వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check : భారత్‌ ఆర్మీపై చైనా మైక్రోవేవ్‌ వెపన్స్‌తో దాడి చేసిందా..?

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దౌత్యపరంగా,మిలటరీ పరంగా చర్చలు జరుగుతూనే ఉన్నా.. సరిహద్దు వివాదం ఓ కొలిక్కి రావట్లేదు. ఈ నేపథ్యంలో జిన్ కాన్‌రాంగ్ అనే ఓ చైనా ప్రొఫెసర్ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. భారత్ ఆక్రమించిన వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయించేందుకు చైనా మెక్రోవేవ్ వెపన్స్‌తో దాడులకు దిగిందన్నారు.

Recommended Video

India-China Stand Off : India ని మానసికంగా దెబ్బకొట్టేందుకు China దుష్ప్రచారాలు..!!

అంతేకాదు,చైనా మైక్రోవేవ్ దాడులకు భారత దళాలు వాంతులు చేసుకున్నాయని.. బలవంతంగా అక్కడినుంచి వెనక్కి వెళ్లేందుకు సిద్దపడ్డాయని అన్నారు. దీంతో ఎటువంటి కాల్పులకు చోటు లేకుండానే చైనా ఆ వ్యూహాత్మక శిఖరాలను తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం చిక్కిందన్నారు.

Fake : china did not used microwave weapons to retreat indian army

మరోవైపు చైనా ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలను భారత ఆర్మీ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని చెప్పింది. భారత ఆర్మీని మానసికంగా దెబ్బకొట్టేందుకే చైనా ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించింది. పాంగాంగ్ త్సో సరస్సుకు దక్షిణ తీరాన ఉన్న కైలాష్ రేంజ్ శిఖరాలను భారత్ ఆక్రమించిన షాక్ నుంచి పీఎల్ఏ ఇంకా తేరుకోవట్లేదని పేర్కొంది.

కాగా,మైక్రోవేవ్ వెపన్స్‌ మానవ కణజాలాన్ని టార్గెట్ చేస్తాయి. దాని నుంచి ప్రసరించే విద్యుత్ అయస్కాంత తరంగాలు మానవ శరీరం భరించలేనంత నొప్పిని పుట్టిస్తాయి. పర్వత శ్రేణుల్లో శత్రు దేశ బలగాలను వెనక్కి తరిమేందుకు ఇలాంటి ఆయుధాలు వాడుతుంటారు.

భారత్-చైనా మధ్య గత కొన్ని నెలలుగా సరిహద్దు వివాదం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జూన్‌లో సరిహద్దులోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆ దేశం అధికారికంగా దానిపై ఏమీ మాట్లాడలేదు. అప్పటినుంచి ఇప్పటివరకూ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Fact Check

వాదన

భారత ఆర్మీ లక్ష్యంగా మైక్రోవేవ్ వెపన్స్‌తో చైనా దాడికి పాల్పడింది.

వాస్తవం

ఇది పూర్తిగా అవాస్తవమని ఇండియన్ ఆర్మీ పేర్కొంది.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
Some media reports had claimed that the Chinese PLA had used microwave arms at the Line of Actual Control and forced Indian soldiers to retreat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X