వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బి యస్ రాములు

By Staff
|
Google Oneindia TeluguNews

ఒకఊహాతీత విభ్రమం యాసారి ఎన్నికల ఫలితాలు.నివ్వెరపోయి ఒక క్షణం కాలంఆగిపోయింది సహనం కాపలా వల్ల.సాధారణంగా భారతీయులు ప్రమాదసమయాల్లో కూడా లేవరు. లేచినాయాంత్రికంగా లేస్తారు. రోబోట్సులాలేస్తారు. నిద్రలో నడిచినట్లునడుస్తారు. రిమోట్‌ శక్తుల ఆదేశాలఅనుసారం నడుస్తారు. రిమోట్‌శక్తుల ఆదేశాల అనుసారంనడుస్తారు. ఈసారి నిజంగానే లేచారు.రక్తమాంసాలున్న మనుషులుగాలేచారు. అసహనాన్ని, ఆగ్రహాన్ని దాచుకునిలేచారు. తుఫానులా విజృంభించారు.బడబాగ్నిలా జ్వాలలు చిమ్ముకుంటూ లేచారు.ప్రళయం సృష్టించారు. కేకలు తీరినవిశ్లేషకుల అంచనాలకు అందని రీతిలోలేచారు. చరిత్రలో మరో అధ్యాయానికితెరతీశారు. కార్యశూరులనినిరూపించారు.మొదట్లో- ఎన్నిల రుతువు ప్రవేశించగానేవిఫణివీధి నగ్నంగా తెరుచుకుంది.విలువల వలువలు విడిచి మనుషుల్నికొనడానికి తెగబడింది. గత ఎన్నికల్లోవలెనే. సరే - సామాన్యులుభౌతికంగా తిరగబడలేరు గదా. ఈతిబాధలు కుక్కల్లా కరుస్తుంటే కక్కుర్తిదారిలో నడవక తప్పదు గదా.కొందామని వచ్చిన వాళ్లు యిచ్చిన నోట్లుతీసుకున్నారు. తాగించడానికొచ్చిన పెద్దలుపోసిన సారా కడుపారా తాగారు. హామీలువినమన్న నాయకుల హామీలు చెవులారావిన్నారు. వరాల విన్యాసాల వుపన్యాసాలుహరికథలు విన్నట్లు విన్నారు. సినీతారలుప్రదర్శించిన తోలు బొమ్మలాటల హొయలుచూశారు. అంతిమంగా - తమఅంతరాల్లోకుతకుతలాడుతున్న ఆలోచన ఓటురూపంలో బయటకు తీశారు. మెషిన్‌ మీదఎక్కడ నొక్కాలనుకున్నారో సరిగ్గా అక్కడేనొక్కారు. హైటెక్‌ చిలక ప్రాణం ఎక్కడవుందో తెలుసుకుని మరీ కసిగానొక్కారు. ప్రజాస్వామ్యం ముసుగులోమసిలే నియంతృత్వానికి, ప్రజావ్యతిరేక భావనలకి ఉరిశిక్షవిధించారు. నిశ్శబ్ద విప్లమంటే ఏమిటోప్రత్యక్షంగా నిరూపించారు.ఈసారిఎన్నికల్లో బహిర్గతమైంది - ఏ పార్టీగెలిచింది, ఏ పార్టీ ఓడింది, ఎవరికి ఎన్ని సీట్లు,ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేవి మాత్రమేకాదు, బహుశా స్వాతంత్య్రానంతరందేశమంతటా యింతటికదలికతో, కసితో అన్ని సమాజవర్గాలకు అతీతంగా, రాజకీయనాయకుల ప్రలోభాలకు, ప్రచారానికిలొంగకుండా తమఅంతరాత్మానుసారం ఓటు వెయ్యడంజరిగింది. మొదటిసారి కావొచ్చు. తద్వారా- యా పార్టీలు, యా రాజకీయ నాయకులుసుప్రీం కాదు, వారి నుదుటి రాతరాసేది మేమేనని దద్ధరిల్లేట్లుప్రకటించారు ప్రజలు. తమ వునికినిచాటుకున్నారు ప్రజలు. నివురు గప్పిననిప్పులా తమలోని ఆగ్రహ జ్వాలలు చిమ్మారు. ఈఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కాదు, ప్రజలేఅంతిమ నిర్ణేతలు అనేది రుజువైంది.ఈసారిఎన్నికల ఫలితాల తీరు నుండి అందరూనేర్చుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి.ఓడిన పార్టీలు తాము ఎందుకుఓడిపోయామో తెలుసుకోవలసి ఉంది.తమలోని లోపాలను గుర్తించవలసివుంది. తప్పులను గమనించవలసివుంది. అటువంటి తప్పులు తిరిగిచెయ్యకుండా తమ పార్టీలనదిద్దుకోవలసి వుంటుంది. అలాగే గెలిచినపార్టీలు బాణా సంచాలు కాల్చుకోవడమేకాదు, తాము కూడా కాలక్రమేణా ఓడినపార్టీల గత తప్పిదాల దారిలో నడిచేపరిస్థితులు రావచ్చు, అప్పుడు ప్రజలుతమనీ ఇదే విధంగా చెత్తబుట్టలోపడేసే ప్రమాదముందని గ్రహించి, ఆదారిలో నడిచే పరిస్థితులు రాకుండాముందే జాగ్రత్త పడవలసివుంటుంది.ఓట్లు- ప్రతికూల, సానుకూలమనే రెండువున్నాయి గదా. ప్రతిసారీ ఒక పార్టీపైవ్యతిరేకతతో మరొక పార్టీకి వోటువేయడం జరుగుతోంది. అది కూడాఒకప్పుడు తిరస్కరించబడిన పార్టీఅయివుంటుంది. ఈ రకంగా చూసినప్పుడు- యాసారి విశ్వరూపంలో విజృంభించినా, యిదికూడా ప్రతికూల ఓటే. ఈ గెలిచిన, ఓడినపార్టీలన్నీ ఒక త్రాసులో భాగాలే. అప్పుడప్పుడుకొందరు పాత్రధారులు మారతారు.సమయం, సందర్భం మారుతుంది.అంతే. అందువల్ల ప్రజలు ప్రత్యామ్నాయంలేక, ప్రతికూల ఓటునే సంధించవలసివస్తోంది. దాని వల్ల సారాంశంలో చరిత్రపునరావృతమవుతోంది.ఒకప్పుడు దారుణమైన ఎమర్జెన్సీనివిధించిన పార్టీకే ఓటు వెయ్యవలసొచ్చింది.భారతఎన్నికల ప్రజాస్వామ్యం అతి ఖరీదైనది.అందువల్ల అవినీతిలో మునిగిపోక తప్పనిపరిస్థితి ఏర్పడింది. అవినీతితో ఏర్పడేప్రభుత్వాలు నీతివంతమైనసమాజాన్ని, రాజ్యాన్ని ఏర్పాటుచెయ్యలేదు.అవినీతిరహిత, సర్వసమానత్వ, జీవనప్రమాణాల పెరుగుదల సాధించే దిశగాప్రయాణం జరగవలసి వుంది.ఈసారిఎన్నికల్లో ప్రజలు మేల్కొన్నారు. కణకణమండుతూ మార్పుకు మార్గంవెయ్యాలని తీర్పు చెప్పారు. ఈ జనశక్తిఆవిరి కాకుండా ఎంతకాలం జ్వలిస్తూ వుంటుంది?ఎన్నికల్లో ఓడిన శక్తులు, గెలిచినాపదవులకై పోటీ పడేఅసంతృప్తశక్తులు, మొత్తంవ్యవస్థలోని అవినీతిమయ శక్తులునిద్రపోవు. దాడి చేస్తూనే వుంటాయి.జనశక్తిపనై నీళ్లు కుమ్మరిస్తాయి.ఈ ప్రమాదంలో రచయితలు,మేధావులు, ఆలోచనాపరులు, మీడియాచెయ్యవలసింది ఏదో ఒక పార్టీతరఫున నిలబడడం గాక, ప్రజలపక్షాన నిలబడి ఆ జనశక్తినిరంతరం జ్వలించేట్లు చూడవలసివుంది. ఈ తీర్పు వెలుగులో నిజమైనమార్పు కోసం శ్రమించవలసి వుంది.దీపాన్నివెలిగించడం ఎంత ముఖ్యమో, అదిఆరిపోకుండా కాపాడుకోవడం కూడా అంతేముఖ్యం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X