వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check : కోవిడ్ 19 వ్యాక్సిన్ మానవ డీఎన్ఏని మార్పులకు గురిచేస్తుందా?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారం తెర పైకి వచ్చింది. కోవిడ్ 19 వ్యాక్సిన్‌ ద్వారా మానవ శరీరంలో mRNA అణువులను ప్రవేశపెడుతారని... అది శరీర డీఎన్ఏలో మార్పులు చేస్తుందని ఓ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది.

డా.క్రిస్టియన్ నార్త్‌రప్ అనే ఆరోగ్య నిపుణురాలు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని అంశాల ఆధారంగా ఈ కొత్త వాదనను తెర పైకి తీసుకొచ్చారు. 37నిమిషాల నిడివి గల ఆ ఇంటర్వ్యూలో 4నిమిషాలు ఆమె దీనిపై మాట్లాడారు. ఆ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తన వాదనకు ఆమె ఎటువంటి ఆధారాలను చూపించలేదు.

Fact check: Will COVID-19 vaccine alter human DNA

ఆరోగ్య నిపుణుల చెప్తున్న వివరాల ప్రకారం... mRNA వ్యాక్సిన్లు శరీరంలో RNA అణువులను ప్రవేశపెట్టడం ద్వారా పనిచేస్తాయి. తద్వారా SARS-CoV-2ని పోలిన వైరల్ ప్రోటీన్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఆ ప్రొటీన్‌ను కరోనా వైరస్‌గా భావించి శరీరంలోని కణాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు కరోనా వ్యాక్సిన్ శరీర డీఎన్ఏని మార్చదు. ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు.

కాగా,ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా,స్పుత్నిక్ వి,కోవ్యాక్సిన్,మోడెర్నా,ఫైజర్ తదితర వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సమీప భవిష్యత్తులోనే ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Fact Check

వాదన

కరోనా వ్యాక్సిన్ మానవ శరీర డీఎన్ఏను మార్పులకు గురిచేస్తుంది.

వాస్తవం

mRNA వ్యాక్సిన్లు మానవ శరీర డీఎన్ఏలో మార్పులు చేయవని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
A WhatsApp forward has gone viral in which it is claimed that the the COVID19 vaccine will introduce mRNA molecule in the body that will change people's DNA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X