• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభుత్వమా, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీయా?

By Staff
|

రాష్ట్రంలోరోజురోజుకు పెరిగిపోతున్న హింస వల్లమనం ఎటువైపు పయనిస్తున్నామనేప్రశ్న సహజంగానే మనముందుకొస్తుంది. హింసవల్ల,విధ్వంసంవల్ల మానవాభివృద్ధిజరగదనేది మౌలిక విషయం. ఎంతమంచి లక్ష్యం, ఆశయం కోసమైనావిధ్వంసం అభిలషణీయం కాదు.తమపంతం నెగ్గించుకోవడానికి ఎవరూహింసకు, విధ్వంసకాండకుపాల్పడినప్పటికీ తీవ్రంగాఖండించాల్సిందే, నిరసించాల్సిందే! నిజానికిహింస, విధ్వంసకాండ పూర్తిగాఅనాగరికం, ఆటవికం, అవమానకరంగాభావించాలి. ఇంత నాగరికత పెరిగిందనిభావిస్తున్న తరుణంలో ఈ ఆటవికప్రక్రియను ఎవరూ హర్షించరు.నక్సలైట్లుగాని,మావోయిస్టులుగాని కోరుకుంటున్న సమాజంఇది కాదు కదా? ఇలాంటి పరిస్థితులు,పరిణామాలు కాదు గదా? ప్రజలుతలెత్తుకుని తిరిగే సమాజం కోసంప్రాణత్యాగానికైనా సిద్ధపడిననక్సలైట్లు ఇప్పుడు ప్రజలు ఇలా దీనంగా,అనాథలుగా, అభాగ్యులుగా బతికే పరిస్థితులుఏర్పడేందుకు దోహదపడే విధంగాప్రవర్తిస్తే ఎలా?సుదీర్ఘపోరాటం అనంతరమైనా తాముఆశిస్తున్న పద్ధతిలో అధికారందక్కుతుందన్న ఆశకనిపించనప్పుడు, ప్రపంచవ్యాప్తంగాఅలాంటి వాతవరణం లేనప్పుడు,ప్రజల మానసిక స్థితి అందుకుఅనుకూలంగా లేనప్పుడు కేవలంకొంతమంది అవగాహన, ఆలోచనలు,భావతృప్తి కోసం జూదంలో ప్రజల ప్రాణాలను,వారి ఆస్తులను, వారి భవిష్యత్‌ను పణంగాపెట్టడం వివేకం కాదు.గతనాలుగు దశాబ్దాలుగా నక్సలైట్‌ఉద్యమం మనగలిగింది కాబట్టి ఆఉద్యమానికి ఇక మరణం లేదని అదేపనిగా నెత్తుటి అప్పు తీర్చుకోవడం కోసంఆరాటపడటం అభినందనీయం కాదు.అణచివేతపై,అన్యాయాలపై తిరగబడటం కేవలం నాలుగుదశాబ్దాల క్రితం నుంచేప్రారంభమైందనే విధంగామాట్లాడ్డం సబబు కాదు. అణచివతే,దౌర్జన్యం, దోపిడీ పుట్టినప్పటినుంచే తిరుగుబాటు పుట్టిందని, ఆతిరుగుబాటు ఇక ముందు కూడా ఉంటుందని,అయితే అది నక్సలైట్లు భావిస్తున్నట్లుగానో,మావోయిస్టులు తలుస్తున్నట్టుగానోఉండనక్కర్లేదు. తిరుగుబాటుకునిర్దిష్టరూపం ఎప్పుడూ లేదు. కాబట్టితిరుగుబాటు స్వభావం తమ వల్లనేవెల్లువెత్తిందని, తమదొక్కరిదేధర్మాగ్రహమని భావించడం కూడాసమంజసం కాదు.దోపిడీదౌర్జన్యాలకు, అక్రమాలు అన్యాయాలకువ్యతిరేకంగా నక్సలైట్లు/మావోయిస్టులు తిరుగుబాటు చేస్తే ఇంతగందరగోళం, ఇంత విధ్వంసం జరిగేదికాదు. ఆ తిరుగుబాటులో రాజ్యాధికారంఅనే కాంక్ష బలం ఉండటం మూలంగానేఇంత రక్తం ఏరులై పారుతోంది.నిజంగాగ్రామాల్లో, పట్టణాల్లో అన్యాయాలనడ్డివిరిచేందుకునక్సలైట్లు/మావోయిస్టులు ప్రాధాన్యంఇస్తే పరిస్థితి వేరుగా ఉండేది. ఆ చర్యకాస్త వెనుకసీటులోకి వెళ్లిరాజ్యాధికారం కాంక్ష ముందు సీటులోకిరావడంతో అంతా కంగాళీగా మారింది.సమాజరీతిలోరాజ్యాధికారం దక్కించుకుంటే ఎవరికిఎందుకు అభ్యంతరాలుంటాయి. అలాగాకఅసహ్యరీతిలో రాజ్యాధికారం చేపట్టాలనిఆరాటపడటమే ఈ సమస్యలకన్నింటికీమూలకారణంగా కనిపిస్తోంది. మరి ఈఅసహజమైన కాంక్షతో అతిగా ప్రవర్తించి,మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఆయుధంతోఅడవిలో, మైదానంలో సంచరించి,అసహనంతో అనుమానమున్నవారినల్లా హతమారుస్తూ పోతేరాజ్యాధికారం దక్కుతుందా?మావోయిస్టులుగాని,నక్సలైట్లుగాని అపూర్వమైన త్యాగాలుచేస్తున్నారని వారి ప్రతినిధులు, కవులు,గాయకులు తమ తమ ప్రక్రియలతోప్రచారం చేస్తూ ఉన్నారు. వారిసానుభూతిపరులు కూడా నక్సలైట్లత్యాగాలను కీర్తిస్తూ వుంటారు. ఆవిధంగా సానుభూతి వెల్లువనురాబట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.ఒకేఒక విషయం అందరూ ఆలోచించాలి. త్యాగమనిఎప్పుడంటాం? దేన్నీ ఆశించకుండా, దేన్నీకోరకుండా నిస్వార్థంగా చేసినప్పుడే అదిత్యాగమవుతుంది. ఇందులో ఎవరికీఎలాంటి అభ్యంతరంఉండదనుకుంటాను. మరి మావోయిస్టులురాజ్యాధికారం ఆశిస్తూ, అధికారం కోరుతూపని చేస్తున్నప్పుడు అది త్యాగమెలాఅవుతుంది?నిజంగాత్యాగగుణంతోనే మావోయిస్టులు/నక్సలైట్లు పనిచేస్తే గత నాలుగుదశాబ్దాల్లో సమాజం ఎంతో ఉన్నతంగాఎదిగేది. ఎంతో అభివృద్ధిని పేద ప్రజలుసాదించేవారు. వారి బతుకులుబంగారమయ్యేవి. వారి పిల్లలు ఈ పోటీకీనిర్ణయాత్మక పాత్రనునిర్వహించేవారు. కానిదురదృష్టవశాత్తు వారు తాగ్యంచేస్తున్నామనే ఆలోచనలతో, తమనితాము వంచించుకుంటూరాజ్యాధికారం అనే స్వార్థంతో పనిచేయడం వల్ల వారు చెప్పేదొకటి,చేసేదొకటిగా కనిపిస్తుంది. అదేనడుస్తున్న చరిత్రగా కనిపిస్తోంది.మరిమావోయిస్టులుగాని మరొకరు గానిఆశిస్తున్నది ఇదా? ప్రజలు కోరుకుంటున్నది ఇదా?నాగరికులు ఆశిస్తున్నది ఇదా?.... ఎంతమాత్రం కాదు. కాబట్టి మావోయిస్టులు/నక్సలైట్లు నిజమైన త్యాగాలకేసిద్ధమైన రోజు ఈ సమాజం ఇలా ఉండదు. ఈహింసాకాండ, నెత్తుటేరులు పారవు.పేద ప్రజలందరూ కోరుకునేదిఇదేగా?

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more