వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగంబరకవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయనరాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యంఅనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిదిపదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపైఆయన కలం నిప్పులు కక్కుతుంది.

By Super
|
Google Oneindia TeluguNews

నేనుచూసిన కొన్ని అగ్నికీలలు.సమయంరాత్రి పదవుతోంది. స్థలం బస్టాండు.పనైన వెలగడం యిష్టంలేని లైట్లు,చుట్టూ చింపిరి చింపిరి చీకటి. రోడ్డు దాదాపునిర్మానుష్యం. సిగరెట్టు కొనుక్కుందామనిఅటు వేపుగా వున్న పాన్‌షాపుదగ్గరకొచ్చాను. కాస్త దూరంగా ఓ మూలఓ అమ్మాయి నుంచుని వుంది. తీరు చూస్తేబస్సు కంటే ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టుగా వుంది. కుబుసంవిడుస్తున్న యవ్వనంలా వుంది.పరికించి చూస్తే మాకు రెండువీధులకవతల వుండే అమ్మాయిలాగేవుంది. పుస్తకాలతో కాలేజీకి వెళ్లివస్తుండేది. మధ్యలో చాలా కాలంకనబడలేదు. ఆ వేళ హఠాత్తుగాకనబడింది. దగ్గరగా వెళ్లాను.చిరునవ్వింది. బాగున్నారా మాస్టారూఅంది నిశ్శబ్దంగా.ఎవరి కోసం ఎదురుచూస్తున్నావు? అన్నాను.బస్సు ప్రయాణానికి యింకెవరన్నారావలసి వుండిఎదురుచూస్తున్నదేమోనని.విటుడికోసం ఎదురు చూస్తున్నాను అందినిస్సంకోచంగా.నాగుండె బయటకొచ్చి కొట్టుకుంది.నీకుఎయిడ్స్‌ అంటే భయం లేదా? అన్నాను.నాకుఎయిడ్స్‌ అంటే భయం లేదు.మగాళ్లంటే భయం అంటూ తిరిగి గలగలానవ్వింది.మరిమగాడి కోసం ఎదురు చూస్తున్నావు?అన్నాను.ప్రేమపేరుతో నన్ను యిందులోకి దించాడు.ఇప్పుడు నేనూ మగాడూ యిద్దరమూపాములమే మరికాస్త గట్టిగా నవ్వింది.రాత్రి నవ్వినట్టు నవ్వింది. ఆ శబ్దానికిగాండ్రించే పులిరాజా పారిపోయాడు.క్రమంగాఓ రోజున భారతదేశమంటే - ఎయిడ్‌కోసం అంగలార్చే దేశమూ, ఎయిడ్స్‌ఆక్రమించే దేశమూ ఒకటేఅయిపోయాయి.పెద్దలుభిన్నత్వంలో ఏకత్వమని పాట పాడతారు.వెనక నుండి రాజకీయ పార్టీల కోరస్‌వినిపిస్తుంది.నామిత్రుడొకాయన ఇల్లు కట్టుకుందామనిబ్యాంకు నుండి అప్పు తెచ్చాడు. బీరువాలోపెట్టుకుని కట్టబోయే యిల్లూ,గృహప్రవేశం సంరంభం గురించిఆలోచిస్తూ ఆనందిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.ఆర్థరాత్రి దాటాక దొంగలు అతన్నీయింటిల్లిపాదినీ కొట్టి డబ్బు తీసుకొనిపారిపోయారు. ఈలోగా అరుపులకు పక్కయిళ్ల వాళ్లు లేచారు. కర్రలతోవెంటబడితే ఒక దొంగ చిక్కాడు. వాణ్నినాలుగు బాదితే వొదిలేయమనిప్రాధేయపడ్డాడు. నేనడిగాను.నీకు దొంగతనం చేయడమంటేభయం వెయ్యడం లేదా?పట్టుకుంటారనీ, కుళ్లబొడుస్తారనీ,కటకటాల వెనక్కి తోస్తారనీ భయంవెయ్యడం లేదా? అన్నాను.నాకుదొంగతనం చెయ్యడమంటే భయంలేదు. కుళ్లబొడుస్తారనీ, జైల్లోపెడతారనీ భయం లేదు.పోలీసులంటేనే భయం, వాటాఅడుగుతారని. దొంగతనంచెయ్యకపోతే బతకవివ్వరని. వాళ్లేనన్నిక్కడికి పంపించింది అన్నాడు.అందరుదొంగలూ యిలా చెప్పరు. అందరు పోలీసులూయిలా వుండరు. కొందరు కొందరితోఅర్థరాత్రి యిలా చేయించేవారు. ఇప్పుడుపట్టపగలు నడిరోడ్డు మీదవాహనదారుల వద్ద ఆ కాగితం లేదనీయా కాగితం లేదనీ వాళ్లే ఆ పనిచేస్తున్నారు. రాత్రి వేళ కంటే పగలేనయం. మరొకరితో చేయించడంకంటే వాళ్లే స్వయంగాచేసుకోవడంతో ఎంతో హాయిగా వుంది.ఇలాంటి పోలీసుల్ని పట్టుకుని జైల్లో పెట్టేపోలీసులు లేరు గదా!ఇలాంటివేమరికొన్ని పుట్టాయి. ఓ భక్తుడన్నాడునాకు దేవుడు శిక్షిస్తాడని భయంలేదు. పూజారులంటేనే భయం.మరొకాయన- నాకు మతమంటే భయం లేదు,మతాభిమానులంటేనే భయం.ఇంకొకాయన- నాకు రాజకీయాలంటే భయం లేదు,నాయకులంటేనే భయం.ఇంకావెడుతూ వుంటే చివరికిచేరుకున్నామనే చోట ఆగి చుట్టూ పరికించిచూస్తే మనిషి మరో మనిషిని చూసిభయపడుతున్నాడు.ఈలోగాకొత్త విద్యలు వొచ్చాయి. పండితులొచ్చారు.వారు చెబుతున్నారు. పీజు తీసుకుని మరీచెబుతున్నారు. మీరు ఎవరికీభయపడవలసిన పని లేదు. మీరేయితరులను భయపెట్టగలరు అని. చాలామంది ఆ కోర్సుల్లో చేరారు. పక్కవాడినిభయపెట్టే జనాభా పెరుగుతోంది. వారుదేనికీ భయపడరు. ఓటర్‌ను చూసిభయపడరు. రాజ్యాంగానికిభయపడరు. నీతినియమనిబంధనలకిభయపడరు.పరస్పరవైరుధ్యాల మధ్య మన ముఖమేకనబడుతుంది. మరొకరిది కాదు.అద్దం వున్నది మన నిజరూపంచూసుకోవడానికి, తద్వారాసరిచేసుకోవడానికి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X