వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిఆర్యస్మంత్రుల వీరంగం
కొన్ని రోజుల కిందట విప్లవ్ గారు "సాంస్కృతిక చెర అనే పేరుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కొన్ని కారణాలు చూపిస్తూ ఒక వ్యాసం రాశారు. ఆయన చెప్పిన కారణాలను విమర్శిస్తూ "తెలంగాణా భాష కూడా తెలుగు భాషే అని నేనొక వ్యాసం రాశాను. నేను రాసింది తెలంగాణ విషయాన్ని పూర్తిగా చర్చిస్తూ, అన్ని విషయాలతోనూ, పరిష్కారాలతోనూ రాసిన వ్యాసం కాదు. విప్లవ్ చెప్పిన కారణాలు కరెక్టు కావనీ, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం బడుగు ప్రజలకు ఎటువంటి మేలూ చెయ్యదనీ చెప్పడమే ఆ విమర్శ వుద్దేశ్యం. నేను రాసిన వ్యాసంలోని చాలా విషయాలను వదిలేసి, నేను రాసినవి సరిగా అర్థం చేసుకోకుండా, ఇంకా ఏవేవో ఆరోపణలు చేస్తూ కె. నిశాంత్గారు " ఆధిపత్య దబాయింపులు అనే పేరుతో ఒక వ్యాసం రాశారు. ఇప్పుడు ఆ వ్యాసం నిశాంత్గారు రాసిన వ్యాసానికి బదులుగా రాస్తున్నాను.
Story first published: Wednesday, July 17, 2002, 23:53 [IST]