వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భిన్న మతాలు

By Staff
|
Google Oneindia TeluguNews

భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక ఆధునికకాలంలో ఒక ఆదర్శవంతమైనఆలోచన. భిన్న మతాలు, భిన్నసంస్కృతులు, భిన్న జీవన విధానాలువిడివిడిగా వున్న దేశంలో భాషాప్రాతిపదికపై రాష్ట్రాలను ఏర్పాటుచేయడం ఏకసూత్రత సాధించడానికిదగ్గర దారి. సంఘర్షణనివారించడానికి వీలు. అల్లకల్లోలంరేగకుండా ఒకరికొకరు అర్థంచేసుకోవడానికిసహకరించుకోవడానికి మార్గం. ఈదారిలో భాష ఒక అఖండ దీపం. దానివెలుగులో ప్రజల దారిద్య్రం, నిరుద్యోగం,వటి వల్ల ఉత్పన్నమయ్యే యితరసమస్యలు పరిష్కరించడానికి ఏర్పడేసౌలభ్యం.ఒకేభాష మాట్లాడే ప్రజలంతా ఒక జాతిగా ఒకరాష్ట్రంగా కుదురుకుని జీవనంసాగించడం వల్ల ఎంతో వేగంగాముందుకెళ్లడానికి,వూహించలేనంత అభివృద్ధిసాధించడానికి, ప్రపంచంలోని ఏదేశంతోనైనా సులువుగా పోటీపడడానికి వీలవుతుంది.ఈఆదర్శం ఎంతో తేజోవంతమైంది.దేశంలో మొట్టమొదటిసారితెలుగువారు దీనిని సాధించారు. కాని, ఆసాధించినది అప్పటికి ఒక అసమగ్ర చిత్రం.సాధించాలనే ఆవేశం తప్ప, సాధించినదానిలో సమగ్రతపై దృష్టి పెట్టలేదు.తరువాత, ఆంధ్రప్రదేశ్‌ఏర్పడింది. చిత్రం కొంతమెరుగుపడింది. అయినా, అదీ యింకాఅసమగ్రమే. మరొకసారి అవకాశందొరికినప్పుడు, యితర సరిహద్దురాష్ట్రాలలోకి వెళ్లిపోయిన తెలుగుప్రాంతాలన్నింటినీ తిరిగి వెనక్కితెచ్చుకుని సంపూర్ణ సమగ్ర తెలుగురాష్ట్రం చెయ్యడానికి తెలుగుప్రభుత్వాలు ప్రయత్నించకపోవడంచారిత్రాత్మక విషాదం. పరిపాలనాసౌలభ్యం,యితర రాష్ట్రీయులవత్తిళ్లు పరిగణనలోకితీసుకున్నారే తప్ప తెలుగు ప్రాంతాలన్నీతెలుగు రాష్ట్రంలో వుండి తీరాలని, అప్పుడేఅది భాషా ప్రయుక్త రాష్ట్రం అవుతుందని,అంత వరకూ యా భాషా ప్రాతిపదికకేఅర్థం లేదని నిర్మొహమాటంగానినదించలేదు. ఇది చిన్న విషయం కాదు.ఇది పూర్తిగా తెలుగుజాతి జాతీయతకుచెందిన విషయం. తెలుగు మాట్లాడే ప్రజలఅధిక సంఖ్య, తెలుగు ప్రాంతాలు ఎక్కువగావుండడం తమ మనసువిశాలమైనదని చాటుకోవడానికి పనికివచ్చేది కాదు. అంతేకాదు, విస్తీర్ణంఎక్కువ వుంటే పరిపాలించలేమనిచెప్పడం తమ చాతగాని తనంఒప్పుకున్నట్లే అవుతుంది.దీనివల్ల తేలేదేమంటే, యా భాషాప్రయుక్త రాష్ట్ర ప్రతిపాదికకుమరొక వైపు నుండి మొట్టమొదటతూట్లు పొడిచినవారు పాలకులేఅవుతారు.కొంతమంది ఉడుం పట్టుదలతో ప్రయాణంమొదలు పెడతారు. లక్ష్యంనిర్దేశించుకుని, త్యాగాలు చేసి,ప్రాణాలర్పించి ప్రయాణం కొనసాగిస్తారు.ఫలాలు అందజేస్తారు. దానిని అందుకున్నతరువాతి తరంవారు ప్రయాణంచేస్తున్నట్లే వుంటారు గాని, దీని లక్ష్యంపూర్తిగా మరిచిపోతారు. దానిని గుర్తుచేయగల గత తరం అప్పటికేకాలప్రవాహంలో కనుమరుగైపోయివుంటుంది కాబట్టి వీరు ఎవరికీ బాధ్యులుకాకుండా పోతుంది. లక్ష్యం లేనిప్రయాణం సాధారణంగా స్మశానంలోకితీసికెడుతుంది.ఇదిమన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికివర్తిస్తుంది. భాషా ప్రయుక్త రాష్ట్రంఎందుకు సాధించుకున్నామో, దానిలక్ష్యమేమిటో తరువాతి తరం పూర్తిగామరిచిపోయింది. అందువల్ల స్వార్థం,రాజకీయం అక్రమ సంపాదనకుదగ్గరదారి అయిపోయింది. ఇవాళ ప్రజలఅమాయకత్వమే పాలకుల పెట్టుబడి.ప్రతికథలో ఒక విలన్‌ వుంటాడు. ఎన్నో మలుపులతర్వాత చివర్లో హీరో విలన్ని చితకబాదిచంపేస్తాడు. ప్రేక్షకులు ఒళ్లు మరచిచప్పట్లు కొడతారు. ఎంతో ఆనందిస్తారు.సాంఘిక కథలో అయితే విలన్లో మార్పుతీసుకొస్తాడు. కథసుఖాంతమవుతుంది. మనరాజకీయ కథలో ఎంతో మందివిలన్లుంటారు. కథ సుఖాంతంకావడమనే ప్రశ్నే లేదు. విలన్లమధ్యనే అంతర్నాటకంనడుస్తూనే వుంటుంది. వాళ్లే దృశ్యంమారుస్తారు. వేషం మారుస్తారు.వాళ్ల పేర్లు మారుతూ వుంటాయి.సందర్భం,సన్నివేశం మారుతూవుంటుంది. ఈ విలన్లు చాలా ఆధునికులు,స్వార్థం కనబడకుండా మెలిగేనిపుణులు. ప్రజలకు తెలియకుండానేప్రజలను బలి యిస్తుంటారు. తమ పబ్బంగడుపుకుంటుంటారు.ఒకప్పుడుఒక ముఖ్యమంత్రిని పదవి నుండిలేపేయడానికి మతం డ్రాకులానుశవపేటిక నుండి లేపారు.నిర్దాక్షిణ్యంగా రోడ్లపైరక్తంపారేట్లు చేశారు. కర్‌ఫ్యూవరకు తీసుకొచ్చారు. అమాయకుల్నిశవాలుగా మార్చారు. తమకుకావలసింది సాధించుకున్నారు. ఇప్పుడురాజకీయులు ఆ మోటు పద్ధతిమార్చేశారు. నాజూకుతనంప్రవేశపెట్టారు. ప్రజలకుతెలియకుండానే ప్రజల మనసులోఒకరిపై ఒకరికి ద్వేషం పుట్టే విత్తనాలుచల్లుతున్నారు. అవి మొక్కలైవృక్షాలవుతాయి. పూలు కాయలైవిషఫలాలు యిస్తాయి.భాషాప్రయుక్త రాష్ట్రం, దాని ఆశయం,లక్ష్యం, ఆదర్శం, గొయ్యి తీసి అన్నింటినీనిలువునా పూడ్చి పెట్టడం జరిగింది. ప్రస్తుతంప్రత్యేక రాష్ట్ర వాదం వీస్తోంది.అవసరమైతే, తప్పనిసరైతే,అదే ధోరణిలో ఆంధ్రప్రదేశ్‌నుఒకటి కాదు, నాలుగు రాష్ట్రాలుగాచీల్చవచ్చు. కానీ, దానికి ముందు యాప్రత్యేక రాష్ట్ర వాదాన్ని ముందుకుతీసుకువచ్చిన నాయకత్వం యొక్కనేపథ్యం, నిజాయితీ గురించి అందరూ, అన్నిప్రాంతాలవారూ ఆలోచించవలసినఅవసరం లేదా! ఆ నాయకత్వం ఏప్రాంతం నుండి వచ్చింది అని కాదు, ఆనాయకత్వం నిబద్ధత, నిజాయితీఏమిటనేది ప్రశ్నించవలసిన అవసరంఉంది. దీనికి ముందు ఎన్నో పదవులుఅధిష్టించి, భోగభాగ్యాలు అనుభవించి, ఒకసారిమంత్రి పదవియివ్వకపోయేటప్పటికి, వెంటనే ప్రజలబాధలు గుర్తుకు వచ్చి,ప్రత్యేకవాదం తీసుకురావడం,ప్రజలను చీల్చడం ఎంత వరకు సబబు?ఇప్పుడేకాదు, గతంలో కూడా ఇదే విధంగాప్రజల్లో సెంటిమెంటును పెంచి పోషించిదారుణంగా మోసగించడం జరిగింది. అప్పుడుకూడా ఎవరూ ఆ నాయకత్వాన్ని ఎందుకనినిలదీయలేదు? ఎప్పుడు తమకుపదవులు రాకపోయినా ప్రజలఅవసరాలు, అమాయకత్వం ఆసరాగాఆవేశకావేశాలు రెచ్చగొట్టిప్రత్యేకవాదం తీసుకురావడంఎంత వరకు న్యాయం?ఏఉద్యమం విషయమైనా సరే, ఆఉద్యమంలో నిర్దిష్టాంశాలతో బాటు, అంతేముఖ్యంగా చూడవలసింది దానినాయకత్వానికున్న నిజాయితీ, త్యాగం.ప్రజల నెత్తి మీద కాళ్లు పెట్టి పదువులుసంపాదించడం ఎంత వరకు సబబు?ఇనవ్నీ గమనించకుండా ఉద్యమాన్నిమాత్రమే చూస్తూ, సెంటిమెంటుతోనాయకత్వాన్ని అనుసరించడం ఎంతవరకు సహేతుకం? ఒక వేళ రేపుప్రత్యేక రాష్ట్రం యితర నాయకులస్వార్థం వల్ల వచ్చినా, అది కంచె మేకకసాయిని నమ్మినట్లే అవుతుంది.నిజాయితీ లేని నాయకత్వం వల్లముందు అదృశ్యమయ్యేదివిశ్వసనీయతే. నాయకత్వ నిజాయితీలేమి చీకటి ఛాయ ప్రజలపై పడుతుంది.ద్వంద్వ ప్రమాణాలు విశ్వరూపంలోప్రవేశిస్తాయి.స్వాతంత్య్రానికిపూర్వం ఉద్యమాలు సమాజం నుండివచ్చేవి. వాటికి త్యాగధనులైననాయకులుండేవారు. వారుచదువుకున్నవారు,సంస్కారవంతులు, ఇవాళ ఊసరవెల్లిరాజకీయ నాయకుల నుండి ఉద్యమాలువస్తున్నాయి. ప్రజల అవసరాలు,అమాయకత్వం వల్ల అవిపుంజుకుంటుంటాయి. ఎప్పుడైనా కాస్త ఆగితేసెంటిమెంటు పెట్రోలు రాజకీయ నాయకులుసరఫరా చేస్తూ వుంటారు. ఇటువంటిస్వార్థ రాజకీయాల కార్యక్రమాల వల్లసమస్యలు తీరకపోగా అంతిమంగామరిన్ని బాధలు పడేది ప్రజలే.స్వాతంత్య్రానంతరంపదవీ రాజకీయ నాయకుల ద్వారావచ్చిన బినామీ ఉద్యమాలు చాల వరకుబ్లాక్‌మెయిలింగ్‌ ఉద్యమాలే.తెలుగుజాతిఇవాళ తిరిగి మనుగడలో పడింది. ఆదృష్ట్యా బలమైన ప్రజోద్యమాలుసమాజం నుండి రావలసిన అవసరంవుంది. మేధావులు, ఆలోచనాపరులు,రచయితలు, ప్రజల పక్షాన నిలిచేవారంతా దీనికి పూనుకోవాలి.ఇప్పుడిప్పుడేఆవిర్భవిస్తున్న తెలుగుజాతి ఐక్యపోరాట వేదిక ఆ కోవకు చెందినదిగానేను భావిస్తున్నాను. తెలుగుజాతి భాషారాష్ట్ర ప్రాతిపదికగా గలలక్ష్యాలన్నింటితో సమైక్యఆంధ్రప్రదేశ్‌ కొరకు మాత్రమేకాక, యితర సరిహద్దు రాష్ట్రాలలోమాతృభాషకు దూరమైబతుకుతున్న తెలుగు ప్రాంతాలనుకూడా సాధించి సమగ్ర ఆంధ్రప్రదేశ్‌కొరకు కృషి చేసే దిశగా యా వేదికముందుకు వెడుతుందనిఆశిస్తున్నాను.ఈవిషయమై రాష్ట్ర ప్రభుత్వంతోను,గవర్నరుతోను, రాష్ట్రపతితోను,కేంద్ర ప్రభుత్వంతోను, ఒక వేళరేపు ఏర్పడితే రెండవ రాష్ట్రాలపునర్‌ వ్యవస్థీకరణ సంఘందృష్టికి తీసుకెళ్లడం, అలాగే దీనికిసంబంధించిన ప్రతి ఒక్కరితోను, అన్నిప్రాంతాల మేధావులు, ఆలోచనాపరులందరితో చర్చలుజరుపవలసిందిగా సూచిస్తున్నాను.తెలుగుప్రజల జీవితాల వికాసం కొరకుమహాంధ్రప్రదేశ్‌ అవతరణకైపిలుపునివ్వవలసిందిగా వేదికనుకోరుతున్నాను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X