వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check:డిసెంబర్ 1 నుంచి అన్ని రైళ్లు రద్దు..? ఈ వార్తలో నిజమెంత..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి వచ్చాయి. సాధారణ రైళ్లతో పాటు కోవిడ్-19 ప్రత్యేక రైళ్లు కూడా నిలిపివేస్తున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కరోనా కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నామంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలా ప్రాచరంలో ఉన్న వార్తలను నమ్మరాదని స్పష్టత ఇచ్చింది.

ఇదిలా ఉంటే పంజాబ్‌లో ట్రాక్ క్లియరెన్స్ వచ్చినందున త్వరలోనే గూడ్స్ మరియు ప్యాసింజర్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అంతకుముందు రైల్వే ట్రాక్‌పై రైతులు ధర్నాలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా రైతులు గూడ్సు రైళ్లు తిరగకుండా అడ్డుకున్నారు. దీంతో అత్యవసర వస్తువుల కొరత ఏర్పడింది. వీటిలో పంటలకు అందాల్సిన పురుగుల మందు కొరత కూడా ఏర్పడింది. అయితే మంగళవారం నుంచే గూడ్సు మరియు ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Fact Check:Train services will not stop from December 1st clarifies Indian Railways

పంజాబ్‌ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావడంతో మెయిన్‌టెనెన్స్‌ను త్వరలో చెక్ చేసి గూడ్సు మరియు ప్యాసింజర్ రైళ్లను నడుపుతామని రైల్వేశాఖ ట్వీట్ చేసింది. అంతకుముందు 15 రోజుల పాటు రైళ్లను అడ్డుకునే కార్యక్రమం చేయమని రైతులు నిర్ణయించారు. పంజాబ్‌లో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ రైళ్లను అడ్డుకునేందుకు వెనకాడబోమని రైతులు హెచ్చరించారు.

Recommended Video

Fact Check : Google Pay App ని RBI బ్యాన్ చేసింది అనే వార్త లో నిజమెంత? || Oneindia Telugu

ఇక రైళ్లు రద్దు కావడంతో ముఖ్యంగా సరుకు రవాణా చేసే గూడ్సు సర్వీసులు క్యాన్సిల్ కావడంతో భారీ నష్టం చవిచూసింది రైల్వేశాఖ.జమ్మూ కశ్మీర్ నుంచి సరుకుతో బయలు దేరిన గూడ్సు రైళ్లు పంజాబ్‌ పొలిమేరల్లోనే నిలిచిపోయాయి. రైతులు రైళ్లను అడ్డుకోవడం వల్ల రూ.2200 కోట్లు నష్టపోయినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఇందులో రూ.67 కోట్లు మేరా ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో సంభవించిందని వెల్లడించింది.

Fact Check

వాదన

డిసెంబర్ 1 తర్వాత రైళ్లు సర్వీసులు రద్దు అవుతాయి

వాస్తవం

రైళ్ల సర్వీసులను రద్దు చేయాలన్న ఆలోచన రైల్వేశాఖకు లేదు

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
There is news making rounds that due to the increase in covid cases all trains would be cancelled from December 1st which is false.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X