వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check:గాంధీజీతో ఉన్న ఈ బాలుడు ఎవరు..స్వామి ఆత్మానందేనా..?

|
Google Oneindia TeluguNews

శుక్రవారం రోజున స్వామి ఆత్మానంద్‌ వార్షికోత్సవం జరిగింది. ఈ సమయంలో ఆయన జీవితం గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో మరియు ఇతర వెబ్‌సైట్స్‌లో వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఫోటో ఒకటి కనిపించింది. ఈ ఫోటోలో గాంధీజీ మరియు స్వామి ఆత్మానంద్‌లు సన్నిహితంగా ఉన్నారంటూ పేర్కొనబడింది. ఈ ఫోటో గురించి నిజనిజాలు తెలుసుకోకుండా చాలామంది సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేశారు. విపరీతంగా షేర్ చేశారు. అయితే ఇదే ఫోటో ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా వైరల్ అయ్యింది.

వైరల్ అయిన ఫోటోలో ఒక బాలుడు కర్ర సహాయంతో గాంధీజీని ముందుండి నడిపిస్తున్నట్లుగా ఉంది. ఫోటోలో కనిపిస్తున్న చిన్నారే స్వామీ ఆత్మానంద్ అని ప్రచారం జరిగింది. స్వామీ ఆత్మానంద్ అసలు పేరు రామేశ్వర్. 1933 గాంధీజీ ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన సమయంలో ఈ చిన్నారి గాంధీజీకి ముందుండి నడిచారని ప్రచారం జరిగింది. చిన్నప్పుడే తాను సాధువుగా మారాలని స్వామి ఆత్మానంద్ భావించారని కూడా ప్రచారం జరిగింది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్టు కావడంతో ఆ చిన్నారే స్వామీ ఆత్మానంద్ అని భావించి చాలా మంది నివాళులు కూడా అర్పించారు. ఇక అసలు విషయానికొస్తే ఆ ఫోటో ఛత్తీస్‌గఢ్‌లో తీసింది కాదని ఆ బాలుడు స్వామీ ఆత్మానంద్ కాదని తెలిసింది.

 Fact Check: Who is the little kid along with Gandhi in the photo,Is he swami Atmanand?

వాస్తవం ఏమిటో మా బృందం పరిశోధనలు చేయగా ఆ ఫోటో ఛత్తీస్‌గఢ్‌లో తీశారని చెప్పడం అవాస్తవమని తేలింది. అయితే మహాత్మాగాంధీ 1937లో ముంబైలోని జూహూ బీచ్‌కు వచ్చిన సమయంలో ఆ చిన్నారి గాంధీజీ ముందుండి నడిచాడు. మరొక విషయం ఏమిటంటే ఆ చిన్నారి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా స్వామి ఆత్మానంద్ కాదని తేలింది. మహాత్మా గాంధీకి సంబంధించిన ఈ చారిత్రక ఫోటోలో కనిపిస్తున్న కర్రతో నడిచే పిల్లవాడు అతని మనవడు కాను గాంధీ అని నిర్థారించడమైంది.

Fact Check

వాదన

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి స్వామి ఆత్మానంద్..ఛత్తీస్‌గఢ్‌లో 1933లో తీసిన ఫోటో

వాస్తవం

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి గాంధీ మనవడు కాను గాంధీ..అది 1937లో ముంబైలోని జూహూ బీచ్‌లో తీసిన ఫోటో

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
The photo that of Mahatma Gandhi with a little boy walking had gone viral on social media that claims that the little boy was Swami Atmanand.But what the fact is that he is the grandson of Gandhiji.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X