• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజకీయ పరిణామాల

By Staff
|

మనంమృదుత్వం నుండిమొద్దుబారేతనం వైపుఎదుగుతున్నాం.ఒకప్పుడుఅత్యంత భయానకమైనసంఘటనలుగా భావించబడినవి, యిప్పుడుజాతి జీవనంలో ఒక భాగమై అతి సాధారణవిషయాలుగా మారిపోయాయి.అప్పట్లోసమాజంలో గాని, రాజకీయాల్లో గాని ఒకహత్య జరిగితే అదొక ఘోరమైన,క్రూరమైన దుస్సంఘటనగాభావించేవారు. ఇప్పుడు అతి చిన్నవిషయానిక్కూడా హత్యలు చెయ్యడం,చేయించడం మామూలైపోయింది.ఒకప్పటి అసాధారణం యివాళసర్వసాధారణం అయిపోయింది. ఒక జాతిమొద్దుబారిందని నిర్ధారించడానికియిదొక సూచిక.ఇదిఅంతటితో ఆగలేదు. సమాజం,ప్రభుత్వం, శాసనసభ, న్యాయ, పాలకవ్యవస్థలనే అపహాస్యం చేస్తూ సవాళ్లువిసిరే స్థాయికి యివి చేరుకున్నాయి. తాజాఉదాహరణ - పరిటాల రవి హత్యలోనిమొద్దు శీను ఉదంతం అటువంటిసవాల్‌. ఈ వ్యవస్థలేవీ తన ఒంటి మీదఒక్క వెంట్రుక ముక్కను కూడాముట్టుకోలేవన్నట్లుగా ప్రవర్తించాడు,మాట్లాడాడు. పోలీసు, తదితరపరిశోధక సంస్థలు అతని కోసంవెతుకుతున్నామని అంటున్నాయి. అతనుఅజ్ఞాతవాసంలో వుంటున్నట్లుగా నటిస్తూబహిరంగంగా ఎలక్ట్రానిక్‌ మీడియాకుయింటర్వ్యూ ఇచ్చాడు. ఈ హత్య ఎలా జరిగిందీ,అందులో తానెలా పాల్గొన్నదీ స్పష్టంగావివరించాడు. నిస్సంకోచంగా, నిర్బయంగాయా విధంగా చెబుతున్నప్పుడుపోలీసులకు లొంగిపోవచ్చును గదా అని అంటేదానికి - తాను మరో యిద్దర్ని హత్యచెయ్యవలసి ఉందని ఆ పని పూర్తి కాగానేతప్పక లొంగిపోతానని ప్రకటించాడు.ఇతన్ని పాపం, నరకం, దేవుళ్లు,పోలీసులు, జైళ్లు, కోర్టులు, మరణశిక్షయిటువంటివేమీ భయపెట్టలేదు. బహుశాయితని దృష్టిలో యా వ్యవవస్థలన్నీకోరల్లేని పాములు. లేక సర్కస్‌లోనిసింహాలు. లేక డబ్బుతో కొనగలవస్తువులు. ఇతను ఏ నాయకుడికి,ఫ్యాక్షన్‌కి, రాజకీయ పార్టీకిచెందినవాడైనా అతనెక్కడో, ఏ దేశంలోనోపుట్టినవాడు కాదు. అతను మనవ్యవస్థల ఫలితమే. ప్రతిబింబమే.అనేకానేకవ్యాపారాల్లో రాజకీయం ఎలాప్రధానమైన వ్యాపారమో, అనేకవృత్తుల్లో యివాళ కిరాయి హత్యకూడా ఒక ముఖ్యమైన వృత్తిమొద్దుశీనుఒకడు కాదు, అనేక ముఖాల అనేకచేతుల అనేక మంది. వీళ్లు విసిరేసవాళ్లకు యా వ్యవస్థలువులిక్కిపడడం లేదు. తమ వునికిగురించి ఆలోచించడం లేదు. మొదట్లోచెప్పినట్లు - ఒకప్పుడు వీటినిఅసాధారణంగా భావించేవారు. రేఖనుదాటినట్లు నిర్ణయించేవారు. ఇప్పుడుహత్య సాధారణాంశంగా మారిపోయింది.వ్యవస్థలు వుండి ఆచరణలో వునికినికోల్పోవడమంటే యిదే.కరువుకాటేసినవారు, వృత్తులుకోల్పోయినవారు, అప్పుల్లోకూరుకుపోయినవారుకారణమేదయినా అంతిమ పరిష్కారంగామొదటి వ్యక్తి చేసుకున్నఆత్మహత్యకు అంతా చలించారు.క్రమంగా యిద్దరు, ముగ్గురుతరువాత మొత్తం కుటుంబాలకుకుటుంబాలు ఆత్మహత్యలకు ఆహుతికావడం వరకు వెళ్లింది.ఆత్మహత్య యివాళ పత్రికల్లోచాలామంది కళ్లలో పడని వార్త. మరీముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి రానిసంగతి. ఈ దేశంలో సామాన్యుల సమస్యపరిష్కారాల మార్గాల్లో చివరిదిఆత్మహత్య.ఈఆత్మహత్యలకు కారుకులెవరు? ఆకారకుల్ని పట్టుకునేవారెవరు?బోనెక్కించేవారెవరు?శిక్షించేవారెవరు?పరోక్షంగాపాలకులే యా ఆత్మహత్యలకు కారకులు.వారికి ఆత్మ లేదు కాబట్టి ఆత్మఘోషవారికి తెలియదు.శిశువిక్రయాల వార్తలు బయటికొస్తున్నవి బహుతక్కువ.మొదట్లోసంతానం అధికమైతే లేనివారికిదత్తతగా యిచ్చేవారు. ఇదిగాక,మరొక వైపున, అది అక్రమసంతానమైతే భ్రూణహత్యకుఒప్పుకోలేక మానసికంగా కుంగిఅష్టకష్టాలు పడి రహస్యంగా కనిఅర్థరాత్రి అంతా పడుకున్న వేళ ఏసంస్కరణవాది యింటి మెట్ల మీదనో వొదిలిఅక్కడియాన క్షేమంగా సుఖంగాబతుకుతాడనే ఆశతో కళ్లనీళ్లుకుక్కుకుంటూ వెళ్లిపోయేవారు.క్రమంగాకొందరికి శిశువులపై కాసులుకనిపించాయి. మానవ మార్కెట్‌ నోరుతెరిచింది. దాని చేతులు చాలా పొడవైనవి.స్థానిక జాతీయ అంతర్జాతీయఅంతర్జాతీయ ద్వారాలు తెరిచినవి. ఆర్థికవొత్తిళ్లలో మెసలే వారిపై లంఘించేవి.ఆసుపత్రుల్లోపనిచేసే వారి ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డల్నిదొంగిలించడం, పట్టుబడని మార్గాల్లోతరలించడం, ఆలాగే తల్లిదండ్రులకుతెలిసి వాళ్ల చేతిలో కాసిని నోట్టు కుక్కికొనెయ్యడం, బయట దత్తత పేరిటవేలక అమ్మెయ్యడం అంచెలంచెలుగా యిదిజరిగిపోతోంది. దీని వెనక కమీషన్‌వ్యాపారులు దృఢంగా వున్నారు. వారివెనక ప్రభుత్వేతర సంస్థలుఅధికారికంగా, దర్జాగా మొలిచాయి. వీటికిదన్నుగా పెద్ద పెద్దతలకాయలున్నాయి.ఇదంతాఒక పెద్ద డబ్బుల రంగుల వల. ఎవరుఎవరికి ఎంతకు అమ్ముతున్నారోలెక్కల్లేవు. అందులో ఎందరు ఎన్నిచేతులు మారారో తెలీదు. ఎన్ని దేశాల్లో ఎన్నికుటుంబాల్లో, ఎన్ని రంగాల్లో యా పసిపాపలువున్నాయో ప్రభుత్వం పట్టించుకున్నపాపాన పోలేదు. ఇందులో ఎంతమందిబతికి వున్నారో, ఒక చనిపోతే ఎంత మందిఏ కారణాలవల్ల చనిపోయారో తెలీదు.బతికినవాళ్లు, సక్రమంగాపెరిగినవాళ్లు, ప్రయోజకులైనవాళ్లు,ఒక దశలో తమ మాతృభూమిని,మాతృభూషీయుల్ని, మరీ ముఖ్యంగాతలిదండ్రుల్ని కలుసుకోవాలని, జన్మస్థలాన్నితాకాలని తపనపడే వారికి ఆ వివరాలన్నీతెలిపే అవకాశం వుందా?అప్పుడేపుట్టిన బిడ్డ బొడ్డుతాడుతో పాటు గతాన్నికూడా కోసివేసే హక్కు ఎవరు యిచ్చారు? ఏబిడ్డ భవిష్యత్తు ఎలా వుండబోతోందో!ఎదిగాక ఎయిడ్స్‌ నరక కూపంలోకి తిరిగిఅమ్మేసే ప్రమాదం లేదని ఎవరైనాచెప్పగలరా? ఏ దేశంలోకి ఏ కుటుంబంలోకిదత్తుగా వెళ్లినా, ఆ కుటుంబానికి, ఆదేశానికి గర్వకారణమయ్యేఅవకాశాలు కల్పించే అభయహస్తాలున్నాయని చెప్పగలరా?ఒకప్పుడుభారతదేశమంటే అడవులు,ఏనుగులు, పాములు వుండే దేశంగాచెప్పుకునేవారట. ఇప్పుడు హత్యలు,ఆత్మహత్యలు, శిశు క్రయవిక్రయాలు జరిగేదేశమని అనుకుంటే ఎవర్నయినాతప్పు పట్టగలమా!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more