వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇకబస్‌ అంటున్న బసు

By Staff
|
Google Oneindia TeluguNews

కలకత్తాః పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి,మార్క్సిస్టు మహారథుడు జ్యోతిబసు మళ్ళీ రిటైరవుతానంటున్నారు.అనారోగ్య కారణాల వల్ల 1999 లోనే వైదొలుగుతాననిఆయన ప్రతిపాదించగా న్యూ మిలీనియం వరకు ఎలాగోలా నెట్టుకు రమ్మని సి.పి.ఎం కోరినవిషయం తెలిసిందే.

మునిసిపల్‌ ఎన్నికల తర్వాతైనా తననుఅధికార బాధ్యతల నుంచి తప్పించమని జ్యోతిబసు తాజాగా ప్రతిపాదించినట్టు సి.పి.ఎంవర్గాలు తెలిపాయి.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేనందు వల్ల నేను కొనసాగవలసివచ్చింది. నా వయసును,ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా పార్టీనన్ను వైదొలగనిస్తే మంచిది అని బసు గత అక్టోబరులోనే విన్నవించుకునారు.

అసెంబ్లీ ఎన్నికల వరకుఅంటే 2001 వరకు కొనసాగమని పోలిట్‌ బ్యూరో అప్పుడు జ్యోతిబసును కోరింది. జ్యోతిబసు లేకుండాఅసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేని పార్టీ ఆయననురిటైర్మెంటుకు అనుమతించక పోవచ్చు. తృణమూల్‌కాంగ్రెస్‌, బి.జె.పి కూటమి పశ్చిమ బెంగాల్‌లో ఇటీవలి కాలంలో పుంజుకున్నందున వచ్చే అసెంబ్లీ ఎన్నికలనుధైర్యంగా ఎదుర్కోవడానికి జ్యోతిబసు లాంటినాయకుడు ముందు నిలబడాల్సినఅవసరం ఉందని పార్టీ భావిస్తున్నది. కొనసాగడానికి బసు ససేమిరా అనే పక్షంలో ఉపముఖ్యమంత్రిబుద్ధ దేవ భట్టాచార్య ఆ పదవినిచేపట్టవచ్చు. చివరి క్షణంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి, పోలిట్‌ బ్యూరో సభ్యుడు అనిల్‌బిశ్వాస్‌ కు ఆ పదవి దక్కినా ఆశ్చర్యం లేదని పార్టీలోని ఒకవర్గం భావిస్తోంది.

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X