వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check : ఇండియన్ పాస్‌పోర్టులో ఆ కాలమ్‌ను తొలగించారా...?

|
Google Oneindia TeluguNews

భారత ప్రభుత్వం ఇండియన్ పాస్‌పోర్ట్ నుంచి 'జాతీయత' అనే కాలమ్‌ను తొలగించిందా..? అవును... నిజమేనంటూ హిందీలో ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'లీగల్ అప్‌డేట్... భారత పాస్‌పోర్టుల నుంచి మోదీ ప్రభుత్వం జాతీయత అనే కాలమ్‌ను తొలగించింది. కాబట్టి మీ పాత పాస్‌పోర్టులను కోల్పోకుండా చూసుకోండి.' అని అందులో పేర్కొన్నారు. డా.సయ్యద్ ఎతేమద్ ఉద్దీన్ అనే న్యాయవాది పేరుతో ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది.

ఈ ప్రచారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. వన్‌ఇండియా టీమ్ విదేశాంగ శాఖతో సంప్రదించగా... ప్రతీ ట్రావెల్ డాక్యుమెంట్‌లో కచ్చితంగా జాతీయత కాలమ్ ఉంటుందని,ఇండియన్ పాస్‌పోర్టులోనూ అది తప్పనిసరి అని తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ మెసేజ్‌ పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.

 Fake: Modi government has not removed nationality claim from Indian passports

కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పాస్‌పోర్టుల్లో జాతీయత కాలమ్‌ను తొలగించినట్లు ఎక్కడా వార్తా కథనాలు కూడా రాలేదు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రా వెబ్‌సైట్‌లోనూ ఇలాంటి నోటిఫికేషన్ ఏదీ కనిపించలేదు. కాబట్టి ఈ ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. ఇండియన్ పాస్‌పోర్టులో జాతీయత కాలమ్‌ను ప్రభుత్వం తొలగించలేదు.

Fact Check

వాదన

ఇండియన్ పాస్‌పోర్టు నుంచి జాతీయత కాలమ్‌ను మోదీ ప్రభుత్వం తొలగించింది.

వాస్తవం

కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
message claiming that the Indian government has removed the column for nationality in Indian passports is going viral on social media.The claim in Hindi in the form of a WhatsApp message attributed to one Syed Etemad Uddin advocate translates to, "Legal Update: Modi government has removed the "Nationality" column from Indian passports. So, make sure not to destroy or lose your old passports."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X