పలు అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. కరోనావైరస్ కొత్తలో హెచ్‌సీక్యూ టాబ్లెట్స్‌కు బాగా డిమాండ్ పెరగడంతో భారత్ కూడా ఈ మాత్రలను విదేశాలకు ఎగుమతి చేసింది. అయితే ఇప్పుటు కొత్త వాదన తెరపైకి వచ్చింది. దోమల నుంచి కరోనా వస్తుందా.. అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై నిపుణులు కూడా క్లారిటీ ఇచ్చారు.

దోమల నుంచి కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందుతాయి కానీ అదే దోమల నుంచి కరోనా వైరస్ సోకుతుంది అనేదాంట్లో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. దోమల నుంచి ఎక్కువగా మలేరియా జబ్బు వస్తుంది కానీ కరోనావైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. దోమల నుంచి కరోనావైరస్ సోకుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ పేర్కొంది. కరోనావైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమిస్తుందని అది కూడా ఆ వ్యక్తి తుమ్మినప్పుడు తుంపర్లు ఎదుటి వ్యక్తి పై పడటం వల్ల వైరస్ సోకుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే దోమ కాటుతో కరోనావైరస్ రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పష్టం చేసింది.

Fact Check:Mosquitoes will not spread Coronavirus, Here is what experts say

Recommended Video

End of Pandemic?డిసెంబర్ 3 నాటికి దేశంలో కరోనా వైరస్ అంతం : Times Fact-India Outbreak Report

అయితే దోమలనుంచి ఇతర జబ్బులు వ్యాప్తి చెందుతున్నప్పుడు కరోనావైరస్ మాత్రం ఎందుకు సోకదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలకు ఈ మధ్యనే జరిగిన పరిశోధన ద్వారా సమాధానం వచ్చింది. ముందుగా దోమల నుంచి మనిషికి కరోనావైరస్ వ్యాప్తి చెందాలంటూ ముందుగా ఆ దోమకు వైరస్ సోకి ఉండాలని పరిశోధకులు తెలిపారు. ఆ దోమలోనే ఈ వైరస్ వృద్ధి చెంది ఆపై అది మనుషులను కుట్టినప్పుడు సంక్రమించడం జరుగుతుంది. ఇందుకోసం దోమ జాతికి చెందిన మూడు రకాల కీటకాలపై వైరస్ ఇంజెక్ట్ చేయడం జరిగిందని కానీ అది విఫలమైందని వెల్లడించారు. దీంతో దోమల నుంచి కరోనావైరస్ సోకదనే అంశం స్పష్టంగా అర్థమవుతోందని పరిశోధకులు తెలిపారు.

Fact Check

వాదన

దోమ కాటుతో కరోనా వస్తుంది

వాస్తవం

దోమకాటుతో కరోనా రాదని పరిశోధనల్లో తేలినట్లు చెప్పిన పరిశోధకులు

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
No, mosquitoes cannot spread the coronavirus. While mosquitoes can spread some diseases, most notably malaria, experts say coronavirus is not among them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X