వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్రకథ పితామహుడు - నగ్నమునిఈ మధ్య మనం తెలుగు భాష ప్రాచీనత గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటువంటి చారిత్రాత్మక సందర్భం యిన్ని శతాబ్దాల తర్వాతనయినా వచ్చినందుకు సంతోషం. ఈ ప్రాచీనతపై పరిశోధనలో జనజీవనంలో అట్టడుగున కూరుకుపోయిన మరిన్ని తెలుగు సంపదలు వెలుగు చూస్తాయని ఆశిద్దాం.అలాగే, భాషతో పాటు మన కళల అడుగుజాడల ప్రాచీనతలతోకి కూడా వెళితే మరెంతో సంపద మనకు సమకూరే అవకాశం వుంటుంది. తద్వారా భాష, కళల మూలాలు మరింత వివరంగా తెలిసే వీలు వుంటుంది. కళాకారులు యా పనికి పూనుకుంటారని ఆశిద్దాం. మూలాలు తెలిసిన జాతి పయనం పటిష్టమవుతుంది. అన్నింటిలోకి విలువైనది స్పష్టత. ఎలాగూ భాషపై ప్రారంభించాం కాబట్టి కళలపై కూడా పరిశోధన మరింత లోతుగా జరిగితే బావుంటుందని భావన. ఇదే సందర్భంలో ఒక విషయం ఆనందంగా చెప్పాలనిపిస్తోంది. ఇటీవల కొంత మంది మిత్రులు అంతరించిపోతున్న మన స్వదేశీ కళలు, క్రీడలు, సంస్కృతులను కాపాడుతూ, సామాజిక న్యాయసాధన దిశగా వాటిని ప్రోత్సహిస్తూ కవులు, కళాక్రీడాకారుల సంక్షేమం కోసం కృషి చేయడం ధ్యేయంగా పెట్టుకుని" - యక్షగానవేత్త బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్‌ నాజర్‌ పేర కళాక్షేత్రమనే ఒక వేదికను ఏర్పాటు చేశారు. వీరి ఆదర్శం గొప్పదే. అంతకంటే వీరిలోని గొప్పదనం యా కళాక్షేత్రాన్ని షేక్‌ నాజర్‌ పేర ఏర్పాటు చేయడం. నాజర్‌ పట్టుపరుపుల మీద పుట్టినవాడు కాదు. బంగారు ఉగ్గు గిన్నెతో పెరిగినవాడు కాదు. మెతుకులు ఏరుకుంటూ బతికినవాడు. అగ్రవర్ణాల నుండి కాదు, అల్ప సంఖ్యాక వర్గం నుండి వచ్చినవాడు. పేదరికం అసలు రంగు తెలిసినవాడు. యాయవారంతో గడప గడపకూ మారుతూ, జోలె పట్టుకుని నాట్యనాటక గానకళలు నేర్చినవాడు. పొట్టకూ కళకూ లంగరందక కూలిపన్లు చేస్తూ కిందపడుతూ లేస్తూ తన కళకు మెరుగులు దిద్దుకోవడం కోసం దేశదిమ్మరిగా తిరిగినవాడు. ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌. పద్మశ్రీ నాజర్‌ కళాక్షేత్రం అని యా వేదికను ఏర్పాటు చెయ్యడం నాకెంతో సంతోషం కలిగించింది. నాజర్‌ కొన్ని సినిమాల్లో బుర్రకథ చెప్పాడు. కొందరికి నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు ఎస్‌. రాజశ్వేర్‌ రావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంత ంసాధన చేస్తూ శోధనచేస్తూ కళను మరింత శోభాయమానంగా చేస్తూ ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం మూలాల్లోకి సాగించిన మహనీయుడు మన నాజర్‌. నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ వుంటుంది. ఆనాడు ఎస్‌. రాజశ్వేరరావు గారి కోరిక ప్రకారం నాజర్‌ సినీరంగంలో స్థిరపడి వుంటే ఎన్ని వందల వేల రికార్డులు తెలుగువారికి అందివుండేవో, ఎన్ని గంధర్వగాన సాగరాలు వుప్పొంగేవో, సరే. అది వేరే కథ. ఒక చోట కోల్పోయింది మరో చోట మరో రూపంలో గెలుపుకు నాంది అవుతుంది. నాజర్‌ అటు వైపు గాకుండా యిటువైపు రావడం వల్ల తన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు సంరక్షించుకుంటూ సంపూర్ణత వైపు ప్రయాణించడం వల్ల జనపదం మరింత విశాలమైంది. కళల అగాధం తెలుగువారికి అందుబాటులోకొచ్చింది. ఇదే సందర్భంలో రెండు గ్రంథాల గురించి ప్రస్తావించాలి. ఒకటి పింజారి - ఆయన ఆత్మకథ. రెండవది నాజర్‌ స్వీయ రచన జాతి జీవితం - కళా పరిణామం. ఇవి అద్భుతమైన గ్రంథాలు. రెండు సాహితీ సంఘటనలు. ఇంతకు ముందు చదివివనారు మరల మరల చదివాలి. ఇంతకు ముందు చదవనివారు తప్పనిసరిగా చదవాలి. నాజర్‌ ఆత్మకథ పింజారి చిన్న గ్రంథమే అయినా, తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్వడానికి ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చిందీ, అవగాహనా క్షేత్రం ఎంతగా విశాలం చేసిందీ వివరంగా చెప్పాడు. ఎవరు తనను మొదట్లో చేరదీసిందీ, అన్నం పెట్టిందీ విద్య నేర్పిందీ మహా పండితుల నుండి తనకంటే విద్యలో చిన్నవారైన వంతల నుండి తానేం నేర్చుకున్నదీ పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు. ముఖ్యంగా బుర్రకథా గానంలో వంతగా వున్న రామకోటి నుండి తానేం నేర్చుకున్నదీ, అతను తననెంత వుత్తేజపరిచిందీ, అతని గొప్పతనం ఏమీటో చాలా చెప్పాడు. సాధారణంగా ఏ రంగంలోనైనా సరే ఒక స్థాయికి చేరుకున్నవారు, కీర్తి సంపాదించినవారు, తాము ఎవరి నుండి నేర్చుకున్నారో చెబుతున్నప్పుడు - తమ కంటే అన్నింటా, ముఖ్యంగా కీర్తిపదవుల వంటివాటిలో, పెద్దరికం చలాయిస్తున్న వారి గురించి చెబుతారే తప్ప చిన్నవారి గురించి చెప్పరు. నిజానికి ఈ చిన్నవాళ్లే వారి జీవితంలో మెట్లు ఎక్కడానికి సహాయపడిన వాళ్లు అయి వుంటారు. ఈ దృష్టితో చూసినప్పుడు పింజారిలొ నాజర్‌ పాటించిన విలువలు ఆశ్చర్యం కలిగిస్తాయి. గాన కళా గర్జనలో ప్రజల తరఫున నిలిచిన యుద్ధవీరుడిలా కనిపిస్తాడు. రెండవది - జాతి జీవితం - కళా పరిణామం. ఈ గ్రంథంలో నాజర్‌ చరిత్రకారుడిగా, మేధావిగా, పరిశోధకుడిగా విశ్వరూపంలో కనిపిస్తాడు. మావన పరిణామ క్రమం, సాంస్కృతిక చరిత్రల వెనక దాగి వున్న మరో పార్శ్వాన్ని ఆవిష్కరిస్తాడు. ఈ గ్రంథంలో నాజర్‌ చెప్పే విషయాల్తో చాలా మంది ఏకీభవించే అవకాశం లేదు. ఎందుకంటే చాలా అసత్యాలు పునాదులుగా చరిత్ర భవంతులు లేచాయి. ఆ భవంతులను యిప్పుడు కూల్చడానికి ఎక్కువ మంది ఒప్పుకోరు. అలాగే సామాన్యులు యిప్పటి వరకూ తాము నిజాలుగా నమ్ముతున్నవి అసత్యాలని అంగీకరించేందుకు సిద్ధంగా వుండరు. ఏది ఏమైనా నాజార్‌ ఈ గ్రంథం ద్వారా మన ముందుకు తీసుకువచ్చిన విషయాలు, ప్రతిపాదనలపై ఆరోగ్యకరమ్న చర్చ జరగవలసి వుంది. ఇది ఉత్తి గ్రంథం కాదు. తేనెతుట్టె. కదిలించడానికి సాహసం కావాలి. తన జీవితం జనజీవితంగా గడిపినందుకున, అత్యున్నత కళా ప్రమాణాలు సాధించినందుకు అరుదైన ఈ రెండు గ్రంథాలు మనకు అందించినందుకు షేక్‌ నాజర్‌కి జేజేలు పలకాలి. తెలుగు భాష, తెలుగు కళల మూలాలపై మరింత కాంతి ప్రసారానికి నాజర్‌ మార్గం, అనగా ఆలోచనారీతి ఉపయోగకరమేమో ఆలోచనాపరులు పరిశీలించాలి.

By Super
|
Google Oneindia TeluguNews

నేడుప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థఒక తీవ్ర సంక్షోభంలో చిక్కుకొని ఉంది. ఈనేపథ్యంలో ఈ వ్యవస్థనుఅంతమొందించడం, సోషలిస్టువ్యవస్థను నిర్మించుకోవడంప్రపంచవ్యాప్తంగా మానవాళిముందున్న ప్రధాన కర్తవ్యం.లాటిన్‌ అమెరికా వంటి ఖండాలలో ఇప్పటికీ ఈదిశగా ప్రయాణం ఆరంభం అవుతోంది. ఈపరిస్థితులలో గతంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు ఆశాదీపంగావున్న సోవియట్‌ సోషలిస్టు వ్యవస్థపతనానికి కారణాలను ఒకసారిసమీక్షించుకోవడం అవసరం. ఈ సమీక్షకేవలం చారిత్రక వివరాల పట్లఆసక్తితోనే కాక, ప్రస్తుత పోరాటాలలోస్ఫూర్తి కోసం, స్పష్టత కోసం కూడాతప్పనసరి అవసరం.సోవియట్‌యూనియన్‌ పతనానికి అది శాంతియుతపోటీలో పెట్టుబడిదారీ వ్యవస్థ బలంముందు ఓడిపోవటమే కారణమనినేటికీ పలువురు భావిస్తున్నారు.అయితే వాస్తవానికి సోవియట్‌ సోషలిస్టువ్యవస్థ కూలడానికి అసలు కారణం అదిసామ్రాజ్యవాదులతో ఎదుర్కొన్న సమస్థాయిలేని పోటీయే. అలాగే ఈ విప్లవ క్రమంఆరంభం నుంచి సోషలిస్టు రష్యా పలుబాలారిష్టాలను ఎదుర్కొంది. ఈ వ్యవస్థనుమొగ్గలోనే చిదిమి వేసేందుకు జరిగినప్రయత్నాలు చెప్పనలవి కాదు. కానీ నేడుఅంతర్థానమైపోయిన ఈ వ్యవస్థప్రపంచ చరిత్ర పురగోమనక్రమంపై చూపిన ప్రభావంఎనలేనిది.సోషలిస్టువ్యవస్థ పతనానికి నిజమైనకారణాలైన సామ్రాజ్యవాద శిబిరంతోసమతూకం లేని పోటీకి సంబంధించినఅంశాలను ముందుగా చూద్దాం.తరవాత ఒక వ్యవస్థగా పతనంఅయినప్పటికీ సోషలిజంప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైనాచూపిన ప్రభావం దాని పర్యవసానంగావచ్చిన మార్పులను చూద్దాం.మొదటగాఅక్టోబర్‌ మహా విప్లవం (పాత క్యాలండర్‌ప్రకారం) అత్యంత వెనకబడినదేశమైన రష్యాలో జరగడం.సోషలిస్టు విప్లవం నాటికి రష్యాలోపెట్టుబడిదారీ అభివృద్ధి బహు స్వల్పం. దీని వల్లనాటికి ఈ దేశంలో ప్రజాతంత్ర నిర్మాణాలుకానీ పారిశ్రామిక సంస్కృతి కానీ బలంగాలేవు. పందొమ్మిది వందల ఇరవై ఆరవసంవత్సరంలో కూడా, అంటే సోవియట్‌విప్లవం తర్వాత తొమ్మిదిసంవత్సరా అనంతరం కూడా నాటిసోవియట్‌ యూనియన్‌లో కేవలం 7.6శాతం ప్రజలు మాత్రమేవ్యవసాయేతర రంగాల్లో వున్నారు.అంటే 92.4శాతం మంది జనాభా 1926నాటికి కూడా వ్యవసాయ రంగంలోనేవున్నారు. ఇక మరొక కారణంమొదటి ప్రపంచ యుద్ధంలోనూవిప్లవం తర్వాత అంతర్‌యుద్ధంలోనూ (1918-20)సోవియట్‌ రష్యా విపరీతమైనవినాశనానికి గురైంది. ఆ దేశఆర్థికవ్యవస్థ యుద్ధం ముందరిపరిమాణంలో తొంబై శాతాన్ని కోల్పోయి పదిశాతానికి పడిపోయింది. ఇక అత్యంతవిలువైన మానవ వనరుల దృష్ట్యాచూస్తే సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ (బోల్షివిక్‌)అత్యంత చైతన్యవంతులైనతన క్యాడర్‌లో అత్యధికులనుకోల్పోయింది. దీని వల్ల శాంతియుతపరిస్థితులు నెలకొన్న తర్వాతసోవియట్‌ నాయకత్వం తన పరిపాలనాయంత్రాంగాన్ని నడుపుకోలిగేందుకుముప్పావు వంతు మేరకు విప్లవంముందరి కాలంనాటి జారిస్టుఅధికారులపైనే ఆధారపడవలసి వచ్చింది.అంటే సోషలిస్టు సంస్కృతి, నాగరికతలతోపరిచయం లేని అధికారగణంపైఆధారపడి సోవియట్‌ అధినాయకత్వంసోషలిస్టు నిర్మాణానికి పునాదులువేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.అంతేకాకుండా విప్లవానంతరం అనతికాలంలోనే సుమారు రెండు మిలియన్లమంది విద్యాధికులు దేశాన్నివిడిచివెళ్లిపోయారు. దీనంతటి వల్లఅత్యంత ప్రతికూలమైన పరిస్థితులలోసోవియట్‌ నాయకత్వం సోషలిజంనిర్మాణానికి పూనుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలో కూడా పలు రకాల ఒంటరితనాన్నిసోవియట్‌ యూనియన్‌ ఎదుర్కొంది.ఉదాహరణకు అమెరికా పందొమ్మిది వందలముప్పై మూడవ సంవత్సరంవరకు సోవియట్‌ సోషలిస్టు దేశానికిదౌత్యపరమైన గుర్తింపునేఇవ్వలేదు. పందొమ్మిది వందలతొంబైవ దశకం సోవియట్‌వ్యవస్థ పతనానికి పునాదులు దానిఆరంభంలోనే పడ్డాయని దీన్ని బట్టి మనంగుర్తించగలం.ఇన్నికడగండ్లు ఎదురైనా పందొమ్మిదివందల ముప్పయ్యవ దశకంలోనిపలు సంవత్సరాల పాటు ఆర్థిక నిర్మాణంలోసోషలిస్టు వ్యవస్థ తన చేవనుచూపింది. ఈ దశాబ్దంలో సోవియట్‌ ఆర్థికవ్యవస్థ ఒక్క జపాన్‌ ఆర్థిక వ్యవస్థనుమినహాయించి ప్రపంచంలోని మరే ఇతరఆర్థిక వ్యవస్థ కంటే అత్యంతవేగంగా పురోగమించింది. అయితే ఈపురోగమనానికి రెండవ ప్రపంచయుద్ధ కాలంలో సోవియట్‌ వ్యవస్థతన పారిశ్రామిక ఆస్తులలో పావు వంతువినాశనానికి గురి కావడాన్ని చవి చూసింది.కాగా, మరో పక్క అదే రెండవప్రపంచ యుద్ధకాలంలో సామ్రాజ్యవాదఅమెరికా ఆర్థిక వ్యవస్థ సాలీనా పది శాతంఅభివృద్ధి సాధించింది. రెండవ ప్రపంచయుద్ధం తాలూకు ప్రభావం అత్యంతఅధికంగా సోవియట్‌ యూనియన్‌పైనాఅత్యంత స్వల్పంగా అమెరికాపైనాపడటమే దీనికి ప్రధాన కారణం.ఇంతటిప్రతికూల పరిస్థితిలోనూ పందొమ్మిది వందలయాబై దశకం నుంచి ఆరంభించి ఇరవైసంవత్సరాల కాలంలో సోవియట్‌ పౌరులఆహార వినియోగం అంతుకు మునుపటిస్థాయి కంటే రెట్టింపు అయింది. అలాగే అదేకాలంలో తూర్పు యూరప్‌ సోషలిస్టుదేశాలు బ్రిటన్‌ కంటే వేగంగానే ఆర్థికఅభివృద్ధిని సాధించాయి. పాశ్చాత్యసామ్రాజ్యవాద దేశాలు నాడు సోషలిస్టుతూర్పు జర్మనీలోనే అభివృద్ధి ఎక్కువగాఉంది. వాస్తవానికి హెబర్‌ మాస్‌ అనేపెట్టుబడిదారీ తత్వవేత్త తూర్పుజర్మనీ, పశ్చిమ జర్మనీల విలీనాన్నివ్యతిరేకించాడు. తూర్పు జర్మనీలోసాధించిన మహిళా సాధికారత ఆదేశం పశ్చిమ జర్మనీలో విలీనమైతేఏమవుతుందోనని హెబర్‌ మాస్‌వంటి పెట్టుబడిదారీ తత్వవేత్తస్వయానా ఆందోళన చెందడమే దీనికికారణం. ఇంత స్థాయిలో అభివృద్ధిసాధించినప్పటికీ పందొమ్మిది వందలడెబ్బైయవ దశకం మధ్యనాటికి సోవియట్‌ యూనియన్‌ తలసరిజాతీయ ఉత్పత్తి స్పెయిన్‌ దేశంతోసమానంగాను, పశ్చిమ జర్మనీతో పోలిస్తేసగభాగంగానూ మాత్రమే ఉంది.సోవియట్‌వ్యవస్థ పతనానికి కేవలంసామ్రాజ్యవాద దేశాలతో సైనికపరమైనపోటీ మాత్రమే కారణం కాదని పైనపేర్కొన్న వివరాలు నిరూపిస్తాయి. కాగా,ఇక ప్రచ్ఛన్న యుద్ధకాలంలో నాటోదేశాలతో పోటాపోటీగా సైనిక వ్యయానికిదిగవల్సి రావడం సోవియట్‌ వ్యవస్థపతనానికి మరో కారణం. రెండవప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్‌రష్యాలోని ఇరవై నగరాలపై అణుబాంబులువేసేందుకు అమెరికా అత్యున్నతసైనికాధికారులు ఒక పథకాన్నిరూపొందించే ప్రయత్నం చేసినట్లుగాడాక్యుమెంటరీ ఆధారాలున్నాయి. అలాగేతమకు తక్కువ వినాశనంతోసోవియట్‌ యూనియన్‌ను సమూలంగాధ్వంసం చేసేందుకు అణు యుద్ధప్రణాళికలను రూపొందించినట్లుగా కూడఆధారాలున్నాయి. ఈ ప్రణాళిక సోవియట్‌పతనం జరిగే ముందు రోజు వరకుఅమెరికా పాలకుల ఆలోచనలలోఅంతర్భాగంగానే ఉంది.ఇకఈ క్రమంలో చివరగా సోవియట్‌ వ్యవస్థసామ్రాజ్యవాదులతో పోటీలో వెనకబడిపతనం కావడానికి మరిన్ని కారణాలుకూడా వున్నాయి. సామ్రాజ్యవాద దేశాలుమూడవ ప్రపంచ దేశాలను దోచుకొనితాము ఆర్థికంగా పరిపుష్టం కాగా, మరోపక్కన సోవియట్‌ యూనియన్‌ మూడవప్రపంచ దేశాలకు తన సంపదనుపంచింది. అలాగే తూర్పు యూరప్‌ సోషలిస్టుదేశాలకు కూడా విశేషంగా సబ్సిడీలనుఅందించే భారాన్ని భుజాన వేసుకొంది. ఈరకంగా చూస్తూ పోతే కర్ణుడిచావుకు కారణాలు లెక్కలేనన్నిఅన్నట్లుగా సోవియట్‌ యూనియన్‌పతనానికి కూడా ఆది నుంచి పలు కారణాలువున్నాయి. సామ్రాజ్యవాదంతో ఆర్థికపోటీలోఆది నుంచి సమాన స్థాయి లోపించడంతోమొదలుకొని ప్రపంచ యుద్ధాలు,అంతర్యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధంవల్ల సోవియట్‌ యూనియన్‌పతనమైంది.ఏదిఏమైనా సుమారు డెబ్బే సంవత్సరాలసుదీర్ఘ చరిత్ర కాలం సోవియట్‌యూనియన్‌ ప్రపంచ పెట్టుబడిదారీవ్యవస్థలో సైతం అజెండానుప్రజానుకూలంగా మార్చగలిగింది. పాశ్చాత్యదేశాలు నాడు సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరిచినాఏదా వలస పాలనా వ్యవస్థకుప్పకూలిపోయి పలు వెనకబడినదేశాలు స్వాతంత్య్రాన్నిసముపార్జించుకున్నా ఏదా స్త్రీల హక్కులవిషయంలో ప్రపంచవ్యాప్తంగాపురోగమనం చాలా కనపడినాదానంతటికీ ప్రధాన కారణం నాడురష్యాలో జరిగిన సోవియట్‌ విప్లవమే.కాబట్టి కేరళ నుంచి క్యూబా దాకాసోవియట్‌ విప్లవ ప్రతిధ్వనులు నేటికీమారుమోగుతూనే వున్నాయి.అక్షరాస్యత, ఆరోగ్యం, పౌరుల రాజకీయభాగస్వామ్యం విషయాల్లో సోవియట్‌ప్రభావం ఎనలేనిది. కాబట్టి నేడుఆస్తిత్వంలో లేకున్నా నాటి సోవియట్‌యూనియన్‌ నూతన శతాబ్దానికి కూడాప్రజల అజెండాను కానుకగా ఇచ్చే వెళ్లింది.ప్రపంచ బ్యాంకు, ఐయంయఫ్‌,డబ్ల్యుటీవోలకు వ్యతిరేకంగా అంటేస్థూలంగా ప్రపంచీకరణకువ్యతిరేకంగా నేడు జరుగుతున్నఉద్యమాలకు పరోక్షశక్తిగా నేడు ప్రజలముందు వున్నది సోవియట్‌ యూనియన్‌ఏర్పరచిన అజెండాయే. ఈ నేపథ్యంలోప్రపంచవ్యాప్తంగా భవిష్యత్‌ సోషిలిస్టువ్యవస్థ నిర్మాణానికి నాటికీ నేటికీకూడా సోవియట్‌ విప్లవమే స్ఫూర్తి.

English summary
Information about telugu Features and telugu politics along with telugu coloumns
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X