వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌.కె.కొండెపాటి జర్మనీలో ఉంటున్నారు. ఆయనరీసెర్చ్‌ స్కాలర్‌. రాస్ట్రంలోని సామాజిక,రాజకీయ పరిణామాలపై ఆయనఎప్పటికప్పుడుప్రతిస్పందిస్తుంటారు.

By Staff
|
Google Oneindia TeluguNews

గతనెల ఇరవై నాలుగు పట్టపగలుమిట్టమధ్యాహ్నంఅపంతపురం నడిబొడ్డు. జనసమ్మర్ధం. సందోహంగా తిరిగే చోటు.వందలాది పార్టీ నేతల సమక్షం.తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీ మంత్రిపరిటాల రవీంద్రపై గుళ్ల వర్షం.దారుణంగా హత్య చేశారు.హీనాతిహీనమైన,ఘోరాతి ఘోరమైన, నీచాతా నీచమైనసంఘటన. నాగరికతతలదించుకోవలసిన క్షణం. కోట్ల గళాలుఖండించవలసిన విషయం.నిస్సందేహంగా అంతా నిరసనతెలుపవలసిన సంగతి.ప్రజలుఓటు ఆయుధంతో ప్రభుత్వాన్ని మార్చినాకక్షల కార్పణ్యాల క్రోధాల ముఠాలలోపగలు సెగలు చల్లారలేదు.దహిస్తున్న ఆవేశకావేశాలవాతావరణంలో మార్పు రాలేదు. ఈకిరాతక కిరాయి తండాలభయానక క్రూర చర్యలకొనసాగింపులకు ముగింపు లేదా! ఇదేమీపాలకులకు పట్టదా?మొదట్లోఒకానొక ప్రాంతంలో స్వార్థప్రయోజనాలకైకలుపు మొక్క గంజాయి వనంగావ్యాపించి,న వ్యాపార వర్గాలై, రెండుముఠాలై కిందివారిని కలుపుకుంటూ,కిరాయి గూండాల సైన్యంతోధనికశక్తులై, రాజకీయ అధికారంకోసం రెండు పార్టీలై, క్రమంగా ఒకసారిఒకటి, మరొకసారి మరొకరు రెండుప్రభుత్వాలై ఎదుటివారి మనుగడేప్రశ్నార్థకం చేయాలనే అసహనంతోవిలువల దహనంతో సామాన్యులజీవనాన్నే సమిధ చేసుకుంటూ పోతుంటే,దీనికి అంతం లేదా? సౌహార్ద్ర స్వేచ్ఛాస్వాతంత్య్రాల పేర మనం సాధించిందిఇదేనా? సైన్సు సాధించి యిచ్చిన సాంకేతికవిప్లవం ద్వారా సమకూర్చుకున్నజ్ఞానవిజ్ఞాన వెలుగుల కింద యింకా ఆటవికఆలోచనల్తో పన్నుకి పన్ను, కన్నుకికన్ను అంటూ పొడుచుకుంటూ, రక్తానికిరక్తం చిందించుకుంటూ మానవత్వాన్నేబలి యిస్తూ శవాల దారిలో నడవకతప్పదా? దీనికి ప్రత్నామ్నాం లేదా?మనచేతిలో గన్‌ వుందా, లేక
గన్‌ చేతిలో మనం వున్నామా? ఇదేనిర్ణయిస్తుంది దిశనీ, లక్ష్యాన్నీ. ఈహత్యాకాండ మరొక అతి ముఖ్యమైనవిషయాన్ని - ఆధునిక కాలంలో, అత్యంతఆధునిక విలువలతో జీవిస్తున్నామనుకొనేమనముందుకుతీసుకువస్తున్నది.మొదట్లోచెప్పినట్లు యా శోచనీయమైన దారుణాన్నితప్పకుండా అంతా ముక్తకంఠంతోఖండించవలసి వుంది. నిస్సందేహంగానిరసన, అసమ్మతి తెలుపవలసి వుంది.అందుకు ప్రజలంతా తప్పకుండాముందుకు వస్తారు. కాని, దానికికొందరు ఎంచుకొన్న పద్ధతేమిటి? ప్రజలఆస్తుల విధ్వంసం. వందల సంఖ్యలో ఆర్టీసిబస్సులు ఆహుతైనై. మంటల్లోమాడిమసైనై. దాడులకు బలైనై.ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు.అష్టకష్టాలకు లోనయ్యారు. ఈహత్యాకాండతో సంబంధం లేనిప్రాంతాల్లో, ప్రజల్లో, అల్లకల్లోలంసృష్టించడం జరిగింది. వేల కోట్లలో నష్టంజరిగింది. ఇది ప్రజల సొమ్ము. మరీ ముఖ్యంగాసామాన్య ప్రజల సొమ్ము. ప్రభుత్వ ఆస్తులుఅంటే ఆకాశం నుండో, మదించినధనికవర్గాల జేబుల నుండో వచ్చినవికాదు. సామాన్య ప్రజలు చెల్లించిన సొమ్ములనుండి సమకూర్చబడినవి.ఏదయినాఓ దుర్ఘటనపై నిరసనతెలపాలనుకుంటే కొందరికి వెంటనేగుర్తుకొచ్చేది ప్రభుత్వ ఆస్తుల్నితగలబెట్టడం. అంటే ఆర్టీసి బస్సులు, రైళ్లబోగీలు, పట్టాలు, టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజీలు,ప్రభుత్వ కార్యాలయాలుమొదలైనవి. ప్రభుత్వ ఆస్తులన్నీప్రజల ఆస్తులే. ఈ విషయం మరచిబాధ్యతారాహిత్యంతో వాటిపై దాడులుచేయడం, ధ్వంసం చేయడం ప్రజలఆస్తులపై చెయ్యడమే. ఈ దాడులకు,విధ్వంసానికి ప్రభుత్వాలు కన్నీళ్లుకార్చవు. ప్రజలపై కసిగా, నిర్దయగాపన్నులు పెంచి ఏడిపిస్తాయి.భిన్నమతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు,సంస్కృతులు ఎన్నో వున్నమనదేశంలో ఒకప్పటి సామరస్యభావన పోయి, అనేక చారిత్రక కారణాలవల్ల అహింస స్థానంలో అసహనంప్రవేశించి ప్రతి చిన్న అంశం ఘర్షణకుదారి తీస్తోంది. అయితే సనాతన,సంప్రదాయ సమాజ నిర్మాణంలోని విభిన్నమతం, కులం వంటి విభాగాలన్నీగతంలో సమానత్వంతో సంపూర్తిగాసామరస్యపూర్వకంగా కలిసిమెలిసివెల్లివిరిసేవని కాదు. కాని, యా దేశాన్నివాటికి అతీతమైన స్థాయిలోకి తీసికెళ్లి ఏకత సాధించడానికి సంస్కరణలవంటి ఉద్యమ ఆలోచనా స్రవంతులద్వారా నాటి నాయకులుప్రయత్నించేవారు. కాని, నేటి పాలకుల్లోసమర్ధ నిర్వహణ శక్తిలేకపోవడం వల్ల ఆ ఆదర్శ ఏకతదృష్టి అదృశ్యమైంది. వర్గాలు, కులాలమధ్యగల అసమానత మరింతభయంకరంగా పెరిగింది. మానవసంబంధాలు బీటలు వారాయి. ఇది మన ఎన్నికలక్రీడలతోనే ప్రారంభమైంది.క్రమంగా అది ఆయా ధనికస్వామ్యవర్గాల స్వార్థ ప్రయోజనాలకు ఆలవాలమైంది.సమాజంలో పెంచిపోషిస్తున్న అసమానతలవిషంతో మొత్తం వాతావరణంకాలుష్యమై మనిషిని మరో మనిషినికాటువేస్తూ పట్టపగలు తలలు నరుక్కునేస్థాయికి వెళ్లింది. దాని ప్రభావం దాడులరూపంలో ప్రజల ఆస్తులపై పడుతున్నది.దీనివల్ల తిరిగి ధరలు పెరుగుతాయి.సామాన్యులు భారం మొయ్యలేకనిరాశనిస్పృహల్లోకి తొక్కివేయబడుతారు. ఈ సందర్భంలో అన్నివిధాలా మన సమాజ భారాన్నిసామాన్యులనేది మరవకూడదు.ప్రపంచంలోనేమన ప్రజాస్వామ్యం చాలా గొప్పదని మననాయకులు, సర్కారు భజనపరులుప్రచారం చేస్తారు. సొంత భుజాలుచరుచుకుంటారు. కానీ, మనది నేతిబీరకాయ ప్రజాస్వామ్యం. అంతేగాకమన ప్రజాస్వామ్యం చాలా ఖరీదైనది. ప్రజలుమొయ్యలేనంత ఖరీదైనది. ప్రజా సేవచేస్తామంటూ పోటీ పడుతూయోగ్యతాయోగ్యాలతో సంబంధంలేకుండా ధనబలం, కండబలం, కులబలంవున్నవాళ్లంతా ఎన్నికల్లో నిలబడతారు.ఇవాళ రాజకీయం లాభార్జనలో అతి పెద్దవ్యాపారం. ఇక్కడ మనుషులను ఓట్లుగాచూస్తారు. ఓటర్లను కొనుగోలు చేసేప్రక్రియలో నల్లధనం ప్రవహిస్తుంది.ఈ నల్లధన ప్రభావం పరోక్షంగాఆర్థికంగా ఆర్థికంగా యితరత్రా అన్నివిధాలా ప్రజల మీద, పరిపాలన మీద,మార్కెట్‌ మీద, ఉద్యోగవర్గాల మీదపడుతుంది. వటవృక్షమైన అవినీతి బీజాలుయిక్కడ వున్నాయి. ఎన్నికల్లో ప్రచారంపేరుతో ఒకరిపై మరొకరు విషంచిమ్ముకుంటారు. నాయకులు ప్రజలను మంచివైపు మారకుండా చూస్తారు. దీనివల్లసమాజం మతం, కులం, వర్గం చట్రాల్లోచీలిపోవడమే గాక రాజకీయంగా పార్టీలుగాచీలిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలతర్వాత అభ్యర్థుల మధ్యకావేషాలు, పోటాపోటీలు రాజుకునిఅసహనంతో అవతలివారిని నామరూపాలులేకుండా చెయ్యడానికి కిరాయి హత్యలవరకు వెడతారు. ఈహత్యావాతావరణం సమాజాన్నిఛిన్నాభిన్నం చేస్తున్నది.ఏకారణం వల్ల ఎవరు హత్య చేసినాఅది హత్యే. ఒక హత్య అంతటితఆగిపోదు. బాధితులు అవతలివారిని హత్యచేయడానికి అవకాశం కోసం పొంచివుంటారు. తిరిగి ఇవతలివారు కూడా దాన్నిఅడ్డుకోవడానికి మరికొన్ని హత్యలుచేస్తారు. ఈ విధంగా యిదితరతరాలుగా కొనసాగుతుంది.కులాల, కుటుంబాల సంప్రదాయంగామారుతుంది. ఈ మార్గంలో కొందరికిహత్యలు చెయ్యడం జీవనోపాధిగామారిపోయింది.హత్యలురాజకీయాల్ని, సమాజాన్ని, జీవన విధానాన్ని,ఆర్థిక, నైతిక, మానసిక మొదలైనఅన్ని కోణాల్నీ చుట్టుముడతాయి. పరిస్థితులుమనుషుల్ని ఎదగనివ్వకుండాలొంగదీసుకుంటాయి. దీనివల్ల ఆయా దేశాలు,జాతులు అభివృద్ధిలో పురోగమించడం పోయి,క్రమంగా కుంగి కృశించిపోతాయి. ఈమొత్తానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటివరకు నడిచిన చరిత్రఒక ప్రబలమైన సాక్ష్యం. ఇవాళ మనంరోబోట్స్‌ మాత్రమే, అదీ తుప్పుపడుతున్న రోబోట్స్‌ మాత్రమే,సజీవమైన వ్యక్తులం కాదు.పరిటాలరవీంద్ర హత్యకు బాధ్యులైనవారందరిపై ప్రత్యేక కోర్టు ద్వారాకఠిన శిక్షలు అతి శీఘ్రంగా పడేంందుకుకృతనిశ్చయంతో ప్రభుత్వం కృషిచెయ్యాలి. అంతేగాని, ఏళ్లూ పూళ్లూగడుపుతూ దీనిని కూడా మరొక భోఫార్సువంటి ఫార్సులా చెయ్యకూడదు.అలాగే,తర్వాత జరిగిన దాడులు, విధ్వంసానికికారుకులపై క్షణికావేశం, ఉద్రేకఉద్విగ్న ప్రతిస్పందనగా భావించి అదేకోర్టులో కేసులు నడపాలి తప్ప తిరిగిక్రూరంగా వారిపై చర్య తీసుకోకూడదు.లేకపోతే ఆ వర్గాల్లో ప్రభుత్వం మీద,దీనికి చెందిన పార్టీల మీద, వారి సహకారులమీద కసి పెరుగుతుంది. ఆ కసి పెరిగి పెరిగితిరిగి మరికొందరిని బలి తీసుకుంటుంది. ఇప్పటికేసమాజమంతా అల్లుకున్న అలజడి,అభద్రత దీని వల్ల జట్టు విరబోసుకుంటుంది.సమాజ న్యాయం, సమసమాజ నిర్మాణంవంటి ఆదర్శాలు అదృశ్యమై వాటిస్థానంలో కసికసి సమాజం మేల్కొంటుంది.సీసా బిరడా తీస్తే బయటకొచ్చే ఆ భూతాన్నిఎవరూ తిరిగి సీసాలో బంధించలేరు.ఇవాళహత్యలు - ప్రజల ఆస్తుల ధ్వంసం అనేఅంశం కూడా తక్షణ చర్చగా మనముందున్నది.ప్రస్తుతం- నక్సల్స్‌ - ప్రభుత్వం మద్యశాంతి కోసం రెండ దఫా సమావేశంఏర్పాటుకై ప్రయత్నాలు జరుగుతున్నాయికాబట్టి దీనినొక అవకాశంగా తీసుకొని వారిముందు వున్న ఎజెండాలో పరిష్కారానికై,యా అంశాన్ని కూడా చేర్చవలసి ఉంటుంది.పార్లమెంటరీపార్టీలు గానీ, పార్లమెంటరీయేతర పార్టీలుగానీ, ఆయా రంగాలకు చెందినమేధావులు గానీ బాహాటంగా జరుగుతున్నహత్యలు, వాటిపై జరిగే ప్రజల (ప్రభుత్వ)ఆస్తుల విధ్వంసం కొనసాగకుండా,ప్రత్యామ్నాయ పరిష్కార చర్యలకైతీవ్రంగా ఆలోచించవలసి వుంది.ఇదిమొత్తం సమాజాన్ని చుట్టుముడుతున్నఖాండవ దహనం. ప్రతి ఒక్కరూఅతీతంగా ఆలోచించవలసిన విషయం. ప్రతిప్రశ్నలోనూ సమాధానం దాగి వుంటుంది. ఇదిదృష్టిలో పెట్టుకుని సామాన్యుల జీవితాలుఆర్థికంగాను, యితరత్రా ఎటువంటివత్తిళ్లకు బలి కానివ్వని, ఆత్మహత్యలవైపు చూడనివ్వని, మార్గం లేకకిరాయి హత్యదారులుగా మారనివ్వనిప్రత్యామ్నాయాల గురించి అందరూఆలోచించవలసి వుంది.సామాన్యున్నిరక్షిస్తే సమాజంరక్షింపడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X