వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check:భారత్‌లో ట్విటర్ పై నిషేధం..? ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల్లో ఏముంది..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భారత్‌లో ట్విటర్‌ను నిషేధిస్తున్నారా...? భారత్‌లో ట్విటర్‌ను నిషేధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా..? ట్విటర్‌కు భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది. భారత్‌లో సోషల్ మీడియా నిబంధనలు పాటించకపోతే ట్విటర్‌పై 24 గంటల్లో నిషేధం విధిస్తామంటూ వార్తలు జోరందుకున్నాయి.

అయితే గత కొన్నిరోజులుగా ట్విటర్ వేదికగా రైతు నిరసనలపై వార్తలు విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో ప్రభుత్వం ట్విటర్‌కు నోటీసులు ఇచ్చిందనేది వాస్తవం. గణతంత్ర దినోత్సం రోజున జరిగిన హింసలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండటంతో వారి అకౌంట్లను నిలిపివేయడం కానీ లేదా సస్పెండ్ చేయడం కానీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది.

Fact Check:Will twitter be banned in India, Check the details

బుధవారం ట్విటర్‌కు ఇచ్చిన నోటీసుల్లో చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది ఐటీ మంత్రిత్వ శాఖ. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు జరిగిన ట్వీట్స్‌ను తొలగించాలని లేదంటే జైలుశిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే కొన్ని ట్విటర్ అకౌంట్స్‌ను సస్పెండ్ చేసిన ట్విటర్ యాజమాన్యం కొన్ని గంటల తర్వాత తిరిగి వాటిని యాక్టివేట్ చేసింది.

అయితే ప్రభుత్వం ట్విటర్‌ను మరోమారు హెచ్చరించింది. దీంతో ట్విటర్ మొత్తం మూడు ఖాతాలను సస్పెండ్ చేసింది. అందులో సంయుక్త్ కిసాన్ మోర్చా, ట్రాక్టర్ టూ ట్విటర్, మరియు బీకేయూలు సస్పెండ్‌కు గురయ్యాయి.ఇదిలా ఉంటే ట్విటర్‌పై చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం పావులు కదుపుతోందనే విషయం వాస్తవమే. అయితే నిషేధం విధించాలన్న అంశంపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. ఒకవేళ ట్విటర్ చర్యలు తీసుకోకపోతే జైలు శిక్ష లేదా భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుందని మాత్రమే నోటీసుల్లో పేర్కొంది. అంతే తప్ప ఏకంగా ట్విటర్‌నే నిషేధించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వం చేయడం లేదు.

Fact Check

వాదన

ప్రభుత్వం ట్విటర్‌ను భారత్‌లో నిషేధిస్తోంది

వాస్తవం

చర్యలు తీసుకోకుంటే జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందన్న ప్రభుత్వం

రేటింగ్

Half True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
The social media is abuzz with messages that Twitter is likely to be banned in India. Some users have said that Twitter has been served notice by the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X