ట్రాఫిక్భద్రతపై మరోసారి!

కంచిపీఠాధిపతి పోలీసు కస్టడీలో ఉన్న మూడురోజులూ ఏమేం జరిగిందీ నక్కీరన్ అనేప్రముఖ తమిళ పత్రిక తాజా సంచికలోవివరించింది. ఇంటరాగేషన్ ప్రక్రియ మొత్తాన్నీపోలీసులు వీడియో తీసినట్టు కూడా రాసింది. నక్కీరన్కథనం ప్రకారం జయేంద్రసరస్వతి తన వయసు వారైన మాధవన్, రాధాకృష్ణన్, శంకరరామన్లనుహత్య చేసేందుకు ప్రయత్నించారు. చావు తప్పించుకున్నమాధవన్,రాధాకృష్ణన్‌లు వైష్ణవులు కాగా హతుడైనశంకరరామన్ మాత్రం శైవుడు.
మాధవన్చైన్నైలో స్కూటరు మీద వెళ్తుండగా కొందరుదుండగులు మోటార్ సైకిళ్ల మీద వచ్చిఆయనను కత్తులతో పొడిచి పారిపోయారని,తీవ్రంగా గాయపడిన మాధవన్‌ను అపోలోఆస్పత్రిలో చికిత్సకు చేర్చారని, పోలీసులు అప్పుడు ఎలాంటికేసులుపెట్టలేదని నక్కీరన్ పత్రిక రాసింది.రాధాకృష్ణన్ అనే వ్యక్తి కూడా తనఇంట్లోనే దుండగుల దాడిలో గాయపడ్డాడు.ఈ సంఘటనలు జరిగి రెండేళ్ళయింది. ఈ రెండుకేసుల్లో పోలీసులు ఎటువంటి ఒత్తిళ్ళకుగురవకుండా దర్యాప్తు కొనసాగించి ఉంటేశంకరరామన్ హత్య జరిగిఉండేదికాదని నక్కీరన్ అభిప్రాయపడింది.
కాగామాధవన్, రాధాకృష్ణన్, శంకరరామన్ముగ్గురికీ ఏకైక శత్రువు శ్రీ జయేంద్రసరస్వతి కావడం గమనార్హం.ముగ్గురూ దాదాపు ఒకే వయసు వారు.శంకరమఠంతో సత్ సంబంధాలునెరపిన వారు. పెద్దాయన చంద్రశేఖరేంద్రసరస్వతి బతికి ఉన్న రోజుల్లో ఈ ముగ్గురూఆయనకు సన్నిహితంగా మెలిగారు. తమవయసు వాడైన జయేంద్ర పీఠాధిపతికావడం, ఆయ్న వ్యక్తిగత బలహీనతలుతెలిసిన వారవడం కారణంగా వీరుఆయనను నిలదీయడం ప్రారంభించారు.
కంచిమఠం పవిత్రత దెబ్బతింటున్నదనిఆవేదన వ్యక్తం చేశారు. పీఠంఎక్కిన తర్వాత జయేంద్ర వీరి ముగ్గురినీకంచి మఠం నుంచి తరిమేశారు. అయినా ఈముగ్గురూ మఠంలోని ఉద్యోగుల ద్వారా కంచిస్వామి కదలికల మీద నిఘా పెట్టి ఎప్పుడేంజరుగుతున్నదో తెలుసుకునే వారు.వీరే పత్రిఅకలు కొంత సమాచారాన్ని లీక్ చేసేవారు. దినపత్రికలు అటువంటి సమాచారాన్ని బ్లాక్చేసినా నక్కీరన్వంటి బ్రాహ్మణేతర పత్రికలు కంచిపీఠం మీద తాము వాస్తవాలు అని నమ్మినకథనాలను ప్రచురించేవి.
ఈముగ్గురు వ్యక్తులు తరచుగా కంచిస్వామి మీద బహిరంగ విమర్శలు చేసేవారు.కరపత్రాలు పంచేవారు. ఈ చికాకు భరించలేకవీరిని శాశ్వతంగా తొలగించుకోవాలని జయేంద్రసరస్వతి ప్రయత్నించి ఉండవచ్చని, అందుకుమొదట తమిళనాడు ముఖ్యమంత్రిజయలలిత సహకరించినా, మారినరాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో అడ్డంతిరిగి ఉండవచ్చని నక్కీరన్ పత్రికఅభిప్రాయపడింది.
తననుధిక్కరించిన వారి అంతు చూడడానికి, తనరాజకీయ భవిష్యత్తుకు విఘాతం కల్పించేవారికిబేడీలు వేయించడానికి వెనుకాడని తత్వంజయలలితది. ఆమె ఒక నిర్ణయానికి వస్తే అదిఅమలు జరిగి తీరాల్సిందే. పోలీసుల నుంచి కంచిస్వామిపై పూర్తి వివరాలు తెప్పించుకున్నజయలలితకు ఈ పరిస్ధితుల్లో కంచి స్వామినిరక్షించడానికి ప్రయత్నిస్తే తన పీఠంకదిలిపోవడమే గాక తన కటకటాలపాలుకావలసి వస్తుందన్న భయం పట్టుకుంది.
వెంటనే ఆమె పోలీసులను కంచి స్వామిమీదకు ఉసిగొల్పింది. జయలలిత తననురక్షిస్తుందని ఆశించిన కంచి స్వామికిఆశాభంగం కలిగింది. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించేద్రవిడ పార్టీకి నాయకత్వం వహిస్తున్నబ్రాహ్మణ కులస్తురాలు ఆమె. ఎంజిఆర్ ఫ్యాన్స్, తనసొంత అభిమానులు, బ్రాహ్మణులు జయలలితకుగట్టి ఓటు బ్యాంకు. ఇప్పుడామె శంకరపీఠంతో తలపడడంతో తమిళరాజకీయాల్లో తీవ్ర మార్పులు వస్తాయని నక్కీరన్ పత్రిక రాసింది.
కొసమెరుపు
కంచిస్వామి విషయంలో జయలలితను అప్రతిష్ట పాలుచేద్దామనుకుని స్క్రిప్టు సిద్ధంచేసుకున్న డిఎంకె అధినేత కరుణానికికథ అడ్డం తిరిగింది. జయలలితఇంత సడన్‌గా కంచి స్వామిని జైలుకు పంపుతుందనిఆయన ఊహించలేదు. ఆయన ఇప్పుడుస్ప్రిప్టులో మార్పులు చేసుకోవాల్సిన పరిస్ధితిఏర్పడింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!