వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొయ్యగుర్రందీర్ఘకావ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

మనదేశం యింతవరకు మందుకనపెట్టలేని పెద్ద వ్యాధితోబాధపడుతోంది. దీని పేరుప్రజాస్వామ్యం. మన ఘనాభిషగ్వరులకు సైతం యిది అంతుపట్టడం లేదు. ఆచరణలోవిరాజిల్లుతున్న మతస్వామ్యమంటేఅర్థమవుతుంది. కులకులమనేకులస్వామ్యమంటేతేటతెల్లమవుతుంది. మనుషుల్నికొని అమ్మే ధనస్వామ్యమంటే,వంశపారంపర్య దొరలస్వామ్యమంటేఅవగతమవుతుంది. ఇవన్నీ దేశదేహంలో ఉండి రక్తం పీలుస్తూ ఉంటే దాన్నిప్రజాస్వామ్యమంటే అర్థం కావడంలేదు.చైనాతోనో,పాకిస్థాన్‌తోనో లేక కాశ్మీర్‌ఉగ్రవాద తండాల్తో జరిగే యుద్ధాల కంటేతీవ్రాతి తీవ్రమైన యుద్ధంఅయిదేళ్లకొక్కసారి యిక్కడజరుగుతూ వుంటుంది. దాని పేరు ఎన్నికలు.ప్రభుత్వాలు ప్రజలతో యుద్ధం చేస్తూఉంటాయి. సహజంగానేనిరాయుధులైన ప్రజలే ఓడిపోతారు.బానిసలైన ప్రజలను ప్రభుత్వాలు పాలిస్తూవుంటాయి.ఎన్నికలకార్యక్రమం ప్రశాంతంగాజరిగిందంటే ఆయా పార్టీల అభ్యర్థులమధ్య, ఏజెంట్ల మధ్య ఎవరెన్నిదొంగ ఓట్లు వేసుకోవాలో ముందస్తుఒప్పందం కుదిరిందన్నమాట.ఎన్నికల్లోదొంగ ఓటు ఎలాత వేయాలో నేర్పడమేసర్కారీ వయోజన విద్య. దీనికి అలిఖితపాఠ్య గ్రంథాలుంటాయి.దేశంలోకొనుగోలు శక్తి పెరిగింది. మొదట్లో మనిషిఅనబడే ఓటు ఖరీదు పది రూపాయలుండేది.తర్వాత వంద, వెయ్యి మొత్తంఖర్చు లక్షల్లోకి, కోట్లలోకి ఎగబాకింది. ఆవిధంగా అభ్యర్థుల కొనుగోలు శక్తిపెరిగింది. ప్రజాసేవకు ఎగబడే జలగల సంఖ్యకూడా అసంఖ్యాకంగా పెరిగింది.ఓట్లకొనుగోలు కూడా ఒక ఉపాధిగా మారింది.ప్రభుత్వం ఉపాధి కల్పిస్తామని వూరించేహామీలలో యిది కూడా ఒకటయింది. అందువల్లసామాన్యులు ఎక్కువ సార్లు ఎన్నికలొస్తేబావుండనేఆలోచనల్లోకెళ్లిపోయారు.కొన్నివస్తువుల వల్ల ఉపయోగం వుండదు.కొన్నిటికి ఎప్పుడూ వుంటుంది. చనిపోయినమహనీయుల పేర్లు ఎన్నికల్లోఉపయోగపడుతాయి. ఆ విధంగాచరిత్ర రాజకీయాలకు లొంగి నడుస్తూవుంటుంది.మామూలువిధవ కంటే తాజా ప్రజాప్రతినిధిమరణం వల్ల ఏర్పడిన విధవకుదశ మారుతుంది.ఏంచేస్తుంటావ్‌? జెండాలు కడుతుంటాను. ఏపార్టీకి? అన్ని పార్టీలకీ. నువ్వేంచేస్తుంటావ్‌? పార్టీ కరపత్రాలు,మానిఫెస్టోలు, వాల్‌పోస్టర్లు వగైరాఅచ్చేస్తుంటాను. ఏ పార్టీలకి? అన్ని పార్టీలసభలకి యిదే జనాన్ని తిప్పుతుంటాను.సిద్ధాంతాలులేకపోవడం యిలా వ్యక్తులకీ,పార్టీలకీ సుఖదాయకం. అభ్యర్థులు ఒకపార్టీ నుండి మరో పార్టీలోకి దూకడంసులభం.ఓరిక్షావోడు ఎర్రని ఎండలో చెమట్లుకారుతూ బేరం కోసం ఎదురుచూస్తూచెట్టు కింద సేద తీరడానికి ఆగాడు.అల్లంత దూరంలో కూచుని చేతి రేఖలుచూసి భవిష్యత్తు చెబుతున్నఒకాయన్ని చూసి, తన చెయ్యి కూడాచూపించి యా ఎన్నికల తర్వాత, కొత్తప్రభుత్వం ఏర్పడినాక తనబతుకు ఎంతవరకుమెరుగువుతుందోతెలుసుకోవాలనుకుని ముంగాళ్ల మీదఆయన ముందు కూచుని చెయ్యి చాచాడు.ఫీజు ముందే తీసుకుని ఆ సాముద్రికుడురిక్షావోడి చేతి వంక పరీక్షగా చూసివొచ్చే ఎన్నికల లోపే ఒక కిడ్నీఅమ్ముకుంటావని చెప్పాడు. ఆ వూళ్లోదూరప్రాంతాల నుండి వలసలొచ్చి రిక్షాలులాగే వాళ్లు చాలా మంది వున్నారు. అంటేచాలా కిడ్నీలు మార్కెట్లోవున్నాయన్నట్లే. బతకడానికి యిలాశరీరాంగాలు అమ్ముకుని సంపాదించడంకూడా ఆర్థిక నిపుణుల దృష్టిలో దేశంఅభివృద్ధి చెందడం కిందకువస్తుందేమో!గణాంకాలకీ,సర్వేలకీ, కాకులకీ సంబంధం వుంది.కాకుల్లెక్కలు పాలకులను ఆదుకుంటూవుంటాయి. ప్రభుత్వానికి కాకి భాషవచ్చు.మనప్రజాస్వామ్యం సహజ క్రియా ఫలితశిశువు కాదు. టెస్ట్‌ట్యూబ్‌ బేబీ.మాతృభూమినిమనసారా ప్రేమించే వాళ్లు ముందుగాఆక్రమించిన చీకటిని చూస్తారు.పారద్రోలడానికి శతవిధాలప్రయత్నిస్తారు.వెలుగునుచూస్తున్నామని, ప్రచారంలో చీకటినినింపేవాళ్లు నిజంగా మాతృభూమికిద్రోహం చేస్తున్నవాళ్లు.ఏదిచీకటో ఏది వెలుగో - జీవనం మూలాల్లోకెళ్లినప్పుడే మౌలికాంశాలుదృగ్గోచరమవుతాయి.నీడనివ్వనిజెండాలు ఎన్ని వున్నా ఒకటే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X