వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

610జీవోను, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీవంటివాటిని ఎప్పటి లోగా కాంగ్రెస్‌ప్రభుత్వంతో ఎప్పటి లోగా అమలుచేయిస్తారో వారు నిర్దిష్టంగా హామీ ఇవ్వాల్సివుంటుంది. అప్పుడు వారికి టి ఆర్‌యస్‌నువిమర్శించే నైతిక హక్కు,తెలంగాణను వ్యతిరేకించే హక్కుఉంటుంది. ఆ రెండు పార్టీలే కాదు, అన్ని పార్టీలు ఈవిషయాల్లో నిజాయితీని, చిత్తశుద్ధినిప్రదర్శించుకోవాల్సి వుంటుంది. టిజెయస్‌ఆత్మరక్షణకుఉపయోగపడుతుందని, అది సైద్ధాంతికప్రచారాన్ని సాగిస్తుందని టి ఆర్‌యస్‌నాయకులు అంటున్నారు. ఈ రెంటి అవసరంతెలంగాణ ఉద్యమానికి ఎంతైనా ఉంది. అలాకాకుండా అది చట్ట వ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడితే చర్యలుతీసుకునే హక్కు ప్రభుత్వానికి ఎప్పుడూఉంటుంది.                     టిఆర్‌యస్‌ఒంటరిపక్షి-కె. నిశాంత్‌మున్సిపల్‌ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌యస్‌) ఒంటరి పక్షి అయింది. ఈవిషయంలో ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి విజయంసాధించినట్లా, వామపక్షాలు గెలుపుసాధించినట్లా అనేది చర్చనీయాంశంకాదు. రాజశేఖర్‌ రెడ్డికి మున్సిపల్‌ఎన్నికల్లో గెలుపు కోసం టిఆర్‌యస్‌అవగాహన అవసరమే. కానీవామపక్షాలకు ఒకింత ఛాతీ విరుచుకునితిరిగే ఘడియలు ఇవి. వామపక్షాల నేతలమాటల్లోనూ ఈ లక్షణం కనిపిస్తూనే ఉంది. ఈమాటెలా ఉన్నా, చంద్రశేఖర్‌ రావుకాంగ్రెస్‌తో తెగదెంపులుచేసుకోవాల్సిన సమయం ఎప్పుడో ఒకప్పుడుఎదుర్కోవాల్సి వుంటుందనేదితెలంగాణవారందరికీ తెలిసినవిషయమే. అదేం విచిత్రం కాదు.కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుచర్యలు తీసుకుంటుందని చంద్రశేఖర్‌రావు నమ్మారేమో లేదా ఆ పార్టీసిద్ధాంత కర్త జయశంకర్‌కువిశ్వసించారేమో తెలియదు. కానీఎవరికీ కాంగ్రెస్‌ నిజాయితీపై నమ్మకంలేదు. పైగా ప్రస్తుత ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిమొదటి నుంచీ తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు ఎప్పుడూ వ్యతిరేకులే. ఈవిషయంలో మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు, ప్రస్తుతముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డికీ ఏ మాత్రం తేడాలేదు.

By Staff
|
Google Oneindia TeluguNews

విడుదలైనచాలా రోజుల తర్వాత నేను సినిమాచూశాను. ఆశ్చర్యంగా, తెలుగులో కూడాయిటువంటి సినిమాలు వస్తాయా అనుకునిసంతోషించాను.ఆనంద్‌ యిటీవల సినీచరిత్రలో కొన్నిప్రయోజనాలూ, ప్రమాణాలూ నిశ్శబ్దంగాసాధించింది. ఆర్థికంగా కూడావిజయవంతమైందని తెలిసింది.సాధారణంగా, కొత్త కోణంలోంచి, కొత్తవిషయాన్ని ఎవరైనా చెప్పడానికిప్రయత్నిస్తే బాక్సాఫీస్‌ దగ్గర దెబ్బతింటూ వుంటారు. ఆనంద్‌ విషయంలోఅలా జరగనందుకు మరింతఆనందించాను.ఇప్పుడు ఆనంద్‌ ప్రస్తావన ఎందుకు?అనిపించవచ్చు. ఇటీవల ఓ టీవీఛానల్‌వారు ఆనంద్‌ను టెలికాస్ట్‌చేశారు. అప్పుడు యా సినిమా విడుదలైనరోజుల్లో పత్రికల్లో ప్రచురించిన చక్కనిసమీక్షలూ, యింటర్వ్యూలూ, విశ్లేషణలూగుర్తుకొచ్చాయి. నేటి సినిమాల్లోని ఓసంఘటనగా గుర్తింపబడడం జరిగింది.అందుకని దీనిపై నాలుగు మాటలు యా కాలమ్‌లోమరో కోణం నుంచి రాయాలనిపించింది. మంచిసంఘటనపై మంచి మాట చెప్పడానికిఅవకాశం ఎప్పుడూ వుంటూనే వుంటుందిగదా. తెలుగు సినిమా ఎడారిలో ఆనంద్‌ ఓఒయాసిస్సు. అదే చెబితే బావుంటుంది.అయితే, యా ఎడారి ఒంటెల ప్రయాణాలు కూడా లేనిఎడారి. అదే యా ఎడారి విషాదం.సినిమాకివెన్నెముక కథ. నిజానికి, ఏదృశ్యమాలికకైనా ఆధారం కథే.పూలదండను దండగా చేసేది లోనున్నదారమే. కథ పటిష్టంగా లేకుండా,స్పష్టమైన రూపకల్పన లేకుండా ఎన్నిహంగులు చేసినా, అది నిలబడలేకచిరుగాలికే ఒరిగిపోతుంది. హీరోల చుట్టూ తిరిగేమెలోడ్రామాలు, తక్కువ బట్టలతరుణీమణుల నృత్యాలు సినిమానివిజయంవైపు నడిపంచలేవు. ఈసమస్త ఆర్భాట హంగులన్నీ చివరికిశవాలంకరణగా మిగిలిపోతాయి.ఆనంద్‌ మెలోడ్రామాకి దూరంగా,వీలైనంతవరకు వాస్తవానికిదగ్గరగా జరిగే ఆధునిక జీవితాన్నిచూపిస్తుంది. తెలుగు సినిమాయింతవరకు ఆధునికంకాలేదు.సినిమాపరిభాషలో చెప్పాలంటే యిది హీరో చుట్టూ తిరిగేచిత్రం కాదు. హీరోయిన్‌ చుట్టూ తిరిగేకథనం. మనకు హీరోయిన్‌ప్రధానపాత్రగా గల సినిమాలు చాలాతక్కువ. అందులోనూ కొత్తనటీనటులను, మరీ ముఖ్యంగా కొత్తనటిని ప్రధాన పాత్రలోకి తీసుకునిసినిమా తియ్యడం ఒక సాహసం.ఇంక,మొట్టమొదట చెప్పుకోవలసింది కథగురించి. ఆ కథలోని వైవిధ్యం,ఆధునికత, సంస్కారం, మరో సాహసంగురించి.సూక్ష్మంగాచెప్పాలంటే కత యిలా కొనసాగుతుంది.రూప చిన్నతనంలోనే, అనుకోనిపరిస్థితుల్లో, ఒక ప్రమాదంలో అందర్నీపోగొట్టుకుంటుంది. క్రమక్రమంగాకష్టనష్టాలన్నింటినీ ఎదుర్కొంటూవ్యక్తిత్వంతో పాటు స్థిరమైనఅవగాహన తన చుట్టూ వున్నవాతావరణంపై పెంచుకుంటూ పెరిగింది. ఓకార్పోరేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూవుంది. అదే కంపెనీకి చెందినకోటీశ్వరుడు రాహుల్‌తో గల స్నేహం,అతని ప్రేమ పెళ్లి పీటలవరకుతీసికెళ్లింది.పెళ్లిజరగబోతుండగా అంతవరకుఆస్తారపదంగా ప్రాణప్రదంగాదాచుకున్న తన తల్లిచీరనుకట్టుకుంది. తద్వారా తల్లి తనతోవున్నట్లుగా ఆమె భావిస్తుంది. ఇది చాలాసున్నితమైన భావన. కాని, కాబోయేఅత్తగారు ఆ చీరను కాదని, తమసంప్రదాయం ప్రకారం కట్టుకునే,తాను తీసి యిచ్చే చీరనే కట్టుకోవాలనిశాసిస్తుంది. రూప, అమ్మచీరనికట్టుకునేందుకు అనుమతించమనిబతిమాలుతుంది, కాళ్లావేళ్లా పడుతుంది.కాబోయే అత్తగారు ససేమిరా అంటుంది. ఈకోరిక తన ఆజ్ఞను ధిక్కరించినట్లుభావిస్తుంది. ఆమెకు తన ఐశ్వర్యం,బంధువర్గం ముందు పటాటోపం,తన అధికారం మొదలైనవేముఖ్యం. అవతలి వారి ఆలోచనలు,సున్నితభావనలు కాదు. చివరివరకూలాగడం దేనికని రూప ఆమె యిచ్చినచీరనే కట్టుకుంటుంది. అయినప్పటికీతన మాటకు ఎదురుచెప్పినట్లుగాఅత్తగారు భావిస్తుంది. రూపనుమొదట్లోనే లొంగదీయాలనినిశ్చయించుకుంటుంది. పరుషపదజాలంతో మాట్లాడుతుంది.అహంకారంతో ప్రవర్తిస్తుంది. ఆ క్రమంలోరూపకు తెలిసివస్తుంది, ఆ కుటుంబంలో,అక్కడి వాతావరణంలో, అక్కడివారిమనస్తత్వాలతో, ముఖ్యంగా అత్తవారిపాలనలో భవిష్యత్తులో తనవ్యక్తిత్వం ఎలా నాశనం కాబోతోందో,తాను చివరికి ఎలాజీవచ్ఛమైపోతుందో. అప్పుడు రూపస్థిరమైన నిర్ణయం తీసుకుని పీటల మీదపెళ్లినే వదులుకుంటుంది. రాహుల్‌నుతన మనసు నుండి తొలగిస్తుంది. ఆతర్వాత కొన్నాళ్లకి ఆ కాబోయినఅత్తగారు మరణిస్తుంది. అప్పుడు కూడారూప తన నిర్ణయం మార్చుకోలేదు.రాహుల్‌ను స్వీకరించదు.మధ్యలోఆనంద్‌ ఆమెని యిష్టపడతాడు.ప్రేమిస్తాడు. ఆమె మనసులో స్థానానికిశ్రమిస్తాడు. అనేక సంఘటనలతర్వాత వారికి పెళ్లవుతుంది.ఆధునికస్త్రీ వ్యక్తిత్వం, ఒంటరితనం, నిర్దిష్టనిర్ణయాలు, మనసులోని వొత్తిళ్లు,సంఘర్షణలు, భావాలు, చుట్టూ విలువలరాహిత్యం అన్నీ ఎంతో సున్నితంగాచిత్రించిన చిత్రమిది.మనచుట్టూనే వుండే పరవశింపజేసేప్రకృతిని పట్టుకునే ఫొటోగ్రఫీ.హృదయాన్ని తొణికిసలాడించేసంగీతం. వెన్నెల్లో, వాన చినుకులకింద మనం పొందేమధురానుభూతుల వంటిఅనుభవం చిత్రమంతా ఆహ్లాదంగాపరుచుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటేతాను కథనీ, ప్రతి పాత్రనీ, ప్రతిసంఘటననీ, కథనాన్నీ ఫీల్‌ అవుతూదర్శకత్వం వహించాడు శేఖర్‌కమ్ముల. అతను యివాళ్టిదర్శకుడు.కథదగ్గరికి మళ్లీ వస్తాను. ఆనంద్‌కథలో వైవిధ్యం, సాహసం వుందనియింతకు ముందు చెప్పాను.అదెలాగంటే - సాధారణంగా తెలుగుసినిమా కథ ఎలా జరుగుతుందంటే -పీటల మీద ముఖ్యమైన కారణంవల్లనేపెళ్లి ఆగిపోయిందనుకుందాం. ఇంక, సినిమాచివరి వరకూ ఆ పెళ్లికూతురు, పెళ్లికొడుకుల భావాలతో సంబంధం లేకుండా,తర్వాత ఎన్నో ఫైట్లు, డాన్సులు, అపార్థాలు,మెలోడ్రామా సంఘటనలతో, ఏ పాత్రకీవ్యక్తిత్వం లేకుండా నడిచి, చివరికిపెళ్లికూతురికీ, ఆ పెళ్లి కొడుక్కీ పెళ్లి చేసిశుభం చెబుతారు సినిమావారు. ఇదితెలుగు సినిమా సంప్రదాయం. ఆసంప్రదాయాన్ని పక్కన పెడుతుందీచిత్రం.ఆనంద్‌లోని రూప వ్యక్తిత్వమున్నస్త్రీ. నిజానికి ఆమె జీవితంగాని, చుట్టూ వున్నపరిస్థితులుగానీ వ్యక్తిత్వాన్నివూహించగల, పొందినా నిలబెట్టుకోగలవికాదు. ఎప్పుడూ ఎవరి మీదనోఆధారపడవలసిన జీవితం. అయినా రూపస్థిరనిర్ణయాలు తీసుకునే అవగాహనగల ఆధునిక స్త్రీ. పీటల మీద పెళ్లి ఆగిపోయింది.మానసికంగా ఎంతో దెబ్బ తిన్నది.తరువాత తనకుఅనుకూలమనుకునే పరిణామాలు జరిగినా, తిరిగిఆ పెళ్లి కొడుకుతో పెల్లినీ, తన జీవితంలోభాగస్వామిగా అతన్నివూహించుకోలేకపోయింది. తనజీవితానికీ, వ్యక్తిత్వానికీప్రాధాన్యతనిచ్చింది.ఆతర్వాత అనేక సంఘటనలు గడిచాక,మరొక వ్యక్తి తన మనసులోకిరావడానికి ప్రయత్నించినప్పుడు, అర్థంచేసుకుని అతన్ని జీవితంలోకి ఆహ్వానిస్తుంది.ఇదిమనసునీ, స్నేహాన్నీ, ప్రేమపై నిలిపే వివాహవ్యవస్థనీ, నిజాయితీ గల విలువల్ని గౌరవిస్తూచక్కని సంస్కారంతో, అభిరుచితో తీసినసినిమా.ఈకథ తెలుగు సినిమాని మరో మలుపుతిప్పిన కథ. ఇది నినాదాలు లేకుండానిశ్శబ్దంగా సమకాలీన స్త్రీలోనిఅణిగివున్న వ్యక్తిత్వాన్ని పరిచయంచేసిన సినిమా. మనంప్రగతిశీలమనుకునే మరో మెట్టునుఅవలీలగా అధిరోహింపజేసిన సినిమా.బహుశాగుడిపాటి చలంగారి స్త్రీ తనప్రయాణంలో రూప దగ్గర కాసేపు ఆగిమరీ ముందుకు వెడితే సంతోషం.దర్శకుడుశేఖర్‌ కమ్ములకి మరిన్ని మైలురాళ్లనికోరుకుందాం. అతని సాహసానికిమనసారా అభినందిద్దాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X