వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణవిషయంలో తాను తీవ్రంగా ఆలోచనచేస్తున్నానని, ఈ సమస్య పరిష్కారానికికృషి చేస్తానని ఆమె చెప్పారు. నిజానికి,ఆమె నుంచి తెలంగాణ విషయంలో ఇంతఅస్పష్టమైన సమాధానం అవసరంలేదు. ఇంత అస్పష్టమైన ప్రకటనచేసే బదులు ఆమె ప్రకటన చేయకున్నాతెలంగాణకు పోయేదేమీ లేదు. కానీతెలంగాణ ప్రస్తావన తేకపోతేకాంగ్రెస్‌కు నష్టం. అందుకే ఆమె ఆరకంగా మొక్కుబడి తీర్చుకుంది.            బంగారుమాట-కె. నిశాంత్‌భారతీయజనతా పార్టీ (బిజెపి) మాజీ అధ్యక్షుడుబంగారు లక్ష్మణ్‌కు జ్ఞానోదయమైందా?బిజెపి నాయకత్వం అసలు రంగేమిటోతెలిసిందా? పల్లకీని మోసేదెవరో,పల్లకీలో ఊరేగేదెవరో తెలిసిపోయిందా?ఆయన మాటలు చూస్తే ఆయనకుజ్ఞానోదయమైనట్లే కనిపిస్తోంది.జ్ఞానోదయమైనంత మాత్రానఅందుకు అనుగుణంగా వ్యవహరించాలనిఏమీ లేదు కదా అని ఆయన భావిస్తే ఏమీచేయలేం.

By Staff
|
Google Oneindia TeluguNews

ఆరునెలల కాలంలోనే సిపిఐ (మావోయిస్టు) కాస్తాసిపిఐ (ఫ్యాక్షనిస్టు)గా రూపాంతరంచెందిందా అనే అనుమానం కలుగుతోంది.ఫిబ్రవరి 28 సోమవారం అర్థరాత్రికర్నూలు జిల్లా పాములపాడు మండలంవేంపెంట గ్రామానికి చెందిన ఎనిమిది మందిరైతులను/ గ్రామస్థులను అతికిరాతకంగా, సభ్య సమాజంఅసహ్యించుకనే రీతిలో మావోయిస్టులుచంపడంతో ఈ అనుమానం మరింతబలపడుతోంది. వేంపెంటలో జరిగినక్రూరమైన ఆ ఊచకోత సరైనదే అనిమావోయిస్టులు భావిస్తే తమ పార్టీపేరును మార్చుకుంటే బాగుంటుంది. సిపిఐ(మావోయిస్టు)గా గాక సిపిఐ (ఫ్యాక్షనిస్టు)గాపేరు మార్చుకుంటే సబబుగా ఉంటుంది.ఎందుకంటేఆదర్శవంతమైన సిద్ధాంతాలకుతిలోదకాలిచ్చి, ఫ్యాక్షనిస్టుల మాదిరి ముఠాతగవులను, గ్రామ కక్షలను, కులపంచాయతీలను, భార్యాభర్తల మధ్యగల తగువులను పట్టించుకొనిహింసాకాండపై, తుపాకిపై,మందుపాతరలపై పూర్తిగాఆధారపడినప్పుడుఆదర్శవంతమైన, అభ్యుదయభావాలు గల వారమని ప్రపంచానికి చాటడంవారిని మోసపుచ్చడమే అవుతుంది.ఎవరినైనా ఎంత కాలంమభ్యపుచ్చుతారు? ఎంత కాలంమసిపూసి మారేడు కాయ చేసి తమపబ్బం గడుపుకుంటారు? ఫ్యాక్షన్‌మనోభావాలు గలవారెలాఅభ్యుదయవాదులవుతారు? విప్లవఆలోచనలు ఎలా చేస్తారు? పగ -ప్రతీకారమే ప్రధానమని భావించేవారుఎలా అశేష ప్రజలను అర్థం చేసుకొని వారిసమస్యలను పరిష్కారం చేస్తారు? ఏమాత్రం సహనం, సంయమనంలేకుండా గొడ్డళ్లకు, వేటకొడవళ్లకుపని కల్పిస్తే సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న వారెలా అవుతారు?గ్రామసభల్లోతలదూర్చి గ్రామ రాజకీయాలనుప్రభావితం చేయడానికి భయోత్పాతంసృష్టించి తమ చెప్పుచేతల్లోనే అన్నిజరగాలని హుకుం జారీ చేస్తూ అలా జరగనిపక్షంలో ఇన్‌ఫార్మర్లు అనే నెపంతోఅసంఖ్యాకమైన అమాయకులను, బడుగుబలహీన వర్గాలవారినిహతమార్చుకుంటే పోతేఫ్యాక్షనిస్టులకు, మావోయిస్టులకు ఏవిధంగా తేడా, వ్యత్యాసంకనిపిస్తుంది? పరిటాల రవీంద్ర చేసినలేదా ఆయనలాంటి ఫ్యాక్షనిస్టులు చేసినపనులన్నీ మావోయిస్టులు చేశారు - చేస్తూఉన్నారు. వేంపెంటలో భగ్గుమన్నదికాబట్టి ప్రపంచానికి అంతటికీ తెలిసింది.కాని చిన్న చిన్న సంఘటనలు బయటిప్రపంచానికి తెలియనివే ఎక్కువ. మరి ఈనేపథ్యంలో మావోయిస్టులు సిద్ధాంతప్రాతిపదికన తామొక రాజకీయ పార్టీ అని,దాదాపు అన్ని రాష్ట్రాల్లో తమకార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టిమాకు జాతీయ పార్టీ హోదా, గౌరవం,మన్ననలు కల్పించాలని చాటుకోవడం ఏంబాగుంటుంది?వందకోట్లమంది భారతీయులను విముకిత చేసివారి ముందు స్వర్గాన్ని దింపుతామని,శ్రామికుల పాలిట భూతల స్వర్గాన్నినిర్మిస్తామని చెప్పేవారు అదే శ్రామికులన,రైతులను, కూలీలను, పేదలను పొట్టనపెట్టుకోవడం అంటే వారిని (పేద ప్రజలను)మెసపుచ్చడమేగా? దగా చేయడమేకదా!కేవలంఆధిపత్యం, అధికారం, తుపాకి అందించేమత్తు, పెత్తనం, జులుం, బెదిరింపులు,అక్రమ వసూళ్లు, భయభ్రాంతులనుచసి (టెర్రజ్‌ చేసి) పనులుజరుపుకోవాలన్న దానిపైనే అధిక శ్రద్ధ,ఆసక్తి వుంటే ప్రేమ మార్చుకంటేనేబాగుంటుంది.మనంఎలా ఉంటే ఫొటో అలా వస్తుందని అందరికీతెలుసు. మనం కురూపిగా ఉన్నావిశ్వసుందరిలా ఫోటోవస్తుందనుకోవడం వివేకంఅనిపించుకోదు. అలాగే మనం చేసేపనులే మనం ఏమిటో తెలియజేస్తాయి. ఇదిఅత్యంత సాధారణమైన అంశం.ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తూ మమ్మల్నిమావోయిస్టులగా చూడాలని, గుర్తించాలనిదబాయించడం సబబు కాదు.మావోయిస్టులుగా వ్యవహరిస్తేమావోయిస్టులుగానే ప్రజల మనసుల్లోచిత్రితమవుతారు. వేంపెంటలో చేసినవికృతచర్యకు ప్రజల మనుషుల్లోవికృతరూపంతోనే దర్శనమిస్తారు.గత కొంతకాలంగా విప్లవానికి పుట్టినవికృత శిశువుల్లా (సిపియంనాయకుడు తమ్మినేని వీరభద్రం మాటఇది) ప్రవరిస్తూ తమ రూపం, ఆకారం,అందంగా ప్రజల మనసు కెమెరాలుచిత్రించాలని, ఆ ఫొటోలే రావాలని ఆశించడంఅమాయకత్వం అవుతుంది.సమాజంలోద్వంద్వ స్వభావం ఉంది. దాన్నిపరాకాష్టకు తీసుకుపోపయిమావోయిస్టులు ప్రవర్తిస్తూ తామెంతోపారదర్శకంగా ఉన్నామని, దాపరికంలేకుండా సిద్ధాంతాలకు అనుగుణంగానేఉద్యమిస్తున్నామని, అత్యున్నతత్యాగమైన ప్రాణత్యాగాలకుసిద్ధమయ్యామని జాలి కబుర్లుచెప్పడం కాదు, ఆచరణలో కనిపిస్తేనేఎవరైనా విశ్వసిస్తారు. చెప్పేదొకటి,చేసేది మరకొటిగా ఉంటే ఎలానమ్ముతారు?మావోయిస్టులు/నక్సలైట్లు ప్రాణత్యాగాలకు సిద్ధపడిఅడవుల్లో పడరాని పాట్లు పడుతూ ప్రజాసంక్షేమం కోసం పాడుతున్నారని పాటలు,పద్యాలు రాసి ప్రచారం చేసుకునేవారు ఆప్రజా సంక్షేమమేమిటో వేంపెంటలోబహిర్గతమైందిగా! పీనుగుల పెంటగామార్చారు. పితూరీలను నమ్మి, తమఆధిపత్యమే చెల్లుబాటు కావాలనే దుగ్ధతోరావణ కాష్టాన్ని మండిస్తున్నారు.అసలుప్రాణత్యాగాలకు సిద్ధపడి అడవుల్లోకివెళ్లి ఇలా అర్ధరాత్రిపూట రైతుల ప్రాణాలనుపొట్టన పెట్టుకోమని ప్రజలు చెప్పారా? ప్రాణాలనుతమ కోసం త్యాగం చేయమని పట్టుపట్టారా? ఆ విధంగా విజ్ఞప్తులు ఏవైనాచేశారా? లేదు. లేనప్పుడు తమత్యాగాలు, అమరత్వంపై ఆకాశందద్ధరిల్లేలా ఆ ప్రచారం దేనికి? నిజంగాప్రజల కోసమే మరణిస్తే ప్రజలే తమగుండెల్లో దాచుకుంటారు. ఆ త్యాగాలను,అమరత్వాన్ని ఆసరా చేసుకుని దాన్నేలైసెన్సుగా భావించి ప్రజలను ఊచకోతకోస్తారా? ఇదెక్కడి తర్కం?స్వచ్ఛందంగా అడవుల్లోకి వెళ్లి,స్వచ్ఛందంగా ప్రాణత్యాగాలకుసిద్ధపడి ఇప్పుడు తమవారి ఆచూకీశత్రువులకు అందిస్తున్నారనో,తమకు సహకరించడం లేదనో,తమనే ఎదిరిస్తారా అనో తాము విధించినసుంకం చెల్లించలేదనో వారిని (ప్రజలను)క్రూరంగా చంపుతూ పోతే అర్థంఏముంటుంది? ప్రజలు చెప్పినట్టే తాముచేస్తున్నట్టు ఫోజు పెడితే ఎలా?ప్రజలునక్సలైట్లను పెంచి పోషిస్తున్నందుకు,తిండి పెడుతున్నందుకు, కోట్లాదిరూపాయలు సమకూరుస్తున్నందకు,తమ గొంతెమ్మ కోర్కెలుతీరుస్తున్నందుకు, తాము(నక్సలైట్లు) చెప్పినట్లల్లాఆడుతున్నందుకు, అమాయకంగాదశాబ్దాల పాటు హింస రచనను,విధ్వంసకాండను భరిస్తున్నందుకువారికి ఎన్నటికీ రుణపడి ఉండాలి.కృతజ్ఞతగా ఉండాలి. ఒదిగిపోయి ప్రవర్తించాలి.అంతేగాని పడగ విప్పి బుసలు కొడుతూ,ప్రతీకారంతో రగిలిపోతూ నానాదుర్భాషలాడుతూ, నోట్లో గుడ్డలు కుక్కిగొడ్డళ్లతో తలపండు తీసే అధికారంమీకెవరిచ్చారు? ప్రజల పేరుతో దశాబ్దాలుగాబతుకుతున్న మీరు సంపద సృష్టిలోభాగం పంచుకోకుండా సంపదసృష్టికర్తలపై ఆయుధాలతో స్వైరవిహారం చేస్తే ఎవరు క్షమిస్తారు? ఇదిక్షమించేటువంటి సంఘటనేనా?వెనుకబడిన వర్గాలవారిని,దళితులను భూస్వాములుగా,పెత్తందార్లుగా, అగ్రవర్ణాలుగాముద్రలు వేసి వారిని ఖతం చేసి, వారికుటుంబాలను వీధిలోకి తెచ్చి విప్లవంరుచిని ప్రజలకు చూపిస్తున్నారా?ఈనాటిరాజకీయాలు తుచ్ఛమైనవి. అవి బూర్జువారాజకీయాలు కావచ్చు, విప్లవ రాజకీయాలూకావచ్చు. రాజకీయం రాజకీయమే. మరిఅలాంటి తుచ్ఛమైన రాజకీయం కోసంకన్న తల్లిదండ్రుల్లాంటి వారిని,అన్నదమ్ములలాంటివారిని,ఆప్తులైనటువంటివారిని కడ తేర్చడంఏ రకంగా భావ్యం?ఆతుచ్ఛమైన రాజకీయాల ఊబిలోకిఇరుక్కుపోకుండా తెలంగాణ ప్రాంతంలో 1972నుంచి 1982 వరకు జరిపినకార్యక్రమాలను నిర్వహిస్తే వాటినిఉన్నత స్థాయికి తీసుకుపోయి ప్రజలజీవన ప్రమాణాలను మెరుగుపరిస్తే, వారిఆర్థిక స్థితిగతులను మెరుగుపరిస్తే,వారి మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరిస్తే, వారి జ్ఞానాన్ని ఉన్నతీకరిస్తే, ఆధునికసమాజంలో వారూ తలెత్తుకొని తిరిగేలాచేస్తే అర్థం ఉంది కాని, ఉన్న సౌకర్యాలను,మౌలిక సదుపాయాలనుమందుపాతరలతో పేల్చేస్తూ అడ్డంవచ్చినవారిని కాల్చేస్తూ కాల యముడినితలపిస్తే ఎలా?1967లోనక్సల్‌బరిలో గాని, 1969లో శ్రీకాకుళంలో గాని,1972-73లో తెలంగాణలో గాని నక్సలైట్లకార్యక్రమాలు నేటి మావోయిస్టుల మాదిరికార్యక్రమాలు కావే. మరి వారెందుకుఈ దుందుడుకు చర్యలకు పాల్పడిమిత్రులైన సిపియం నాయకుల చేతకూడా ఈసడింపులకుగురువుతున్నారు?ఇప్పటికైనామావోయిస్టులు నికార్సయినమానవతామూర్తులుగా ఉంటే వారిపాత్రను వారు ఈ చారిత్రక సమయంలోనిర్వహించినవారవుతారు. లేకపోతేవేంపెంట మాదిరి సంఘటనలనేపునరావృతం చేస్తే వాళ్లుఫ్యాక్షనిస్టులుగానే చరిత్రలో మిగిలిపోవడంఖాయం. తాము ఏ విధంగా గుర్తింపుపొందాలనుకుంటున్నారో అది మావోయిస్టులేనిర్ణయించుకోవలసి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X