బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fact check : సోషల్ మీడియాలో ఆ ఫోటోలతో ఫేక్ ప్రచారం...

|
Google Oneindia TeluguNews

హర్యానాలోని గురుగ్రామ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న సోహ్నా రోడ్ ఫ్లైఓవర్ శనివారం(అగస్టు 22) రాత్రి హఠాత్తుగా కూలిపోయిన సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్ కుప్పకూలిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇవే ఫోటోలతో కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి తెరదీశారు.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ కృపం ఫొనిక్స్ మాల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో బ్రిడ్జి కూలిపోయిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరికొందరు ఇది అహ్మదాబాద్‌లో జరిగిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఇవే ఫోటోలను పోస్టు చేశారు. అహ్మదాబాద్‌లోని విజయ్ క్రాస్ రోడ్ నుంచి కామర్స్ సిక్స్ రోడ్ మార్గమధ్యలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలినట్లు అందులో పేర్కొన్నారు. మరికొందరు ఇది ముంబైలో జరిగిందని సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ప్రచారాల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు.

pics of gurugram flyover collapse peddled as mumbai,bengaluru,ahmedabad

కాగా,గురుగ్రామ్ సోహ్నా రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయలవలేదు. ఆ సమయంలో ట్రాఫిక్ లేని కార‌ణంగా పెను ప్ర‌మాదం త‌ప్పింది. రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు దాదాపు రూ.2వేల కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవ‌ర్‌ను నిర్మిస్తున్నారు. ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Fact Check

వాదన

బెంగళూరు కేఆర్ పురంలోని ఫీనిక్స్ మాల్ దగ్గర మెట్రో బ్రిడ్జి కూలిందంటూ ప్రచారం

వాస్తవం

వాస్తవానికి హర్యానాలోని గురుగ్రామ్ పరిధిలో ఉన్న సోహ్నా రోడ్ ఫ్లై ఓవర్ కూలిన ఫోటో

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
Images showing a portion of an under construction flyover in Gurugram that collapsed on August 22,2020 is being peddled with fake claims of an accident that happened in mumbai,bengaluru,ahemdeabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X