వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధిపత్య దబాయింపులు

By Staff
|
Google Oneindia TeluguNews

భాష విషయంలో ప్రసాద్‌ గారు గొప్ప సత్యాన్ని తెలియజెప్పారు. తెలంగాణ తెలుగు భాషా మాండలికమనేది ఆ సత్యం. విప్లవ్‌ గారు భాషను ముందుకు తెచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఏ విధంగా వాదిస్తున్నారో, అదే భాష పేరు చెప్పి అది కూడదని ప్రసాద్‌ వాదిస్తున్నారు. భాషా శాస్త్రవేత్తల పరిభాషలో తెలంగాణ ఒక మాండలికం ఇది ఎవరూ కాదనరు. బహుశా విప్లవ్‌ కాదంటారని నేను అనుకోవడం లేదు. తెలుగు భాషా ప్రాంతాన్ని నాలుగు మాండలిక ప్రాంతాలుగా భాషా శాస్త్రవేత్తలు విభజించారు. భద్రిరాజు కృష్ణమూర్తిగారినో, చేకూరి రామారావుగారినో అడిగితే ఈ మాండలికాల గురించి మంచి పాఠం చెబుతారు. ప్రాంతీయ మాండలికాల గురించే ఇతర మాండలికాల గురించి కూడా వారు చెప్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X