• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణరాష్ట్రం కావాలని అన్నీ తెలిసినవారుఅంటున్నారు. దీన్నివ్యతిరేకించడానికి కోస్తాంధ్ర పాలక,అధికార యంత్రాంగాలు ఒకటై పనిచేసుకుంటూ పోతున్నాయి. అసలు విషయాలనుమీడియా నిష్పక్షపాతంగా చేరవేస్తేఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ వారిడిమాండ్‌ను వ్యతిరేకించకపోవచ్చులేదా వారికి న్యాయంగా ఇవ్వాల్సింది ఇవ్వాలనేమాటైనా అవనచ్చు.          చాప కిందనీరు-కె. నిశాంత్‌తెలంగాణరాష్ట్రం ఏర్పడుతందా, ఏర్పడదా అనేదిఇప్పుడు చాలా మంది బుర్రలను తొలుస్తున్నవిషయం. ఈ విషయాన్ని పక్కన పెడితేడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిప్రభుత్వం నలబై ఆరు వేల కోట్లరూపాయలతో ఇరవై ఆరు సాగునీటిప్రాజెక్టులను చేపట్టడానికి కంకణంకట్టుకున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇందులోప్రాజెక్టులకు నిధు కేటాయింపుల్లోతెలంగాణకు సింహభాగందక్కుతుందని కూడా ఆయన అంటున్నారు.రాజశేఖర్‌ రెడ్డి ప్రకటనలు విని లేదా చదివితెలంగాణవారు చంకలుగుద్దుకోవడానికి ఏమీ లేదనేది చాలామందికి అర్థం కాని విషయం.

By Staff
|
గాంధీగారు, అంబేడ్కర్‌ గారు, నెహ్రూ గారుమొదలైన మహామహులను జాతిస్మరించుకుంటూ, స్ఫూర్తిని పొందుతూవుంటుంది. అందుకుగాను వారి జయంతులు,వర్దంతుల తేదీలు మనకాలెండర్‌లో ప్రత్యేకంగాదర్శనమిస్తాయి.తద్విరుద్ధమైనభావాలు రేకెత్తించే చీకటి తేదీ కూడా ఒకటిఅదే కాలెండర్‌లో వుంది. మన జాతిని అధఃపాతాళానికి0తొక్కిన తేదీ, దాని మహామహురాలు శ్రీమతిఇందిరాగాంధీ.

ప్రతివారూ,ప్రతి సంవత్సరం జూన్‌ 25వ తేదీనిగుర్తు చేసుకోవాలి. మనదేశాన్నికమ్ముకున్న నాటి గ్రహణాన్ని గురించిపట్టించుకోవాలి.ఈజూన్‌ 25 తేదీకి దారుణంగా,భయంకరంగా విధించిన అత్యయికపరిస్థితికి మూడు దశాబ్దాలు నిండాయి.నాయా రచనలో నేను చెప్పే కొత్తవిషయాలేం లేవు. ఆలోచనాపరులుఅప్పుడప్పుడు చెబుతున్నవే. అయితే, యాఎమర్జెన్సీ పీడకలనీ, దురహంకారదుర్మార్గాన్నీ, నియంతృత్వ పోకడల్నీప్రతి తరం తెలుసుకోవాలని, అవి మరోసారివిజృంభించకుండా చూడాలని మనవిచెయ్యాలనేదే నా ఉద్దేశం. అయితేనియంతృత్వం ఒకే రూపంలోవుండదు. ప్రజలకు తెలీని, తెలియనివ్వనిఅనేకానేక రూపాల్లో ప్రవేశిస్తూనే ఉంటుంది.చెలరేగుతూ సామాన్యుని జీవితాన్ని నొక్కివేస్తూనే వుంటుంది.మనంఆధునిక యుగంలోకి వచ్చామో లేదో,అలాగే ఆధునికానంతర దశలోకివచ్చామో రాలేదో, లేక మధ్యయుగాల్లోకి తిరిగి తిరిగినెట్టివేయబడుతున్నామో పాలకులచర్యలను బట్టి తెలుసుకోవచ్చు. వేషంభాష మారినంత మాత్రాన సారంలోయుగం తీరుతెన్నులు మారవు.1947ఆగస్టు ఆర్ధరాత్రి మనకుస్వాతంత్య్రం వచ్చింది అన్నారు.ఆనందరం. స్వేచ్ఛాసౌహార్దాలువెల్లివిరుస్తాయన్నారు. సంతోషం.మనల్ని మనమే పరిపాలించుకునేమహత్తర క్షణంఉదయించిందన్నారు. అద్భుతం. ఆవిధంగా అన్న తర్వాత, 28సంవత్సరాలకే అదంతా వుత్తి భ్రమలేక భ్రాంతి అనీ, పగటి కల అనీ బాహాటంగాతెలిసేటట్లు నాజీల తరహా మార్గంలోఎమర్జెన్సీని దేశంపై రుద్దడం జరిగింది.భయానక వాతావరణాన్నిసృష్టించడం జరిగింది.ఇందిరాగాంధీనాటి ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టుతీర్పునిస్తే అది జాతికే వచ్చిన ప్రళయంగాభ్రమింపజేస్తూ దేశంలో అరాచకత్వంప్రబలిందని, క్రమశిక్షణలో పెట్టడానికిపూనుకున్నామని ప్రకటిస్తూ, ప్రజలప్రాథమిక హక్కులను నేలరాలుస్తూ,విపక్షంలోని మహానాయకుల నుండితమ అభిప్రాయాలకు తలవంచనిసామాన్యుల వరకు లక్షలాది మందినిజైళ్లలో తొక్కి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యపరిరక్షణ పేరుతో హిట్లర్‌ తర్వాతనియంతృత్వ వారసురాలిగా నిజరూపాన్నిబయటపెట్టింది శ్రీమతి ఇందిరాగాంధీ.నిజానికిఅత్యయిక పరిస్థితి అంటే - ఒకకుటుంబంలోని ఒకటిన్నర వ్యక్తులనియంతృత్వం. కనీస మర్యాదమన్నన నీతిలేని, దారుణంగాకొనసాగిన నిర్బంధ, నిరంకుశపాలన.తల్లీకొడుకుల యిష్టారాజ్యం.రాజ్యాంగానికి, చట్టాలకు న్యాయస్థానంతీర్పుకు కనీస గౌరవం లేకుండాపోయింది. ఏక వ్యక్తి నియంతృత్వానికి,వంశపారంపర్యపు పరిపాలనకిగట్టి పునాదులు వెయ్యడమేఅత్యయిక లక్ష్యం.దానికోసం కింది పాలకులలోనే అరాచకప్రవృత్తిని రెచ్చగొట్టారు. పత్రికల గొంతునొక్కేశారు. మేధావులను,ప్రతిపక్షంలోనివారిని, ఆలోచనాపరులను,ప్రజాస్వామిక వాదులను, ప్రజలపై ప్రభావంచూపగలిగినవారందరినీ అరెస్టు చేసిజైళ్లలో కుక్కారు. అధికార్లను బెదిరించితమకిష్టమైన పనులు చేయించారు.పార్టీ శ్రేణులను కిరాయి మూకగాతయారుచేసి తోడేళ్లుగా మార్చి,ఆదాయం పన్ను అధికార్లను దాడులు చేసేబృందాలుగా వాడుకుంటూ దేశం మొత్తాన్నిస్మశానంగా తయారుచేశారు.ఎమర్జెన్సీకొన్ని విషయాలు బహిర్గతం చేసింది. చేతిలోనిరాజకీయ పదవీ అరాచకత్వంతో,తెగబడే విశృంఖలత్వంతో భయపెట్టిరాజ్యాంగాన్నీ, చట్టాన్నీ తుంగలోతొక్కవచ్చు. కోర్టు తీర్పుల్నిసునాయసంగా ధిక్కరించవచ్చు.అధికార్లను బానిసలుగా చెయ్యవచ్చు.అర్హతలతో సంబంధం లేకుండావందిమాగధుల్నిఅందలాలెక్కించవచ్చు. పాదాక్రాంతంకానివారిని జైళ్లలోకి తోసి చిత్రహింసలుపెట్టవచ్చు. మానభంగాలు చెయ్యవచ్చు.పరిపాలన పేరుతో కిరాతక కృత్యాలుజరపవచ్చు. విదేశాలతో అనేక రంగాల్లోనిపనులకు కాంట్రాక్టులుకుదుర్చుకోవచ్చు. ఈ దేశసంపదనీ,మార్కెట్‌నీ యితర దేశాలకుకారుచవగ్గా అమ్మెయ్యవచ్చు. ఇవి కొన్నిమాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటేరాజ్యమంటే ఎమర్జెన్సీలో ఒక కుటుంబ ఇష్టారాజ్యం.ఇదేసందర్భంలో ఒక విషయం చెప్పాలి.శ్రీమతిఇందిరాగాంధీ గారీ మీద వ్యక్తిగా నాకుగౌరవం లేదని కాదు. వుంది. అయితే,ఆమె నెహ్రూ గారి కుమార్తెగాకాకుండా ఏదయినా ఒక రంగంలో జాతిగర్వించే విశేష ప్రత్యేకతలు,ప్రమాణాలు సాధించి ప్రధానమంత్రిఅయివుంటే ఆ గౌరవం యినుమడించేది.సరే, ఒక మహిళ భారతదేశానికిప్రధానమంత్రి కావడం, కఠిననిర్ణయాలు తీసుకునే శక్తిగా ప్రసిద్ధిచెందడం సాధారణంగా మామూలువిషయాలు కావు. కాని, మహిళఅయివుండి దౌర్భాగ్య స్థితిలో వున్నభారత మహిళలకు ఆమె చేసింది ఏమిటి?అనే ప్రశ్న ఎప్పటికీ ఎదురవుతూనేవుంటుంది. అంతా గమనిస్తున్నారనేధ్యాస కూడా లేకుండా ఆమె శక్తినంతాతన పదవి కోసం, తన కుటుంబపాలనకోసం వినియోగించడం ఆశ్చర్యపరుస్తుంది.ఆధునిక కాలంలో వ్యక్తిపూజ,నియంతృత్వ ధోరణి, అనువంశికపాలన వంటి విలువలను పాటిస్తే అవి ఏఒక్కరితోనో అంతం కావు. మొత్తంరాజ్యంలో, సమాజంలో ఎయిడ్స్‌ వంటి వ్యాధిలావ్యాపిస్తాయి. మొత్తం దేశాన్నికబళిస్తాయి.ఎమర్జెన్సీరోజుల్లో ఒక వైపు భయభ్రాంతులనుచేస్తూ ప్రజల, పత్రికల గొంతులునొక్కేస్తుంటే, పౌరహక్కులునేలరాలుస్తుంటే, నిర్బంధాలు ప్రతి రోజూప్రతిక్షణం జరుగుతూ వుంటే,ప్రజాస్వామిక విలువల్ని ధ్వంసం చేస్తూవుంటే ఆ రోజుల్లోనూ, ఆ తర్వాత మనరాష్ట్రంలో పరిస్థితి ఎలా వుందో చూద్దాం.వామపక్షం వారికి, మహాకవి శ్రీశ్రీకియిదంతా వామపక్షనియంతృత్వంగా కనిపించింది.ఇంతకంటే ఆశ్చర్యకరమైనదిమరొకటి లేదు. అలాగే ఒక వైపునఅత్యయిక పరిస్థితి పేరుతోఅమానుషత్వానికి, దేశద్రోహానికిపాల్పడుతూ వుంటే నిరంతరం ప్రజలు,ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడే పార్టీలు,వేదికలు, సభలు వీటికి యివేమీపట్టకపోవడం కూడా ఆశ్చర్యంకలిగిస్తుంది. అప్పుడప్పుడూ ఆంధ్రదేశంబానిస లక్షణాన్నే కోరుకుంటుందేమోఅనిపిస్తుంది. ఉదాహరణకి కాంగ్రెసుపార్టీవారు ఎమర్జెన్సీ విధించినందుకుయింతవరకు క్షమించమనిఅడగకపోగా, మన ప్రియతమముఖ్యమంత్రిగారు తాము తిరిగి ఇందిరరాజ్యం తీసుకువస్తామనిప్రకటిస్తున్నారు. ఇది ఆత్మగౌరవం గల ఏజాతికైనా అవమానకరమైన విషయం.తిరిగి ఇందిరా రాజ్యంతీసుకువస్తామంటే దానర్థం తిరిగిఎమర్జెన్సీ విధిస్తారనే విధంగా ప్రజలుఅర్థం చేసుకుంటున్నారు. ఇందిరాగాంధీగారి పేరే కాకుండా, ప్రభుత్వకార్యక్రమానికి, నిర్మాణానికిరాజీవ్‌గాంధీ పేరు పెట్టడం, వ్యక్తిపూజ,కుటుంబ పూజ కిందకు వస్తాయి. ఇది చాలాఅతిగా జరుగుతోంది. ఇదంతా ఆయనకుతెలుసో, తెలియకనో ఏ విధంగాజరుగుతున్నదో అర్థం కావడంలేదు. దీని వల్ల ఆంధ్రులది బానిసమనస్తత్వమని యితరులుఅనుకునే ప్రమాదం ఉంది. ఈ వైపు నుంచియిప్పటికే చాలా అపకారం జరిగిపోయింది.ఇక,ఎమర్జెన్సీ విషయంలో పార్టీలోనూ,యితరత్రా సమర్థించే వాళ్లుకొందరు వున్నారు. వారలాసమర్థించడానికి ఒక కారణం వుంది.అసలేంజరిగిందంటే -ఇందిరాగాంధీగారుపార్టీ మీద తన వుడుం పట్టు కోసం కొన్నికఠిన నిర్ణయాలు తీసుకోవడం, పనులుచెయ్యడం జరిగింది. ఇవన్నీ దేశంప్రగతిపథంలో పయనించడానికి ఆమెతీసుకున్న నిర్ణయాలుగా, చర్యలుగా యాసమర్థకులు అనుకున్నారు. ఆభ్రమలోంచి వాళ్లు బయటపడలేదు. అది నిజంకాదు. ఆమె తీసుకున్న నిర్ణయాల వల్ల,చర్యల వల్ల సామాన్యులు పొందినలాభమేమీ లేదు. ఆమె చేసిందంతాపార్టీపై పట్టుకోసం, యిమేజ్‌ కోసం. మరేమీకాదు.ఆమెభావనలలోని మరో ఘోరమైనదేమిటంటేఆమె వైఫల్యాలనుసాధారణీకరించడం. ఉదాహరణకి ఒకపక్కన దేశం అవినీతిమయంఅయిపోతుంటే, దానిపై ప్రశ్నలులేవనెత్తిప్పుడు - దీన్నిపట్టించుకోనవసరం లేదు,కరప్షన్‌ ప్రపంచమంతటావున్నదే అని తప్పించుకోవడానికిప్రయత్నించారు. ఒక ప్రధాని నుంచియిటువంటి జవాబు, ఊహ ఆశించలేం. దీని ద్వారాదేశ జీవితాన్ని మరింతగా అవినీతి వూబిలోకినెట్టివేశారు. ఇందులో ఎంతబాధ్యతారాహిత్యం వుందో అర్థంచేసుకోవచ్చు.మూడుదశాబ్దాల విధ్వంస విలువల ఎమర్జెన్సీతర్వాత, అవినీతి మొదలైనసమస్యలతో పాటు మధ్యయుగాలవ్యక్తిపూజ, వంశపారంపర్యంపైకూడాఆలోచనాపరులు తిరుగబడవలసివుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X