వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షెడ్యూల్ ప్రకారమే CLAT ఎగ్జామ్, సోషల్ మీడియాలో ట్రోల్‌పై లా కన్సార్టియం క్లారిటీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ తేదీలు వాయిదా పడుతున్నాయి. అయితే కామన్ లాత అడ్మిషన్ టెస్ట్ (సీఎల్ఏటీ) పరీక్షను సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహిస్తామని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. అయితే సీఎల్ఏటీ పరీక్ష వాయిదా వేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫేక్ సర్క్యులేషన్ ట్రోల్ అవుతోంది. దీంతో కన్సార్టియం స్పందించింది. అదీ అసత్యం అని స్పష్టంచేసింది.

సెప్టెంబర్ 7వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని స్పష్టంచేసింది. పరీక్షకు సంబంధించి తమ వెబ్ సైట్‌లో చూడాలని కోరింది. సోషల్ మీడియోలో సర్క్యులేట్ అవుతోన్న ఫేక్ మేసెజ్‌ను విశ్వసించొద్దని తెలిపారు. ప్రవేశ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డు కూడా జారీచేస్తామని తెలిపారు. దేశంలోని వివిధ వర్సిటీలకు చెందిన విద్యార్థులకు సీఎల్ఏటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Fake: CLAT 2020 has not been postponed again

Recommended Video

NEET, JEE Main 2020 : No Postponement, Govt | 7 Non BJP States to Move Supreme Court || Oneindia

వాస్తవానికి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ నెలలో జరగాల్సి ఉంది. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత మే 24వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. అదీ అక్కడినుంచి ఆగస్ట్ నెలకు మారింది. చివరికీ సెప్టెంబర్ 7వ తేదీన పరీక్షను ఖరారు చేశారు. కానీ 7వ తేదీన కూడా జరగదని తప్పుడు పత్రం సర్క్యులేట్ అవుతోంది. దీంతో లా కన్సార్టియం స్పందించింది. వచ్చేనెల 7వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని స్పష్టంచేసింది.

Fact Check

వాదన

CLAT 2020 has been postponed until further notice

వాస్తవం

CLAT 2020 has not been postponed, will be held on September 7

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
Common Law Admission Test 2020 has been postponed has gone viral on the social media. but is it fake says Executive Committee of the Consortium of National Law Universities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X