వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపికా పదుకొణెతో గ్రూప్ ఫొటోలో అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం: వాస్తవమేంటీ?

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, ఆమె భర్త, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌లతో అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం గ్రూప్ ఫొటో దిగారనే వార్తలు, దానికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రెండింగ్‌లో నిలిచింది. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంటగా నటించిన గోలియోంకి రాస్‌లీల రామ్‌లీలా మూవీ షూటింగ్ సందర్భంగా నిర్వహించిన డిన్నర్ ప్రోగ్రామ్‌లో దావుద్ ఇబ్రహీం కూడా పాల్గొన్నాడని, దీనికి సాక్ష్యంగా ఈ ఫొటోను చూపిస్తున్నారు నెటిజన్లు. దావుద్ ఇబ్రహీం.. తమ దేశంలోనే ఉన్నాడంటూ పాకిస్తాన్ ప్రకటంచడం, కొద్దిసేపటికే దాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో.. ఈ ఫొటో వైరల్‌గా మారింది.

Recommended Video

Priyanka Chopra, Deepika Padukone To Be Questioned By Mumbai Police || Oneindia Telugu

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె పాల్గొన్న పూజల్లో వెనుక వరుసలో కూర్చున్న ఓ వ్యక్తిని దావుద్ ఇబ్రహీంగా గుర్తిస్తూ ఆ ఫొటోను వైరల్ చేశారు. జస్టిస్ ఫర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనే పేరుతో క్రియేట్ అయిన ఓ గ్రూప్ ఈ ఫొటోను పోస్ట్ చేసింది. కొద్దిసేపట్లోనే అది నెట్టింట్లో హల్‌చల్ చేసింది. తమ స్నేహితులు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, సందీప్, మహేష్ షెట్టిలతో కలిసి దిగిన ఈ ఫొటోలో దావుద్ ఇబ్రహీం కూడా ఉన్నాడంటూ ఈ ఫొటోకు క్యాప్షన్‌ను జోడించి వదిలారు. ఇదే ఫొటోలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా ఉన్నారు.

 Man seen in image with Actress Deepika Padukone and Ranvir Singh is not Dawood Ibrahim

ఇది వాస్తవం కాదని, ఆ ఫొటోలో దీపికా, రణ్‌వీర్‌, సంజయ్ లీలా భన్సాలీతో ఉన్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం కాదని తేలింది. ఇదే ఫొటోను సందీప్ సింగ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దావుద్ ఇబ్రహీంగా చెబుతోన్న వ్యక్తి అసలు పేరు వాసిక్ ఖాన్ అని స్పష్టమైంది. సంజయ్ లీలా భన్సాలీ, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, ఆర్ వర్మన్, సిద్ధార్థ్ గరమిాలతో పాటు వాసిక్ ఖాన్ ఈ ఫొటోలో ఉన్నారని చెబుతున్నారు. వాసిక్ ఖాన్.. బాలీవుడ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారని స్పష్టమైంది. రామ్‌లీలా సినిమాకు కూడా ఆయనే ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారని అంటున్నారు.

ముంబై బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారిగా పేరుంది మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంకు. పేలుళ్లకు పాల్పడిన అనంతరం అతను పాకిస్తాన్‌కు పారిపోయాడు. అక్కడే తలదాచుకుంటున్నాడు. ఇన్నిరోజులూ దావుద్ ఇబ్రహీం తమదేశంలో లేడంటూ పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది. అంతర్జాతీయ వేదికల మీదా ఇదే విషయాన్ని ప్రకటించింది. రెండు రోజుల కిందట హఠాత్తుగా దావుద్ తమ దేశంలోనే ఉన్నట్లు ఓ ప్రకటన చేసింది. ఆ తరువాత ఏమైందో ఏమో గానీ.. దాన్ని వెనక్కి తీసుకుంది. అతను తమ దేశంలో లేడంటూ స్పష్టం చేసింది.

Fact Check

వాదన

దావూద్ ఇబ్రహీంతో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె

వాస్తవం

ఫోటోలో కనిపిస్తున్నది వాసిఖ్ ఖాన్, దావూద్ కాదు

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
Man seen in image with Actress Deepika Padukone and Ranvir Singh is not Dawood Ibrahim. An image claiming that Dawood Ibrahim was present at a meeting in which actors Ranveer Singh and Deepika Padukone are part of has gone viral on the social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X