వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake : రైతులకు మద్దతుగా శౌర్యశక్ర పతకాలు వెనక్కి ఇచ్చిన 25వేల మంది సైనికులు

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు. తాజాగా భారత్‌ బంద్‌ కూడా నిర్వహించారు. రైతుల ఆందోళనలతో కేంద్రానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో రైతుల ఆందోళనలకు దేశవ్యాప్తంగా పలు వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. దీంతో రైతులు కూడా పట్టు వీడకుండా నిరనసలు కొనసాగిస్తున్నారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా 25 వేల మంది భారతీయ సైనికులు తమకు ఇచ్చిన శౌర్యచక్ర పతకాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీకి చెందిన ప్రజాశక్తి పత్రిలో కిసాన్‌కు జైకొట్టిన జవాన్‌ పేరుతో ప్రచురితమైన ఈ వార్తను పలువురు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఈ వార్తపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చింది. తన ఫ్యాక్ట్‌ చెక్‌ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని పీఐబీ పోస్ట్ చేసింది.

Fake: 25,000 soldiers have not returned Shaurya Chakra medals in support of farmers

వాస్తవానికి 1956లో దేశంలో శౌర్య చక్ర పతకాలు ఇవ్వడం మొదలుపెట్టాక ఇప్పటివరకూ కేవలం 2048 మంది సైనికులకే ఈ పతకాలు ప్రదానం చేశారు. దీంతో 25 వేల మంది సైనికులు శౌర్యచక్ర పతకాలు వెనక్కి ఇచ్చే ప్రశ్నే తలెత్తదు. మరోవైపు రైతుల నిరసనలకు మద్దతుగా పంజాబ్‌, హర్యానాకు చెందిన ముగ్గురు బాక్సర్లు గుర్‌బక్ష్‌ సింగ్‌ సంధూ, కౌర్‌ సింగ్, జైపాల్ సింగ్‌ మాత్రమే తమ పతకాలు వెనక్కి ఇచ్చారు. మరో బాక్సర్‌ విజేందర్‌ సింగ్ రైతులకు మద్దతు ప్రకటించారు. మరికొందరు అర్జున, పద్మశ్రీ అవార్డు విజేతలు తమ పతకాలు వెనక్కి ఇస్తామని ప్రకటించారు.

Fact Check

వాదన

రైతులకు మద్దతుగా శౌర్యచక్ర పతకాలు వెనక్కి ఇచ్చిన 25 వేల మంది సైనికులు

వాస్తవం

మనదేశంలో 1956 నుంచి ఇప్పటివరకూ కేవలం 2048 మందికే శౌర్యచక్ర పతకాలు ఇచ్చారు

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
press information bueuro declare the news of 25000 soldiers have returned their shaurya chakra awards in support of farmers is fake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X