వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check : 'ఇండియన్ ఆర్మీ'పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు నిజమేనా..?

|
Google Oneindia TeluguNews

ఇటీవల తమిళనాడు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ఆయన భారత ఆర్మీని అవమానపరిచే వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చైనాతో సరిహద్దులో భారత ఆర్మీకి బదులు రైతులను,కార్మికులను అక్కడ మోహరించాలని రాహుల్ పేర్కొన్నారంటూ ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాహుల్ నిజంగానే భారత ఆర్మీని చులకన చేసే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా...?

కేవలం 26 సెకన్ల నిడివితో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రాహుల్ ప్రసంగానికి సంబంధించిన వీడియోని చూస్తే పై ప్రశ్నకు అవుననే సమాధానం వ్యక్తమవొచ్చు. కానీ ఆయన పూర్తి ప్రసంగాన్ని వింటే అసలు విషయం అర్థమవుతుంది. దేశంలో కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే మేలు చేస్తూ రైతులు,కార్మికులను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని రాహుల్ పేర్కొన్నారు. రైతులు,కార్మికులు,నేతన్నలపై కూడా కేంద్రం దృష్టి పెట్టగలిగితే.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు.

Fact Check: what actually Rahul said is he really suggested replacing Indian Army with labourers at China border

భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం వల్లే చైనా భారత్‌లోకి చొరబడేందుకు తెగిస్తోందన్నారు. ఒకవేళ దేశంలోని రైతులు,కార్మికులు,నేతన్నలను కేంద్రం ప్రోత్సహించి స్వయం స్వావలంబన దిశగా సాగి ఉంటే... ఈరోజు భారత్‌లోకి చొరబడేంత ధైర్యం చైనాకు వచ్చి ఉండేది కాదన్నారు. 'ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది... నేను గ్యారెంటీ ఇస్తున్నా... రైతులు,కార్మికులు,నేతన్నలను బలోపేతం చేయగలిగితే,వారిని ఆదుకోగలిగితే,వారికి అవకాశాలు ఇవ్వగలిగితే... చైనా భారత్‌లోకి వచ్చే సాహసం చేయదు.' అని రాహుల్ పేర్కొన్నారు.

Recommended Video

Petrol Price Hike: Petrol crosses Rs 100 per litre in this city, check rates in your region here

దేశంలో చిన్న,మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేయగలిగితే చైనా,దాని అధ్యక్షుడు కూడా భారత ఉత్పత్తులను వాడుతారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయట్లేదని... కేవలం నలుగురైదుగురు బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే మేలు చేస్తోందని మండిపడ్డారు.

Fact Check

వాదన

రాహుల్ గాంధీ ఇండియన్ ఆర్మీని చులకన చేసే వ్యాఖ్యలు చేశారు.

వాస్తవం

ఆయన వ్యాఖ్యలను వేరే ఉద్దేశంలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
video of Rahul Gandhi speaking at a public meeting in Tamil Nadu is viral on social media with the claim that the Congress leader suggested replacing the Indian Army with labourers, farmers and workers at the volatile China border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X