• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిగంబరకవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయనరాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యంఅనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిదిపదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపైఆయన కలం నిప్పులు కక్కుతుంది.

By Staff
|

ఈకాలమ్‌లో యింతవరకు నేనుకవిత్వం గురించి రాయలేదు. ఈసారిరాయాలనిపించింది. ఇప్పుడే వెలువడినసుదీర్ఘ కవితా గ్రంథం జలగండంపరిచయం చెయ్యాలనిపించింది. కరువులహాహాకారాల రాయలసీమలో ముఖ్యంగాఅనంతపురం ప్రాంతంలో ప్రజల జీవితంఎంత ఘోరంగా వున్నదో అద్దంపట్టిన కవితా గ్రంథం వెలువడిందనిచెప్పాలనిపించింది. మరో మాటలో చెప్పాలంటేయిదొక కవితా డాక్యుమెంటరీ.కవియక్కలూరి వై. శ్రీరాములు అనంతపురంనివాసి. నటుడు, నాటక రచయిత,ప్రయోక్త కూడా.పాలకులచెవికి సోకని ప్రార్థనవందేమాతరం!ఈగీతానికి భావం: భారతమాతకువందనం. తియ్యని నీటితో, కమ్మనిపండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతోవిలసిల్లే భారతమాతకు వందనం.రాత్రులు తెల్లని వెన్నెలతో పులకిస్తూవిరబూసిన చెట్లతో శోభిస్తూ స్వచ్ఛమైననవ్వులతో మధురమైన మాటలతోమాకు సుఖాలు కలిగిస్తూ వరాలనిచ్చేభరతమాతకు వందనం -అని.వందేమాతరంఆనాడు బ్రిటిష్‌ సామ్రాజ్యానికివ్యతిరేకంగా భారతీయులు పాడుకున్నవిప్లవగీతం. ఆనాడు సమరోత్సాహంతోఉద్వేగంగా పాడుకున్నాం.స్వాతంత్య్రానంతరం దీన్ని పక్కనపడేయకుండా తదనంతర తరాలనాలుకలపై నాట్యామాడాలని, దేశభక్తిరగులుతూనే ఉండాలని స్కూలు స్థాయి నుంచిపాడుకోవాలనే సదుద్దేశంతోపాఠ్యగ్రంథాలలో పొందుపరిచారు. పిల్లలతోపాడిస్తున్నారు. సంతోషం. మరి ఈ గీతంలోనిభావం ఎంతవరకు ఆచరణలోతొణికిసలాడుతోంది? ఉదాహరణగారాయలసీమకు యా గీతభావంవర్తిస్తుందా?ఆప్రాంతంలో యా పాడుతున్నప్పుడు భావంతెలిసినవారి హృదయాలు ఎలాస్పందిస్తాయి! ఒకప్పుడు ఒక వైపుదేశారాధన, మరో వైపుసమరోత్సాహంతో రక్తాన్ని రగిల్చినగీతం యివాళ పాలకుల ఆచరణలో అపహాస్యంకాలేదా? ప్రజల నాలుకలపై వేదనాస్వరంగా మారలేదా?ఇందుకుఎందుకు ప్రస్తావించానంటే తనసుదీర్ఘ గంభీర కవితలో వై.శ్రీరాములువందేమాతరం గీతంలోనివాక్యాలను ఈ విధంగాఅనువర్తింపజేస్తున్నాడు. వర్తమానాన్నిదగ్గరగా చూపిస్తున్నాడు."సుజలాంసుఫలాం మలయజ శీతాలాం సస్యశ్యామలం

శుభ్రంగా చెల్లిస్తున్నాం! చావుల మూల్యం

కడప కర్నూలు చిత్తూరుఅనంతపురం

కరువులు చిత్రించిన చిత్తరువులసమూహం

కడుపు చించుకుంటే స్వరాజ్యం

కాళ్ల మీద పడింది ఆకలిరాజ్యం

పశువులు మనుషులు చావులసమ్మేళనం

ప్రతి పల్లె క్షణక్షణంసర్వనాశనంఈకవితా వాక్యాలు ఏ పాఠ్యగ్రంథంలోకివెళ్లవు. ఈ నిలువెత్తు నిజాలు ఏపరిపాలనాధీశుల దృష్టిలోనూ పడవు.నిద్ర నటించే వారిని ఎవరూ లేపలేరు.తిరిగి నటించడానికి ఏచేది ఎన్నికప్పుడే.సీమమరణ శాసనంసాగునీరు,తాగునీరు, పర్యావరణం గురించిపాలకులు పట్టించుకుని వుంటేరాయలసీమ ఒకప్పటి కాశ్మీరం అయిఉండేది.కొంతకాలంకిందట నేను అనంతపురంవెళ్లాను. స్వయంగా చూశాను.అనుభవించాను. కొరకంచులా మారినపర్యావరణం, దెబ్బ తిన్న ఓజోన్‌ప్రభావం అక్కడే వున్నట్లు లోకంలోనిఎండంతా అనంతపురంలోనే ఉంది.సర్వం మాడి మసి చెయ్యాలన్నట్లుమంటలు నాలుకలు సారిస్తూ ఎగిసెగిసిపడుతున్నాయి. భూమి పెనంగామారింది."మాభూమి నిప్పుల కొలిమి

రాయలసీమ సర్వస్వం

రగులుతున్న భావస్వరంఅక్కడపగలు, రాత్రి విభజన వున్నట్లు లేదు.సాయంత్రం అయినట్లు, సూర్యుడువెళ్లిపోయినట్లు, రాత్రి చల్లదనంఆవరించినట్లు అనిపించలేదు.భుగభుగలు పెరుగుతూనే ఉన్నాయ్‌.స్మశానపురిలోకి తలుపుకులతెరుచకున్నాయి. అనంతపురంఆక్రందన వినిపిస్తోంది. సగం కాలినజీవితాల రెపరెపల వెలుగులో ఆ ప్రాంతంమరణశాసనం లిఖఙస్తోంది. గాలిలో లక్షలప్రాణాల హాహాకారాలు వినిపిస్తున్నాయి.ఇక్కడజెండాలు పండునుస్వాతంత్య్రంవచ్చి యాభయ్యారు సంవత్సారాలుదాటుతోంది. స్వతంత్రం ఎవరికొచ్చింది?పదువుల్లోని పెద్దలకొచ్చింది. దేశాన్నిదోచుకొని తమ తమ వంశాంకురాలతరతరాల కోసం సంపదనుదాచుకొనేవారికొచ్చింది. ప్రజాసేవ పేరజయప్రదంగా రాజకీయాన్ని వ్యాపారంగామార్చుకున్నవారికొచ్చింది. ఇక్కడమనుషులు ఓట్లుగా మార్చుబడును. ఓట్లుకొనబడును. మాఫియాలు శాసించును.తేలికగా హత్యలు చేయబడును.ప్రకృతికి రాయలసీమపై కనికరంలేదు. ఎన్నుకున్న ప్రతినిధికిసంపాదన, ఎన్నికల యావతప్ప వేరేతీరిక లేదు. కరువు నోరు తెరిచిరక్తం పీల్చి పీల్చి కరకరాకబళిస్తోంది.రాయలసీమ,ముఖ్యంగా అనంతపురం ఎడారికాబోతోందని ప్రపంచ వాతావరణసర్వేవాణి దశాబ్దాలుగా తీవ్రంగాహెచ్చరిస్తూనే ఉంది. పట్టించుకున్నప్రతినిధులే లేరు. మట్టినీ మనిషినీరక్షించుకుందామనే కనీసప్రయత్నమూ లేదు."వానకాదు రైతును చేస్తున్నది మోసం

వాగ్దానాలతో ఊరిస్తున్న వారిదే ద్రోహంఒకప్పటిరత్నఖచిత రాయలసీమ నేడుగుక్కెడు నీళ్లకు నోచని రాళ్లసీమధూమసీమగా, భస్మభూమిగామారిపోయింది. అన్ని దురదృష్టాలకుదారుణాతి దారుణాలకూ అనంతపురంఒక ఉదాహరణ."రుతువులెన్నయినా!మా రాయలసీమకున్న ఒకే ఒకరుతువు! కరువుఅక్కడఆకురాలు కాలం లేదు. ఎందుకంటే ఆకులుఎండి రాలడానికి అక్కడ చెట్లే లేవు.మనుషులే ఎండిన చెట్లు, మోడులు,వాళ్లే రాలిపోతుంటారు.కూలిపోతుంటారు. నాలికలు విసురుతూ, అగ్నిచల్లుకుంటూ ఎడారి విస్తరిస్తూ వుంటుంది.మనుషుల్ని యిసుక తింటూ వుంటుంది.ఈమహావిపత్తుకు ముఖ్యమైనది, కేంద్రబిందువూ అక్కడ సాగునీరు, తాగునీరులేకపోవడమే. ప్రాణాధారమైన జలం ఏమాత్రం లేకపోవడమే. చెట్లులేకపోవడం వల్ల చుట్టపుచూపుగానైనా అక్కడ ఆవులించేఆకాశంలోకి మేఘం తొంగిచూడదు. ఒకచినుకు చినకదు."జలమేకదూ అమృతం

అమృతమంటేనే జలంఅమృతమంటేస్వర్గసురా పానీయం మాత్రమే కాదు.మానవుడు తాగే నీరు కూడా. మేఘానికిదయలేదు. నేల నెర్రెలే విచ్చి ఒకప్పుడుసముద్రాలుగా కీర్తించబడిన చెరువులుయివాళ ఎండిపోయి నల్లగా స్ఫోటకపుమచ్చలుగా మిగిలిపోయాయి. ఫలితం క్రూరకరువు రుతువు. ఉధృతంగాఉపాధిలేమి.జీవితాన్నిభుజాన వేసుకొని వలసలు. సలసలమంటూకాలిపోతూ ఛిన్నాభిన్నమవుతున్నబతుకులు. మెతుకు చుట్టూపరిభ్రమణం. జలగండం. తన్నీర్‌కన్నీర్‌. నాలుకలు పిడచగట్టడమే కాదు.మరికొన్నాళ్లకి నాలుకలులోపలికెళ్లిపోతాయి. . నాలుకలు లేని నోళ్లుమిగులుతాయి."మట్టిలోవిత్తనాలు విత్తితే

గుత్తులు గుత్తులుగా వేరుశనగపండుతుందనుకున్నాం

కరువు కత్తులు మొలిచి కుత్తుకలుతెగిపడడం రోజూ చూస్తున్నాం

ప్రతిపూటా పస్తున్నాం ప్రతి యేటాచస్తున్నాంఇక్కడజరుగుతున్న బీభత్స భయానకనాటకం చూద్దాం. రాజకీయ విఫణివీధుల్లోకెడదాం. విశేష కవి వై.శ్రీరాములు ఏమంటున్నాడో విందాం. చూస్తున్నవాస్తవ దృశ్యాన్ని చూద్దాం."నాన్నా

నీళ్లు కావాలని చేతులు చాచితే

మా చేతుల్లో

రంగురంగుల జెండాలు

ఉచితంగా వుంచుతారుతెల్లచొక్కాతొడిగి

చేతిలో జెండా నాటుతాడొకడుపసుపుచొక్కా తొడిగి

నెత్తి మీద జెండా ఎత్తుతాడొకడుఎర్రచొక్కా తొడిగి

గుండెలో సూటిగా జెండాగుచ్చుతాడొకడుకాషాయంచొక్కా తొడిగి

కసాయి కంటే దారుణంగా

నిన్ను నిలువునా తగలేస్తాడొకడుఇన్నిజెండాలు చేతపట్టి

అన్ని అంగీలు తొడిగి

అదును కోసంవెతుకుతుంటాడొకడుఇదిశవాల మీద వ్యాపారం చేసే దళారులరాజ్యం

ఇక్కడ దాహానికి నీళ్లు పూజ్యం

ఇక్కడ

ఏ అంగీలకీ గుండీలుండవు

ఏ జెండాకు గుండెలుండవుజలగండంఒక ఒయాసిస్సుఆధునికసందర్భంలో దీర్ఘ కవితకు ప్రత్యేకస్థానం ఉంది. పందొమ్మిది వందల యాభైతొమ్మిదిలో వెలువడిన ఉదయించనిఉదయాలు నా మొదటి దీర్ఘ కవిత.తరువాత దిగంబర కవితా సంపుటాలలో,యితరత్రా నేను చాలా దీర్ఘ కవితలురాశాను. అందులో జమ్మిచెట్టు, అద్వైతరాజ్యం మొదలైనవి ఉన్నాయి. నాలాగేకొందరు దీర్ఘ కవితలు రాశారు. అవన్నీఒక ఎత్తు నా కొయ్యగుర్రం ఆధునికకావ్యం వెలువడిన తర్వాత దీర్ఘకవితా రచన ఒక ఉద్యమ రూపంతీసుకుంది. గతంలో కంద పద్యంచెప్పనివాడు కవే కాదన్నట్లు, యివాళదీర్ఘ కవిత రాయనివాడు కవేకాదేమోనన్నంత ప్రాధాన్యతసంతరించుకుంది. ఒక ప్రత్యేకప్రక్రియగా, సవాలుగా నిలబడింది. అయితేపేజీల కేజీలు నింపిన ప్రతిదీ సజీవ దీర్ఘకవిత కాలేదు. ఏదో ఒక విషయం తీసుకొనిఎటెటో వర్ణనా విహాయసం చేసినంతమాత్రాన అది లక్ష్యకవిత కాలేదు.దానికి వస్తువు ప్రాణం. రూపంసంవిధాన విధానం. దీర్ఘకవితప్రాణాయామంతో సమానం. ఇది తాడు మీదనడక, తడబడితే కింద లోయ.జలగండంఅన్ని విధాలా జయప్రదమైన సుదీర్ఘకవిత. కవి వై. శ్రీరాములు తీసుకన్నవిషయం మహోన్నతమైంది. జాతిమరువలేనిది. కవి మమేకమైతన కాళ్ల కింద గడ్డ మీదపగుళ్లు చుట్టూ అణగారే సామాన్యులశ్వాసల్లోని మెలికలు దృశ్యకావ్యంగాప్రదర్శిస్తున్నాడు. నిజం వైపుహృదయాన్ని మేధస్సునీమేల్కొలుపుతున్నాడు. కవి సాయుధుడుకావడమంటే యింతకంటేఏముంది?"ప్రతిఇల్లు చూపుకు నోచుకోని చీకటి నేత్రం

ప్రతి పల్లె చదువు సంధ్యాలేనిక్షతగాత్రం"నీళ్లనివ్యాపార వస్తువుగా చేసిన

మినరల్‌ వాటర్‌ ప్లాంట్లని ధ్వంసంచేయాల్సిందేఈకవి రాయలసీమ నుండి యా కవితపలుకుతున్నా దేశంలో ఎక్కడ నీరులేక, చెట్టూ చేమ లేక, పంట లేకఎడారులు విస్తరిస్తూ దాహం, కరువు,ఉపాధిలేమి, వలసలు మొదలైనవి చోటుచేసుకుంటున్నాయో, రాజకీయ కిందజనం నలిగిపోతున్నారో ఆ సీమలన్నింటికీయా కవిత వర్తిస్తుంది.జలగండంజనకవిత. సమాజ జీవితం, భారతరాజకీయ గ్రహణంలోని దుష్టకోణాలునిర్ద్వంద్వంగా వెలికి తీస్తూ యా కవిరాస్తున్నాడు. ఇంతకు ముందు ఎవరూయా విధంగా రాయలేదని కాదు.అయితే చివరి వరకు యిదే తమకవితామార్గంగా, లక్ష్యంగా,విధానంగా కొనసాగినవాళ్లు తక్కువ.చాలామంది కవులు మొదట్లో యిలాప్రారంభమైనా క్రమంగాస్వీయానుభూతి కవులుగా, అమూర్తకవులుగా మారిపోయారు. వీరి కవిత్వాలవల్ల ప్రభుత్వానికీ ప్రజా శత్రువులకుఎటువంటి ప్రమాదమూ వుండదు.వాళ్లు అభయారణ్యంలోని కవులు. సర్కారీసంస్కృతిలో సేద తీరుతున్న కవులుఇటువంటి అమూర్త, అలక్ష్య కవితురాజ్యమేలుతున్న వాతావరణంలోజలగండం వెలువడుతున్నది.అందుకే దీనిని ఒయాసిస్సు అంటున్నారు.కొత్తకవిసమయంమొట్టమొదటనేచెప్పవలసిన అతి ముఖ్యమైన ఒకకవితాంశం గురించి యిప్పుడు చెబుతాను.కవి సమయాలు అనేకం ఉంటాయి. దాదాపుగావాటి అర్థాలు, అన్వయాలు రూఢమైవినియోగంలో వుంటాయి. అవి నిర్దేశించేపద్ధతిలో పాఠకులు అర్థంచేసుకుంటారు. అయితే నిరంతరసృజనశీలి, మరొక కోణం జోడించి తనకుకావలసిన పద్ధతిలో దీనినివుపయోగిస్తాడు. అప్పుడు అది కొత్త అర్థాన్ని,నూత్న దర్శనాన్ని కలిగిస్తుంది. భాషకి,ప్రయోగానికి ఊపునిస్తుంది. ఈ కవిజలగండంలో అటువంటి కవి సమయంప్రయోగం చేశాడు.జలగండంఅంటే నీటి వల్ల సంభవించే అపాయం. నీటిలోపడి చనిపోయే ప్రమాదం. దీనినేమరొకవైపుకు తిప్పి జలంలేకపోవడం వల్ల సంభవించేఅపాయంగా, మరణాపాయంగా కవియిక్కడ అభివర్ణిస్తున్నాడు. ఇది కొత్తసమయం. కొత్త చూపు. కొత్తఅభివ్యక్తి.ఇంతకుముందు చెప్పినట్లు గతంలో చాలాదీర్ఘకవితలొచ్చాయి. కానీ యిదిప్రత్యేకమైనది, సూటిగా పలికేది.ప్రయోజనకరమైనది. ఇది నిజాన్నిచూపించేది. నిజంలా నిజంగా నిలిచేది.జలగండంఅక్షద దృశ్యీకరణ చేసినందుకువిశేషకవి వై. శ్రీరాములును మనసారాఅభినందిస్తున్నాను. ఇందులోని జనజీవనబీభత్సాన్ని అందరూ గమనిస్తారని,స్పందిస్తారని ఆశిస్తున్నాను."మట్టిపైకొలతలు/ నీటి అంచులు

ఏ దేశానికైనా సరిహద్దులు

మట్టిని నీటితో కలిపి/ మనిషీ మనిషీశ్రమిస్తేనే

ఏ దేశప్రజలైనా తినేది యిన్నిముద్దలుఒకప్పటిప్రభుత్వమే ప్రజలకు మరో ప్రత్యామ్నాంలేక తిరిగి రంగప్రవేశం చేసింది.సాగునీరు, తాగునీరు గురించి చాలాగంభీరంగా హామీల కుంభవృష్టికురిపిస్తున్నది. తుప్పు పట్టినకార్యాలయాల కాగితాలు దాటి, అప్పులిచ్చెటోళ్లషరతుల వురితాళ్లు దాటి, టెండర్లరింగులో, నల్లడబ్బు చక్రవర్తులుమాయాజాల కాంట్రాక్టర్ల దృతరాష్ట్రకౌగిళ్లు దాటి, చుక్కనీరు జనం నాలికలమీద, నేల గుండె మీద ఎప్పుడురాలుతుందో తెలీదు. వేచి చూడడంతప్ప మరో మార్గం లేదు. అంతవరకు జలగండ మారణకాండక్షణక్షణం జరుగుతూనే ఉంటుంది.జలగండందీర్ఘ కవిత మాత్రమే కాదు, జలస్పర్శలేక దీర్ఘ నిద్రలోకి జారిపోతున్న అశేషసామాన్య జన అదృశ్యహాహాకారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more