వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌.కె.కొండెపాటి జర్మనీలో ఉంటున్నారు. ఆయనరీసెర్చ్‌ స్కాలర్‌. రాస్ట్రంలోని సామాజిక,రాజకీయ పరిణామాలపై ఆయనఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తుంటారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రత్యేకతెలంగాణ అంశంపై తిరిగితర్జనభర్జనలు జరుగుతున్నాయి.రాజకీయ చర్చల వేడి వేసవి వేడితోపోటీ పడుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితినాయకుడు, కేంద్ర మంత్రి నరేంద్రఇదిగో తెలంగాణా, అదిగో తెలంగాణా అంటున్నారనిఅటు పిసిసి అధ్యక్షుడు కె.కేశవరావు, ఇటు బిజెపి నాయకులుఎద్దేవా చేయడం విచిత్రంగా వుంది.తెలంగాణారాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఇదిగోతెలంగాణా, అదిగో తెలంగాణా అనకుంటేమరెవరంటారు? అలా అంటాం, తెలంగాణారాష్ట్ర సాధించేవరకు నిద్రపోమనివారు పదేపదే చెబుతూనే ఉన్నారు. అదితమ వ్యూహంలో భాగమని,ఎత్తుగడల్లో ఒక అంశమని చెబుతూనేవున్నారు. చెబుతున్నట్లుగానే తెరాసనాయకులు చేస్తున్నారు. అంతేగాని వారుహిపోక్రాట్ల మాదిరి ప్రవర్తించడం లేదుకదా? రాజకీయాల్లో హిపోక్రసీ ఎక్కువ. కానితెరాస నాయకులు ఆ హిపోక్రసీ జోలికిపోకుండా మొదటి నుంచి ఒకే మాటతోముందుకు పోతున్నారు. బంతినినిలకడగా ఉంచకుండా దాన్ని కదిలిస్తూనేవున్నారు. అందుకు వారుఅభినందనీయులు. అభినందించకపోగాఎద్దేవా చేయడం ఎంత వరకుసమంజసం?తెలంగాణారాష్ట్రం ఏర్పాటే ఏకైక లక్ష్యంగా,అజెండాగా ఆవిర్భవించిన తెరాస ప్రతిదినంతెలంగాణా గురించి మాట్లాడినా తప్పుపట్టనక్కర్లేదు. అలా మాట్లాడకపోతేనేతప్పు పట్టాలి. అలాంటిది తెరాస నాయకులుఇదిగో తెలంగాణా, అదిగో తెలంగాణా అంటున్నారనిఅభ్యంతరాలు చెప్పడంలో ఔచిత్యం ఏమాత్రం లేదు.తెలంగాణారాష్ట్రం ఏర్పాటు ఒక పూటలోనో, ఒక రోజులోనోజరిగేది కాదనే విషయం మెడపైతలకాయ ఉన్నవారందరికీతెలిసిందే. అధికార పక్షం సంకీర్ణప్రభుత్వాన్ని నడుపుతున్నందునఅనేక ఒత్తిళ్లు, అనేక బెదిరింపులురావడం సహజం. దాంతో ఆచితూచి అడుగువేయాల్సి వుంటుంది. ఇప్పుడుజరుగుతున్న ప్రక్రియ అదే. అందుకేఇదిగో తెలంగాణ, అదిగో తెలంగాణ అనాల్సివస్తోంది. అంతే తప్ప నరేంద్రసరదాగా అలా అనడం లేదన్న విషయంగమనించకపోతే ఎలా?నిజంగాతెలంగాణా మీద ప్రేమ ఒలకబోస్తున్ననాయకులు, పార్టీలు తెలంగాణా రాష్ట్రాన్నివ్యతిరేకిస్తామంటున్న పార్టీలతోఎందుకు మాట్లాడకూడదు? ఎందుకువాటిని ఒప్పించగూడదు? వారి నాయకులుసందు దొరికినప్పుడల్లా, వీలుచిక్కినప్పుడల్లా, వేదిక లభించినప్పుడల్లాసమయం - సందర్భం గాకపోయినాప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకుతాము వ్యతిరేకులమని మార్క్సిస్టు పార్టీ,తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉన్నాయి.మరి వారి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించరు?నరేంద్ర వ్యాఖ్యలకే, అభిప్రాయాలకేస్పందిస్తూ హంగామా చేయడంఎందుకు?తెరాసప్రత్యేక తెలంగాణా డిమాండ్‌కుమొండిచేయి చూపడం లేదు. అలాంటిదాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. కిందిస్థాయి నాయకుల నుంచి అగ్రశ్రేణినాయకుల వరకు ముక్తకంఠంతోతెలంగాణా సాధిస్తామనే అంటున్నారు.అందుకు అహర్నిశలు పాటు పడుతున్నారు.అలాంటి కార్యాచరణను విస్మరించిచంద్రబాబు నాయుడు ఇక తెరాసకుతెరపడింది, తెరాస పని అయిపోయిందిలాంటి ప్రకటనలు చేయడం వల్ల ఆయనరాజనీతిజ్ఞతపై అనుమానాలుఏర్పడుతున్నాయి. తెలంగాణా ఏర్పాటునువ్యతిరేకిస్తున్నామని చంద్రబాబు అంటేఅందులో అర్థం వుంది. ఆయన మాటనుపట్టించుకోవచ్చు. అలాగాక ఇక తెరాసపని అయిపోయింది లాంటి వ్యాఖ్యలు ఆయనకుశోభను తెచ్చి పెట్టవు.హరిహరాదులుఅడ్డుపడినా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించితీరుతామని తెరాస అగ్రనాయకుడు కె.చంద్రశేఖర్‌ రావు చాలా స్పష్టంగాచెప్పారు. అందుకు అవసరమైన అన్నిచర్యలు చేపడుతున్నారు. దౌత్యంప్రదర్శిస్తూనే వున్నారు.సంయమనంతో పావులుకదుపుతూనే వున్నారు. సరైనసమయం కోసం నిరీక్షిస్తున్నారు. ఆవిషయం స్పష్టంగా తెలుస్తూనే వుంది. అదిరహస్యంగా కొనసాగడం లేదు.మరెందుకు ఇంత గగ్గోలు?పిసిసిఅధ్యక్షుడు కె. కేశవరావుతెలంగాణ వీరాభిమాని. ఆ విషయం అందరికీతెలుసు. తెలంగాణా ఎలా ఏర్పడనున్నదో,ఎవరి వల్ల ఏర్పడనున్నదో, ఎప్పుడుఏర్పడనున్నదో తెలుసు. ఆ విషయంఆయనే చెప్పారు. అలా చెబుతూనేతెరాస నాయకులను ఎద్దేవా చేయడంసముచితంగా ఉంటుందా? కాంగ్రెస్‌ పార్టీకితెరాసతో మిత్రవైరమే తప్పశత్రువైరం లేదు. మరి ఎందుకుచులకన చేసే మాటలు మాట్లాడటం?కాంగ్రెస్‌ఎమ్యెల్యేలు కొందరు మరింతముందుకెళ్లి తెరాస అగ్రనాయకులుకేంద్రంలో అధికారం అనుభవించడంతప్ప తెలంగాణాకుఒరగబెడుతున్నదేమిటి? ఆపదవులకు రాజీనామాలు చేసి వచ్చిమాట్లాడితే బాగుంటుందని కూడా వారు ఓఉచిత సలహా ఇచ్చారు.తెలంగాణాపైఅపారమైన ప్రేమ ఉన్నట్టు, తెలంగాణాకుతెరాస నాయకులు ఏమీ చేయడంలేదన్నట్టు కొంత మంది ఎమ్యెల్యేలుమాట్లాడటం విడ్డూరంగా ఉంది. తెలంగాణారాష్ట్ర సాధనే ఏకైక అజెండాముందుకు కదులుతున్న నాయకులపట్ల వారలా విచక్షణారహితంగావ్యాఖ్యానాలు చేయడం ఏ మాత్రం సబబుకాదు.కేంద్రంలోచంద్రశేఖర్‌ రావు గాని, నరేంద్రగాని కేవలం పదవుల కోసం అక్కడ(ఢిల్లీలో) లేరనే విషయంతెలంగాణావాసులందరికీ తెలుసు.సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షంగా వారిరువురుమంత్రులయ్యారని , యుపిఎచైర్‌పర్సన్‌ సోనియా గాంధీఅభ్యర్థన మేరకు వారు ఆమంత్రిపదవులు చేపట్టారని, తెలంగాణారాష్ట్రం ఏర్పడదని తెలిసినమరుక్షణం ఆ పదవుల నుంచితప్పుకుని బజారున పడతారనిసైతం తెలంగాణా ప్రజలకు తెలుసు. మరిఅలాంటప్పుడు కాంగ్రెస్‌ ఎమ్యెల్యేలకు వారిపైఅంత ఆగ్రహం దేనికి? సామాన్య ప్రజలకన్నా ఎక్కువ రాజకీయవిషయాలను అవగాహన చేసుకునేశక్తి సామర్థ్యాలున్న ఎమ్యెల్యేలు ఇలాఅడ్డగోలుగా మాట్లాడటంలో ఔచిత్యం ఏమీకనిపించడం లేదు. తెలంగాణా ప్రాంతఎమ్యెల్యేలు ఆత్రపడటం, ఆవేశపడటంఅంత మంచిది కాదు. అనైక్యతముందు పుట్టి, తెలంగాణావాదులుతరువాత పుట్టారన్న విమర్శనువారు సార్థకం చేస్తున్నారు.నిజానికిపార్టీల కంపల్షన్స్‌కు దూరంగాతెలంగాణా ప్రాంత ఎమ్యెల్యేలుమాట్లాడవలసిన తరుణం ఇది.ఇప్పటికైనా అనైక్యతా రాగం జోలికిపోకుండా సఖ్యతతో పనులు జరిగేలాచూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి జరిగినఅన్యాయాన్ని, నష్టాన్ని పూడ్చడానికి దశాబ్దాలు,శతాబ్దాలు కావాలి. అంతగా ఈ ప్రాంతంనష్టపోయింది. ఆ విషయాన్నిదృశ్యరూపంలో ప్రేమ్‌కుమార్‌అమన్‌ అనే డాక్యుమెంటరీచిత్రదర్శకుడు స్టిల్‌ సీకింగ్‌జస్టిస్‌ అనే డాక్యుమెంటరీలో బలంగా చెప్పాడు.అందులోని గణాంకాలు, వాస్తవాలు, లెక్కలుచూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.ఇంత అన్యాయాన్ని భరించడానికి తెలంగాణాప్రజలకు ఎంతటి ఓర్పు ఉందోఅర్థమవుతుంది. ఆ ఓర్పు, సహనానికిపరీక్షలు పెట్టడం సబబు కాదు. ఏ పార్టీకిచెందిన ఎమ్యెల్యేలైనా, మేధావులైనా,ఆలోచనాపరులైనా ఆ డాక్యుమెంటరీని చూడాలి.ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ నాయకులు,తెలుగుదేశం నాయకులు ఆడాక్యుమెంటరీని తప్పకుండా చూడాలి. అదిచూశాక కూడా ప్రత్యేక తెలంగాణారాష్ట్రం అవసరం లేదని అంటేమాత్రం వారి హృదయం పని చేసేతీరుపై అనుమానించాల్సి వుంటుంది!దేవేందర్‌గౌడ్‌ తన ఫెయిల్యూర్‌ స్టోరీని ఇటీవలఒక పత్రికలో చెప్పుకున్నారు. ఆయనబాల్యం, ఆనాటి సామాజిక స్థితిగతులుతనపై ఎలా ప్రభావం చూపాయోచెప్పుకున్నారు. మరి అంతటి దీనపరిస్థితులు గల తెలంగాణా ప్రాంతంగత 50 యేళ్లుగా ఎలాంటి పాలకులచేతుల్లో ఇరుక్కుపోయిందో తెలిసి కూడాతెలుగుదేశం అధినాయకుడుచంద్రబాబు రూపొందించినసమీకరణలకు, సూత్రాలకు తాళం వేస్తూప్రత్యేక తెలంగాణా వద్దనేమాట్లాడటం, తెలంగాణానుతెలంగాణావారే మోసం చేశారనివాపోవడం విడ్డూరంగా ఉంటుంది.అంతేగాక తెరాస నాయకులపై అసెంబ్లీలోఒంటి కాలిపై లేవడం ఎవరి మెప్పుకోసం?దేవేందర్‌గౌడ్‌ బాల్యం నాటి పరిస్థితులు ఇంకాతెలంగాణాలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి.అంతకాన్న అధ్వాన్నంగా ఉన్నాయి. మరివాటిని సంస్కరించే పనిని చేపట్టేందుకుఇప్పుడున్న పరిస్థితులుఅనుకూలించవన్న విషయం ఆయనకు(గౌడ్‌కు) స్పష్టంగా తెలుసు. మరిప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యేకతెలంగాణా ఏర్పడటమే. 1969సంవత్సరంలో వచ్చిన ప్రత్యేకతెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నదేవేందర్‌ గౌడ్‌ మరింతచైతన్యంతో ప్రసంగాలు చేయవలసివుంది. తెలంగాణ ప్రాంత ప్రజలవిముక్తికి ఆయన తన వంతుకృషి చేయవలసే వుంది. అలాచేయకపోయినా పర్వాలేదు గాని ఆ వైపుపయనిస్తున్నవారిపై ఒంటికాలిపైలేవకపోవడమే శ్రేయస్కరం.ఇకబిజెపి నాయకులు కాకినాడ తీర్మానాన్నిఅటకెక్కించి తెలంగాణ విషయాన్నికక్కలేక, మింగలేకసతమతమవుతున్నారు. ఇప్పుడుఅడపా దడపా తెరాసపై ఆరోపణలుగుప్పిస్తూ ఉన్నారు. వారికెందుకింతఅసహనమో అర్థం కాదు. మంచిఅవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుని,చంద్రబాబు సలహా మేరకు ఆ అవకాశాన్నికోల్డ్‌ స్టోరేజీలో పెట్టి, చంద్రబాబు మాటనేవేదంగా భావించి ఇప్పుడు బిజెపి తెరాసపైవిరుచుకుపడటం ఏ మాత్రం సమంజసంకాదు. తెలంగాణ అంశంపై బిజెపికిఉన్న గందరగోళం తెరాసకుఆపాదిస్తూ తెలంగాణాపై నెలకొన్నగందరగోళాన్ని సోనియాగాంధీ,చంద్రశేఖర్‌ రావు తొలగించాలని వీలుచిక్కుకున్నప్పుడల్లా మాట్లాడటం అంతవిజ్ఞత అనిపించుకోదు.యుపిఎచైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలుఇటీవల సకిందరాబాద్‌ బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలసమస్యలు తనకు తెలుసునని, ఆవిషయాన్ని పరిష్కరిస్తానని స్పష్టంగాచెప్పారు. అయినప్పటికీ ఇంకాఅనుమానాలు, గందరగోళం చాలామందికి కనిపంచడం విచిత్రం.సమైక్యాంధ్రను ఆశించేవారికి ఆ మాటలుకొరకరాని కొయ్యగానే మిగిలాయి. అది వారిదురదృష్టకరం. విచిత్రమేమంటేతాము ఏమి అనుకుంటున్నారో, ఏ పదజాలంతోఊహించుకుంటున్నారో అచ్చం అలాగే సోనియాగాంధీ నోటి నుంచి ఆ మాటలు రావాలనిసమైక్యాంధ్రను ఆశించేవారుభావిస్తున్నారు. అది అత్యాశ గాకఏమవుతుంది?సమైక్యాంధ్రనుఆశించేవారివన్నీ మొదటి నుంచీఅత్యాశలే. ఇంతవరకు వాటినినెరవేర్చుకున్నారు. కాని ఇకపై అదికుదరదు. హరిహరాదులు అడ్డుపడినాప్రత్యేక తెలంగాణ ఏర్పడితీరుతుందని తెలంగాణా ప్రజలఆకాంక్షను తెరాస నాయకుడు కె.చంద్రశేఖర్‌ రావు చెప్పారు. అదితథ్యం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X