హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fact check : లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌ మళ్లీ ఆస్పత్రిలో చేరారా..?

|
Google Oneindia TeluguNews

అనారోగ్యంతో ఆస‍్పత్రిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఇటీవల డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం(నవంబర్ 2) ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు,కొంతమంది ఏకంగా కపిల్(61) ఇక లేరంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ స్వయంగా స్పందించి ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. 21 సెకన్ల నిడివి గల ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన చాలా ఆరోగ్యంగా,సంతోషంగా కనిపిస్తున్నారు. నవంబర్ 11న బార్‌క్లేస్ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు.

legendary cricketer Kapil Dev becomes victim of death hoax

అంతేకాదు,క్వశ్చన్&ఆన్సర్ సెషన్ కోసం ప్రశ్నలతో సిద్దంగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఇక త్వరలోనే తన 1983 వరల్డ్ కప్ క్రికెట్ టీమ్‌ను కలవాలనుకుంటున్నానని చెప్పారు. ఇందుకోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. తన కోసం స్పందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.దీంతో కపిల్‌పై జరుగుతున్న దుష్ప్రచారానికి తెరపడినట్లయింది..

Recommended Video

Fact check:Watch Signal Crossing The Road But It's Not From Hyderabad రోడ్డు దాటుతున్న సిగ్నల్!!

కపిల్ సన్నిహితుడు,మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా ఆయన ఆరోగ్యంపై దుష్ప్రచారాన్ని ఖండించారు. సోషల్ మీడియాలో బాధ్యతారాహిత్యమైన పోస్టులు సరికాదన్నారు. కాగా, ఇటీవల కపిల్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి వైద్యులు కపిల్‌కు సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత త్వరగానే కోలుకున్న కపిల్ ఈ నెల 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Fact Check

వాదన

కపిల్ దేవ్ అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు.

వాస్తవం

కపిల్‌ దేవ్ మళ్లీ ఆస్పత్రిలో చేరలేదు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
Various tweets from unverified users had spread false rumors about the legendary Indian all-rounder Kapil Dev's health being admitted to the hospital once again, and of his passing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X