వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake : అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోగానే కుప్పకూలిన నర్సు- చనిపోలేదా ?

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోంది. అమెరికాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ తీసుకున్న నర్సు వెంటనే కుప్పకూలి చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

అమెరికాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న నర్సు పేరు టిఫానీ డోవర్. అమెరికాలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఆమెకు తనకు శరీరంలో ఏదైనా నొప్పు వచ్చినప్పుడు కుప్పకూలే మానసిక రోగం ఉంది. తనకున్న శారీరక, మానసిక సమస్యల వల్ల ఇలా జరుగుతోందని ఆమె తాజాగా ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. దీంతో నర్సు టిఫానీ కరోనా వ్యాక్సిన్‌ తీసుకుని చనిపోయినట్లు వస్తున్న వార్తలకు తెరపడినట్లయింది.

Fake: Nurse who took COVID-19 vaccine and fainted is not dead

అదే సమయంలో టిఫానీ నర్సుగా పనిచేస్తున్న ఆస్పత్రి కూడా ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని, ఎలాంటి సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చింది. ఆమె చనిపోయినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోగానే నర్సు చనిపోయిందంటూ జరిగిన ప్రచారం అంతా ఫేక్ అని తేలిపోయింది. ఆస్పత్రి రిలీజ్‌ చేసిన వీడియో చూసిన తర్వాత కరోనా వ్యాక్సిన్ కోసం ఎధురుచూస్తున్న రోగులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫేక్‌ ప్రచారాలపై మండిపడుతున్నారు.

Fact Check

వాదన

అమెరికాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నర్సు వెంటనే కుప్పకూలి చనిపోయింది.

వాస్తవం

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న నర్సు టిఫానీ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి ప్రకటన

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
An image has gone viral in which it has been claimed that a nurse in the United States who fainted after receiving her first dose of the coronavirus vaccine has died. but finally it has proved fake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X