వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ విషయంలో ప్రభుత్వం బిజెపికి ప్రతిపాదన పంపడం, పంపకపోవడం అనే అంశమే కాంగ్రెస్‌ వైఖరిని స్పష్టం చేస్తుంది. బిజెపి ఆ విధమైన ప్రతిపాదన పంపడానికి పెద్దగా అడ్డు వచ్చేదేమీ లేదు. బిజెపి బలపరిస్తే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుంది. అయితే వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి సాధ్యం కాదనే మాట రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నాయకుల నుంచి వస్తున్నది. తెలంగాణ బిల్లును ప్రతిపాదిస్తామంటే వామపక్షాలు యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాయా అనేది కూడా తేలుతుంది. వ్యతిరేకిస్తూ తటస్థంగా ఉండిపోతే పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు.                                                   తెలంగాణ తేలిపోయిందా? - కె. నిశాంత్‌ తెలంగాణ అంశం తేలిపోయినట్లేనా? తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కుండబద్దలు కొట్టినట్లేనా? మీడియా అంతా ఇదే వ్యాఖ్యకు కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది సాధ్యం కాదని కాంగ్రెస్‌ తేల్చేసిందని మీడియా వ్యాఖ్యల, వార్తల సారాంశం. రక్షణ మంత్రి, యుపిఎ సబ్‌ కమిటీ చైర్మన్‌ ప్రణబ్‌ ముఖర్జీ తెలంగాణపై మీడియా ప్రతినిధుల సమావేశంలో ఇచ్చిన వివరణలకు మీడియా రంగులద్ది చేసిన వ్యాఖ్యలు. టీవీ చానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేసి కూడా ప్రణబ్‌ మాటలకు అనేక రంగులద్దాయి. ఒక ప్రధాన తెలుగు పత్రిక మాత్రం ప్రణబ్‌ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన విషయాలను వక్రీకరించకుండా ప్రచురించింది. అదే పత్రిక యాజమాన్యంలో నడిచే తెలుగు టీవీ చానల్‌ మాత్రం దుర్వ్యాఖ్యలు చేసింది.

By Staff
|
Google Oneindia TeluguNews

నవంబర్‌ఒకటి కాలెండర్లో ఒక తారీకుమాత్రమే కాదు. తెలుగువారు ఎన్నోఆనందకర భావోద్రేకాలకు,ఉద్విగ్నతలకు, ఆశావహ వూహలకు,ఆశలకు, ఆశయాలకు తీవ్రంగా లోనైనరోజు. ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన రోజు.తెలుగుజాతి ఒక రాష్ట్రంగా అర్థశతాబ్దికృషి ఫలితంగా ఏర్పడిన రోజు. ఆనాటిఆనందకర ఉత్సాహభరిత భావనలుయివాళ మనల్నిముంచెత్తుతున్నాయా? లేదు.ఎందుకంటే, రాష్ట్ర అవతరణ జరిగిందినన్న మొన్నా కాదు. దాదాపుఅర్ధశతాబ్ది క్రితం జరిగిన సంఘటన. ఒకవ్యక్తికిగాని, ఒక రాష్ట్రానికి గాని యిదితక్కువ వయసు కాదు. రాష్ట్రంయాలోగా ఎన్నో ఆటుపోట్లకు, ఒడిదుడుకులకువిపత్కర విషాద హింసాత్మక ఆరాచకపరిస్థితులకు లోనైంది. ఇంకా, రానున్నకాలంలో యా దారుణాలు పెరుగనున్నాయేగాని, తక్కువయ్యేట్లు లేదు. పైగారాష్ట్రం ముక్కలయ్యే దుస్థితిరెండవసారి ఎదుర్కొంటున్నది.రాష్ట్రంఏర్పడిన నాటి నుండి నేటి వరకుఅభివృద్ధి పథంలో సాధించింది బహుతక్కువ. దుష్పరిణామాలు చాలా ఎక్కువ.దానికి కారకులు మన పరిపాలకులే.ప్రచారం మాత్రం గోబెల్స్‌ను మించివుంటుంది. అభివృద్ధి అంటే వీరి దృష్టిలోహైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లోనివెడల్పయిన రోడ్లు, బహుళ అంతస్తులభవనాలు, నక్షత్ర హోటళ్లు వగైరాఆడంబరాలు. వీటి పక్కనే అపరిమితవేగంతో పెరిగిపోతున్న నిరుద్యోగం,ఆకలి, కడుపు చేత పట్టుకొని రాజధానికితరలివస్తున్న, అలాగే యితరరాష్ట్రాలకు కూడా నిత్యం వెళ్లిపోతున్నఅసంఖ్యాక అభాగ్యులు. మరొక వైపునదొంగతనాలు, దౌర్జన్యాలు, కిడ్నాపులు,ఆక్రమణలు, హింస జీవన విధానంగామార్చుకున్న కిరాయినరహంతకులు, వెనక రాజకీయాలు,అన్నింటినీ మించిన అవినీతి... వీటిని పరిపాలకులుసీరియస్‌గా దృష్టిలోకి తీసుకోరు.ఉపన్యాసాల్లో, పత్రికా ప్రకటనలలో అభివృద్ధిసాధిస్తున్నామనే పాట జాతీయ గీతంపాడుతున్నట్లు పాడుతూ వుంటారు.ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర సాధనకై పట్టుదలతో చేసినకృషి వెనక ఆనాడు నిలిచిన స్వదేశీభావన, స్వాభిమానం పునాదిగా,స్వభాషాభివృద్ధితో అన్ని సమస్యలూపరిష్కరించుకుంటూ, జాతి జాతంతా ఒకతాటిపై సాగిపోవాలనే లక్ష్యాలు యివాళఏమైనాయి? ముఖ్యంగా సంకల్ప బలంఏమైంది?మొదట్లో,రాష్ట్రావతరణకు పూర్వం,అర్ధశతాబ్దికి ముందరే మనసరిహద్దు రాష్ట్రాలలోని తెలుగువారినిమొత్తం కలుపుకుని ఒక సమగ్రతెలుగు వారిని మొత్తం కలుపుకుని ఒకసమగ్ర తెలుగు రాష్ట్రం కోసంఉద్యమం రాజుకున్నది. క్రమంగా ఆఉద్యమంలోని వేడి తగ్గుతూ, చివరికికొన్ని ప్రాంతాలతో అసమగ్ర తెలుగురాష్ట్రం ఏర్పడింది. దీనికి కారణంఎప్పటికప్పుడు నిద్ర లేకుండా, రాజీపడుతూ వచ్చిన నాటి నాయకులే.స్వాభిమానంమన నాయకులకు ఎన్నడూ పట్టినట్లులేదు. రక్తంలో ప్రవహించినట్టు కాదు.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడుబయటివారు ఆంధ్రులను మద్రాసీలుమద్రాసీలుగా పిలిచేవారు. నైజాం పాలనలోవుండడం వల్ల తెలంగాణీయుల్నినైజాం ప్రాంతీయులుగా ఉదహరించేవారు.రెండవదానిని అర్ధం చేసుకోవచ్చు.మొదటి దానిని అర్థం చేసుకోలేం.ఆంధ్రప్రదేశ్‌ఏర్పడిన తరువాత,తెలుగువారంతా ఒక్కటే, యిది ఒకే జాతి,తెలుగు జాతి అని నిరూపించడానికి పాలకులుకృషి చేయవలసి వుండింది. అనేకచారిత్రక కారణాలవల్ల, ఆయా ప్రాంతాల్లోచోటు చేసుకున్న ఆర్ధికవెనుకబాటుతనాన్ని పారదోలి సమగ్రఅభివృద్ధి కోసం ఉడుంపట్టుతోప్రయత్నించవలసి వుండింది. మరీముఖ్యంగా భారతదేశంలోనేమొదటిసారి భాషా ప్రాతిపదికపై గలరాష్ట్రం గనుక, ఏర్పడిననాటినుండే తెలుగు భాషాభివృద్ధికి,సంస్కృతుల విలీనానికి నడుం కట్టవలసివుండింది. భాషా ప్రాతిపదిక సూత్రంవెనక, మాతృభాష ద్వారా ప్రజలకుఅభివృద్ధి చేకూర్చడంసులువవుతుందనే భావనవున్నట్లు మన నాయకులకుఅర్ధమైనట్లు లేవు. కనసీంఎవరినైనా అడిగి అర్ధం చేసుకోవడానికిప్రయత్నించినట్లు కూడా లేదు.అందువల్లనే ప్రజలను అనేక సమస్యలుచుట్టుముడుతున్నాయి. చివరకు,పాలకులే ప్రజలకు పెద్ద సమస్యగాతయారైనారు.స్వాభిమానంవిషయంగా మరొక మాట. స్వాతంత్య్రంవచ్చిన తరువాత కూడా మనపాలకులు, నాయకులు తమకు తాముగాఢిల్లీకి కట్టుబానిసలుగా,వందిమాగధులుగా ఎట్లా తయారైనారోగమనిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఈపిచ్చితనం యింకా పెరుగుతున్నదేగాని, తగ్గడం లేదు. ఇవాళ్లజరుగుతున్నదేమిటో చూస్తేతెలుగువారిగా మనం తల దించుకోవాలి.ప్రతి దానికీ, ఇందిరా రాజ్యం, ఇందిరాసాగర్‌,రాజీవ్‌ పల్లెబాట, రాజీవ్‌ నగరబాట,రాజీవ్‌ ఇంటర్నెట్‌ విలేజ్‌, రాజీవ్‌గృహకల్ప, రాజీవ్‌ అంతర్జాతీయవిమానాశ్రయం... యిలా తెలుగు రాష్ట్రాన్నిబాహాటంగా అమ్మేయడం జరిగింది. ఇది తెలుగువారిస్వాభిమానాన్ని హత్య చెయ్యడం కాదా!విచిత్రం,వీళ్లంతా ఉన్నత విద్యలు చదివివనారే.ఆత్మాభిమానం లేని చదువులుఎందుకు?నాయకత్వంవిషయంలో, గతంలో, కొందరు స్థానికస్థాయిలోను, మరికొందరు ఆయారాజకీయ పార్టీల పరిధుల్లో, కొన్నిపరిమితుల్తో జాతీయ స్థాయికి ఎదిగిననాయకులు అక్కడక్కడా కనిపిస్తారు. వారిలక్ష్యాలు కూడా పరిమితమైనవే. కాని,ఎటువంటి పరిధులు, పరిమితులు లేకుండా,కులాలు మతాలకు అతీతంగా తెలుగుజాతినంతటినీ ఒకటి చేసి,సమగ్రాభివృద్ధి వైపు నడిపించగలనాయకులు మనకింకా రాలేదు.నేటినాయకులు బోన్సాయ్‌ వృక్షాలలాంటివారు. వీరి నీడలో ప్రజలు సేదతీరలేరు. వీరి దృష్టిలో ప్రజలంటే కనీసంరక్తమాంసాలున్న మనుషులు కాదు.ప్రజలంటే ఓటర్లు. మార్కెట్లో కొనుక్కోగలిగినసరుకులు. రాజకీయమంటే వ్యాపారం.అభివృద్ధి అంటే వేల కోట్ల ప్రజాధనంతోప్రాజెక్టులు, అప్పగించేది కాంట్రాక్టర్లకు,తిరిగి దాని నుండి లక్షలకు లక్షలు కమీషన్‌రూపంలో నాయకులకు చేరడం.బాధ్యతలేని, నైపుణ్యంలేనికంటితుడుపు పనులు. కష్టాలు ప్రజలకు,శిక్షలు పడని నాయకులు. ఇదే సంక్షేమరాజ్యం కథ.ఆశ్చర్యకరమైనవిషయమేమంటే - ఏ మొత్తం సమాజసంక్షేమ దృక్పథంలో, ఆలోచనలో,ప్రణాళికలో, కార్యక్రమాల్లో, ఏ స్థాయిలోనూతెలుగు భాషాభివృద్ధి గురించినప్రస్తావన లేదు. ప్రభుత్వ ఎజెండాలోలేదు. ఆ విధంగా ప్రభుత్వానికీ,ప్రజలకు, వారి భాషకు సంబంధం లేకుండాపోయింది. పేరుకు మాత్రంభాషాప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రం.ఒక్కసారిగతంలోకి వెడదాం. మొదటి నుండిమొదలెడదాం. 1956 నవంబరుఒకటిన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది.అప్పుడు గొప్ప ఉత్సవ వాతావరణంరాష్ట్రమంతా పొంగిపొర్లుతోంది. ఆసంరంభం రాజధానిలో ఎలా వుందోచూద్దామని నేను నవంబరురెండవ తారీకునే, - బందరునుండి హైదరాబాదుకు వచ్చాను.స్వయంగా గమనించింది చెబుతాను.అప్పుడుయిక్కడ గాలి అంతా ఉత్సాహంతో, ఉత్తేజంతో,ఆవేశంతో నిండి వుంది. ఒక ఆదర్శప్రవాహం అందర్నీ ముంచెత్తుతోంది.హైదరాబాదు మినీ భారతదేశంవంటిది. అన్ని మతాలవారు, అన్నిప్రాంతాలవారు, అన్ని భాషీయులు, అన్నిసంప్రదాయాల వారు జంటనగరాల్లోవున్నారు. వైవిధ్య జీవితంకలగలిసినవారు, ఎక్కడయినా కొంతభయాందోళనలు మనసులో వున్నా,సాధారణంగా అంతా రాష్ట్రావతరణఒక పండగగా భావించారు. రెండుప్రాంతాల తెలుగువారిలో కొత్త జీవితంప్రారంభమవుతున్నదనే ఆశనిలువెల్లా కనబడింది. ఇక్కడ ముఖ్యంగాచెప్పవలసిన విషయం ఒకటి వుంది.ఆనాడు తెలుగువారితో పాటు,తెలుగేతరులలో కూడా మొత్తంప్రభుత్వ, ప్రభుత్వేతరకార్యకలాపాలన్నీ తెలుగులోకిమారబోతున్నాయనీ, ఉర్దూ నుండి ఇంగ్లీషునుండి తెలుగులోకి మారబోతున్నాయనిఅనుకున్నారు. ఇది చాలా సహజమైనమార్పుగా వారు భావించారు. ఆ మార్పుకుఅనుగుణంగా తమనుతీర్చిదిద్దుకోవడానికి మానసికంగాసంసిద్దులయ్యారు. చిన్న దుకాణంనుండి పెద్ద వ్యాపారం వరకు,ప్రభుత్వ కార్యాలయాల్లో, యితరప్రదేశాల్లో మొత్తం తెలుగులోనేజరుగుతుందని భావించారు. కానీకష్టపడకుండా, ప్రచారంచెయ్యవలసిన అవసరం లేకుండా, యాసానుకూల వాతావరణాన్నిఉపయోగించుకోవచ్చుననే ఆలోచనే మనపరిపాలకులకు రాలేదు. భాషా ప్రయుక్తరాష్ట్రం అనేది మరిన్ని రాజకీయ పదవులపందేరానికి ఏర్పడింది అనుకున్నారుతప్ప మాతృభాషాభివృద్ధి, ప్రజలసంక్షేమ సాధనకు దగ్గరిదారిఅవుతుందనే అవగాహనలేకపోయింది. ఆ విధంగా ఆనాడు ప్రజలుయిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఒకచారిత్రక విషాద సన్నివేశం.ఈవిషాద కెరటం వెన్నాడుతూ యానాటికీవిపత్కర పరిస్థితులను సృష్టిస్తూనేవుంది.1969లోఅసంతృప్తి బద్దలై వుధృతంగావచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమనేపథ్యం రెండు ప్రాంతాలవారి జీవనవిధానాలు, రెండు భాషాసంస్కృతులమధ్య వైరుధ్యాలు, భగ్గున మండిబయటపడ్డాయి. నాయకులకు పదవీతాయిలాలు విసిరి తాత్కాలికంగా అణచివేశారేగాని ఆ బీజాలు యింకా అలానే వున్నాయి.అందువల్లనే తిరిగి యిప్పుడు రెండవసారివిరుచుకుపడింది. మూలాల్లోకి వెళ్లి అసలుసమస్యలు పరిష్కరించడానికి ఎంత కాలంపూనుకోరో అంతవరకు అసంతృప్తిఅగ్నిపర్వతంలా లోలోపల రాజుకుంటూనేవుంటుంది.ఇంతకుముందు చెప్పినట్టు - వొక శతాబ్దంక్రితం నాటి నాయకులు అన్ని ప్రాంతాలలోని,అన్ని సరిహద్దు రాష్ట్రాలలోనితెలుగువారినందరినీ కలుపుకుని ఒకసమగ్ర తెలుగు రాష్ట్రం కోసం కృషిచేశారు. కాని, సాధించింది కొన్ని ప్రాంతాలతోకూడిన రాష్ట్రం మాత్రమే. దీనికిభాషాప్రయుక్త రాష్ట్రం అని పేరు పెట్టారు.కాని, అది నిజం కాదు. ఆంధ్ర రాష్ట్రంలోమరికొన్ని తెలుగు ప్రాంతాలు చేర్చి యింకాస్తపెద్ద రాష్ట్రాన్ని సాధించారు తప్పసమగ్ర తెలుగు భాషా ప్రయుక్తరాష్ట్రం సాధించలేదు. ఇంక, మనపాలకుల నుండి ఆశించిన విషయం వైపునుంచి చూస్తే - భాషా ప్రయుక్తరాష్ట్రమంటే మాతృభాషలోనేసర్వవ్యవహారాలూ జరిగే రాష్ట్రం. అలాజరగలేదు. ఆనాడే తగు చట్టాలుతీసుకువచ్చి ప్రభుత్వ, ప్రభుత్వేతరకార్యక్రమాలన్నీ తెలుగులోనేనిర్వహించడం, అలాగే పాఠశాలల్లో, అన్నివిద్యాలయాల్లో కింద మెట్టునుండిపైమెట్టువరకు, అన్ని కోర్సుల్లో, అన్నిస్థాయిల్లో బోధనాభాషగా తెలుగునుప్రవేశపెట్టి, అవన్నీ సమర్థంగా,జయప్రదంగా కొనసాగడానికిఅవసరమకైన భాషా పరికరాలుఎప్పటికప్పుడు తయారు చేయించియిస్తూ వుంటే రాష్ట్రం అభివృద్ధిసాధించడమే గాక యివాళ యిన్నిసమస్యలు చుట్టుముట్టేవి కావు.ఇతరప్రాంతాలకూ, యితర దేశాలకూచదువుకోలేనివారు,చదువుకున్నవారు యింత పెద్దఎత్తున వలసపోయే వారు కాదు.రెండు ప్రాంతాల మధ్య అనుమానాలు,అవగాహనా లోపాలు, వైరుధ్యాలు ఉండేవికాదు. అన్నదమ్ముల మధ్య అగాధాలుఏర్పడేవి కావు. ప్రత్యేక రాష్ట్రఉద్యమాల వరకు పరిస్థితి వచ్చేదికాదు. బహుశా, నిరుద్యోగ సమస్యయింత తవ్రంగా వుండేది కాదు.తీవ్రవాదం పెరిగి వుండేది కాదు.పైనపేర్కొన్నవన్నీ యివాళ తెలుగుజాతిఅస్తిత్వానికే సవాళ్లుగా నిలిచిన సమస్యలు.జరిగిందేదో జరిగింది, కోల్పోకూడనంతసమయం కోల్పోయాం. యిప్పుడయినామేల్కొని రానున్న తరాలను దృష్టిలోపెట్టుకుని, నడుం కట్టి, తెలుగు భాషనుసర్వరంగాల్లో, ప్రతి స్థాయిలోప్రవేశపెట్టి, దానినొక ఆయుధంగామలిచి, ఉపయోగించి, యా సమస్యలనుపరిష్కరిస్తూ తెలుగు జాతిని ప్రపంచంలో ఒకశక్తివంతమైన జాతిగా తీర్చిదిద్దాలి.ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రావతరణ సందర్భంగా,మరొకసారి ప్రజలు సాలకుల నుండి యావిధంగా ఆశించడంలో తప్పులేదనుకుంటాను.తెల్లవనివన్నీపాలు కాదు, కనిపించేదంతా అభివృద్ధికాదు. కనక పరిపాలకులు ఆత్మపరిశీలనలో స్వభాష, స్వాభిమానంతోమేల్కొనకపోతే భవిష్యత్తులోఆంధ్రప్రదేశ్‌ అంధప్రదేశ్‌గా మారేప్రమాదం వుంది.ఇదిఒక హెచ్చరిక.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X