వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check : రాఫెల్ విమానం అక్కడ కూలిపోయిందా..?

|
Google Oneindia TeluguNews

భారత అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రంగా,రక్షణ రంగంలో గేమ్ చేంజర్‌గా చెబుతున్న రాఫెల్ యుద్ద విమానాలకు సంబంధించి ఓ ఫేక్ న్యూస్ తెర పైకి వచ్చింది. తొలి విడతగా భారత్ చేరిన 5 రాఫెల్ యుద్ద విమానాలను గోల్డెన్ యూరోస్ స్క్వాడ్రన్‌కి అప్పగించిన నేపథ్యంలో... అందులో ఓ విమానం సాంకేతిక సమస్య కారణంగా అంబాలా ఎయిర్ బేస్‌లో కుప్పకూలినట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది.

అంబాలా ఎయిర్ బేస్‌లో యుద్ద విమానం కూలిపోయిందని,ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ అని స్పష్టం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా విమానం కూలిపోయిందని ఎక్కడా ట్వీట్ చేయలేదని తెలిపింది.

FACT CHECK No Rafale jet has crashed near Ambala airbase

కాగా,ఈ ఏడాది జులైలో ఫ్రాన్స్ నుంచి తొలి విడతగా ఐదు రాఫెల్ యుద్ద విమానాలు భారత్ చేరిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో భారత్ మొత్తం 36 యుద్ద విమానాల కోసం రూ.56వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

గురువారం(సెప్టెంబర్ 10) ఆ ఐదు యుద్ద విమానాలను అధికారికంగా ఎయిర్‌ఫోర్స్‌కి అప్పగించారు. మిగతా 31 యుద్ద విమానాలు కూడా భారత్‌కు వస్తే ఎయిర్‌ఫోర్స్ రంగంలో ఇక భారత్‌కు తిరుగులేదని చెబుతున్నారు.

Fact Check

వాదన

రాఫెల్ యుద్ద విమానం అంబాలా ఎయిర్ బేస్‌లో కూలిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం.

వాస్తవం

రాఫెల్ యుద్ద విమానం కూలిపోయినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అందులో ఏమాత్రం నిజం లేదు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
A tweet claiming a Rafale fighter jet has crashed near Ambaba air base is doing rounds in the social media. The social media post claimed that the newly-inducted aircraft crashed due to a technical problem and the pilot flying the plane was martyred. However, the Press Information Bureau dismissed the reports that a Rafale jet has crashed near the Ambala air base and the government agency termed the news reports as fake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X