వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake : యువతిపై పోలీస్ దాడి... ఆ వీడియోతో ఫ్రాన్స్‌కి సంబంధం లేదు...

|
Google Oneindia TeluguNews

చేతులకు బేడీలు వేసి ఉన్న ఓ మహిళపై ఓ పోలీస్ అధికారి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగిందని... ఓ ముస్లిం యువతిని అరెస్ట్ చేసిన నాజీ పోలీస్ ఆమె హెడ్ స్కార్ఫ్‌ని బలవంతంగా లాగిపారేసేందుకు ప్రయత్నించాడని... సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత...?

వన్‌ఇండియా టీమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి దీని ఒరిజినల్ వీడియోని గుర్తించింది. సోషల్ మీడియాలో పేర్కొన్నట్లుగా ఇది ఫ్రాన్స్‌లో జరిగిన ఘటన కాదు. 2017లో కెనడాలోని కాల్గరీలో కోర్టు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలో ఓ యువతిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

Video of Muslim girl being thrown to the ground by police is not from France

అనంతరం ఆమె చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఆమెను జైలుకు తరలిస్తున్న ఓ పోలీస్ అధికారి... ఆమె హెడ్ స్కార్ఫ్‌ని తొలగించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో.. ఆమెను బలంగా నేలకేసి కొట్టాడు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఆ పోలీస్ అధికారిపై కేసు కూడా నమోదైంది. కాబట్టి సోషల్ మీడియాలో కొంతమంది పేర్కొన్నట్లు ఇది ఫ్రాన్స్‌లో జరిగిన ఘటన ఎంతమాత్రం కాదు. అందులో ఎలాంటి నిజం లేదు.

ఇటీవల ఫ్రాన్స్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు మాక్రోన్... ఇస్లామిక్ తీవ్రవాదంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై అక్కడి ముస్లింల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న మాక్రోన్... తాను ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని ఇస్లామిక్ తీవ్రవాదంపై ఫ్రాన్స్ పోరాడుతుందని చెప్పానన్నారు.

Fact Check

వాదన

ముస్లిం యువతిపై ఫ్రాన్స్ పోలీస్ అధికారి దాడి

వాస్తవం

ఈ వీడియోకి సంబంధించిన ఘటన మూడేళ్ల క్రితం కెనడాలో జరిగింది

రేటింగ్

Half True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
A video of a handcuffed woman being hit to ground face first has been widely circulated on the social media. It has been claimed that this video is from France and the police there tried to rip a the video has been captioned as french police arrests
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X