వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake : ఆదానీ రైల్వే... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో ఫేక్..

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం రైల్వేని కూడా ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో టికెట్‌పై ఆదానీ రైల్వే అని పేర్కొని ఉండటం... దాని ధర రూ.50గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. రైల్వేని ఆదానీకి అమ్మేస్తే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర ఇంతలా పెరగడంలో ఆశ్చర్యం ఏముంటుందని చాలామంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే రైల్వేని కేంద్రం ఆదానీకి అమ్మేయడంలో నిజమెంత... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టికెట్‌ నిజమైనదేనా...?

ఈ రెండింటికి కాదనే సమాధానమే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైల్వేని ఆదానీకి అమ్మలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుణే జంక్షన్ పేరుతో వైరల్ అవుతున్న ఆ ప్లాట్‌‌ఫామ్ టికెట్ ఈ ఏడాది అగస్టు నెలలోనూ వైరల్ అయింది. అయితే అప్పట్లో దానిపై ఆదానీ రైల్వే అనే పేరు లేదు. కేవలం పుణే జంక్షన్ అని మాత్రమే ఉంది. ఇక ధర విషయానికొస్తే.. అప్పట్లో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా స్టేషన్‌లో రద్దీని నియంత్రించే ఉద్దేశంతో ప్లాట్‌ఫాం టికెట్‌ను రూ.5 నుంచి రూ.50కి పెంచారు. దీంతో చాలామంది ఈ ప్లాట్‌ఫాం టికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

fake Govt of India has not sold Railways to Adani

అదే టికెట్‌పై ఆదానీ రైల్వే అనే పేరును ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. దీన్నిబట్టి ఎవరో దీనిపై ఆ పేరును రాసి ఉంటారని తెలుస్తోంది. కేంద్రం రైల్వేని ఆదానీకి అమ్మేసిందని ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ప్రచారం చాలాసార్లే జరిగింది. ఇటీవల ఓ రైలు బోగీపై ఆదానీ సంస్థ పేరున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్ అని తేలింది. ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న ఈ ప్లాట్‌ఫాం టికెట్ కూడా ఫేక్ అని తేలింది.

Fact Check

వాదన

ప్లాట్‌ఫాం టికెట్‌పై ఆదానీ రైల్వే పేరు

వాస్తవం

ఇది మార్ఫింగ్ చేయబడిన ఫోటో. ఒరిజినల్ ఫోటోలో ఆదానీ రైల్వే పేరు లేదు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
A picture of a railway platform ticket with Adani Railway written on it has gone viral. It says that Railways is not our private property. The ticket from the Pune railway station also mentions other information such as date, time, the ticket number and a price of Rs 50.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X