వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణరాష్ట్రం ఏర్పడితే మంచి జరిగినా

By Staff
|
Google Oneindia TeluguNews

మనదిఅస్టవంకర్ల ప్రజాస్వామ్యం అనడంకంటే ప్రజలే లేని ప్రజాస్వామ్యం అంటే అదినిజానికి దగ్గరగా ఉంటుంది. అన్నిదుర్మార్గాలూ యిక్కడ ప్రజల పేరుతోజరుగుతాయి. ఎనిమిది వంకర్ల వరకుఎందుకు, ప్రస్తుతానికి నాలుగుప్రస్తావిస్తాను.సాధారణంగానేను వ్యక్తుల గురించి మాట్లాడను. అదివ్యక్తిగత విమర్శ అవుతుంది. ఏవ్యక్తి గురించి మాట్లాడినా అది ఆయావ్యక్తుల చేతలలో ప్రతిబింబించే ఆయావ్యవస్థల లక్షణాల గురించిమాట్లాడుతున్నామన్నమాట. అది విశ్లేషణకిందికి వస్తుంది. ప్రతి వ్యక్తినీ అతనునివసించే వ్యవస్థ ఆవహించి వుంటుంది.మనిషి మొదట వ్యవస్థను నిర్మిస్తాడు.తర్వాత ఆ వ్యవస్థే మనిషిని ఆక్రమించితనకనుగుణంగా నడిపిస్తుంది.అందువల్ల ఆయా వ్యవస్థలలోని లోపాలకు,వక్రాలకు, దుర్మార్గాలకు వెలపలవుండి పోరాటానికీ పరిష్కారానికీప్రయత్నించే వాడే నిజమైననాయకడవుతాడు.మార్గదర్శకుడవుతాడు.మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదిశారహిత పరిపాలన వల్ల (నచ్చినవిచాలా వున్నా) ప్రధానంగా నాలుగువిపత్తులు తెలుగు ప్రజలనుచుట్టుముట్టాయి.ఒకటి- షరతులతో కూడిన పెనురుణభారం. రెండవది - ప్రత్యేకతెలంగాణ రాష్ట్రోద్యమం, మూడవది- గత ఎన్నికల్లో ప్రజల నుండి సాయుధతీవ్రవాదంపై తీర్పును కోరడం,నాలుగవది - నీతి నిజాయితీలు బాహాటంగా ఆవిరైపోవడం.నిజానికియింతకు ముందు తెరవెనకనో,అక్కడక్కడా అప్పుడప్పుడూ తచ్చాడుతూవున్నవే. ఇవి నిబద్దతతో బృహత్‌యత్నంతో పరిష్కరించగలిగినవే. వీటినిఅదుపులో వుంచి గతానుభవం నుంచిపాఠాలు నేర్చుకొని ప్రవర్తిస్తే ప్రజలకుమరింత మేలైన జీవితాన్ని యివ్వగలస్థాయిలో వున్నవే. కాని గత చరిత్రనుంచి నేర్చుకోకుండా అన్నీ తానేయై,కేంద్రకమై సాగించిన పాలనలో యివన్నీప్రజల ప్రాణాలు తీసే వ్రణాలుగా మారినై.ఎన్నికలలోరాజకీయ పార్టీలు తమ సిద్ధాంతప్రాతిపదికపై పోరాడాలి. గెలిచి వచ్చినతర్వాత తాత్కాలిక, దీర్ఘకాలికసమస్యల పరిష్కారానికి పూనుకోవాలి.తమ సిద్ధాంతమే సరియైనదనినిరూపించడానికి తీవ్రంగా కృషి చెయ్యాలి.ఎన్నికల తర్వాత పరిపాలనలోప్రజలందరికీ చెందిన ప్రభుత్వంగాపార్టీలకు అతీతంగా పరిపాలించాలి. అప్పుడు ప్రజలుతాము ఓటు వెయ్యని పార్టీని కూడా ప్రేమిస్తారు.ఆదరిస్తారు. సమస్యల పరిష్కారయత్నానికి సహకరిస్తారు. ఎన్నికలతర్వాత కూడా ప్రభుత్వంలోని పార్టీ గాని,పార్టీలు గాని యింకా ప్రజలను తరతమభేదంతో చూస్తూ వుంటే కులాలమధ్య, మతాల మధ్య, ప్రాంతాలమధ్య యిరుక్కుపోయిన ప్రజలు పార్టీలప్రజలుగా మారిపోతారు. ఆవేశకావేశాలుపెరుగుతాయి. వాటినాధారంగానాయకులు సృష్టించే సృష్టించే అగాధాలుఇంకా పెరుగుతాయే తప్ప తరగవు.ఈ క్రమంలో ప్రేమలేని, అభిమానం లేని,సౌహార్ద్రత లేని, సోదరభావం లేని,ఎవరికి ఎవరూ చెందని ఒక అమానవజాతి యా అగాధా నుండి పుడుతుంది.కుత్తుకలు తెగ్గోసుకోవడానికి కత్తులు,తుపాకులు తయారు చేసేకర్మాగారాలు మనిషి సమాధి మీదలేస్తాయి. ఈ దారిలోనే పైనవుదహరించిన సమస్యలు గతం చీకటినుండి వర్తమానం చీకట్లోకిదూసుకొచ్చినై. దయ్యాల్లా పట్టుకున్నయ్‌.జుట్టు విరబోసుకుని తిరుగుతున్నయ్‌.మొదటిది- షరతులతో కూడిన పెనుభారం. ఇదిదృతరాష్ట్రుని కౌగిలి వంటిది. అగ్రదేశాలుబీద, చిన్న దేశాలకు అప్పులిచ్చి, అప్పు చెయ్యకతప్పని పరిస్థితిని కల్పించి, ఆయా దేశాలనుఛిన్నాభిన్నం చేసి తమ సామ్రాజ్యాలనువిస్తరించుకుంటాయి. ఒకప్పుడు దాడి చేసి,యుద్ధం చేసి మాయోపాయాలతో ఓడించిఆయా దేశాలను ఆక్రమించేవి. ఇప్పుడు టెక్నాలజీపెరిగింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానంవిపరీతంగా పెరిగింది. ప్రపంచంకుగ్రామం అయిపోయింది. ఇప్పుడుఅగ్రదేశాలకు భౌతికంగా దండెత్తియుద్ధం చెయ్యవలసిన అవసరంలేకుండా పోయింది. ముందు బీద, చిన్నదేశాల అవసరాలు పెంచి, ఆయా దేశానుతమ ఉత్పత్తులకు మార్కెట్లుగా చేసి,వారి మనసులు ఆక్రమించి అక్కడ వుండేజాతీయభావనను తుడిచేసి, రూపాయిమీద పరోక్షంగా దాడి చేసి, అప్పుల్లోకియాడ్చి షరతులతో పరిపాలించడంప్రారంభమైంది. ప్రపంచ బ్యాంకు ఒకఆర్థిక వ్యవహారాల బ్యాంకు మాత్రమేకాదు, రాజకీయాయుధం.అప్పుబహు రుచిగా వుంటుంది.బాధ్యతారహితంగా అప్పులుచెయ్యడమంటే యిప్పుడున్నజనాభాపైనే గాక, భవిష్యత్తులోజన్మించబోయే వారి కలలను కూడా తాకట్టుపెట్టడమవుతుంది. ఈ అప్పును ఎలాతీర్పుతాం అని ముందు ప్రశ్నవేసుకోకుండా, ప్రణాళిక లేకుండా, ఎలాగూమాఫీ చెయ్యమని కాళ్లు పట్టుకుంటాంగదా అనే బేవార్సు యోచనతో చేసేఅప్పులు బాధ్యతారహిత్యాన్ని మరింతపెంచుతాయి. విదేశీ సంస్థల్లో అప్పులుచెయ్యడమంటే ప్రజల్ని తాకట్టు పెట్టడమేకాదు, త్యాగాలతో సాధించినస్వాతంత్య్రం లేనట్లే, రానట్లే.అందుకనే ఆనందం లేని, ఉత్సాహం లేనిఆగస్టు పదిహేనులు వచ్చి వెడుతుంటాయి.ఎన్నికలు ఒక తంతుగా జరుగుతూఉంటాయి. కొత్త ప్రభుత్వం పేరుతోపాత పార్టీలే అరిగిపోయిన సిద్ధాంతాలతోఅప్పుల జోలెతో వస్తూ వుంటాయి. ప్రజలకుప్రత్నామ్నాయం లేక ఒకప్పుడు ఛీకొట్టినపార్టీలనే తిరిగి తిరిగి ఎన్నుకోవలసినదుస్థితిలోకి నెట్టబడుతుంటారు. ఇప్పుడుజరిగింది అదే. భవిష్యత్తులోనైనా ఆర్థికస్వాతంత్య్రం, స్వయంనిర్ణయాధికారం తిరిగి సాధించగలమనేఆశ కూడా ఇవాళ లేదు. అప్పుతో చేసేఅనుత్పాదక ఖర్చు ఆత్మహత్యలకు దారితీస్తుంది.రెండవది- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం.చంద్రబాబునాయుడి వల్లనే యిది తిరిగివూపిరి పోసుకుంది. అధికారానికి కాస్తదూరమైనప్పుడల్లా యా భూస్వామ్యపెత్తందారీ వర్గాలకు చెందిననాయకులు వెంటనే ప్రత్యేక రాష్ట్రనినాదం బయటకు తీస్తారు. ఆంధ్రతెలంగాణ ప్రాంత ప్రజల మధ్య చిచ్చుపెడతారు. వీరు అధికారంలోవున్నప్పుడు సమైక్యాంధ్ర వుండితీరాలన్న వారే. మద్దతు ఇచ్చినవారే.వీరు అఅధికార పదవుల్లోవెలిగితపోతున్నప్పుడు తెలంగాణప్రాంత ప్రజల చారిత్రాత్మక తెలుగుభాషను వుద్ధరించడానికి గాని, పోరాటపటిమ గల సంస్కృతినిపరిరక్షించడానికి గాని, సాగునీరుతాగునీరు సమృద్ధిగా అందజేసినిరుద్యోగాన్ని పేదరికాన్ని పారదోలివలసలను అరికట్టడానికి గాని, కలలో కూడాకృషి చేసివనారు కాదు. ఆంధ్రనాయకులు గాని, తెలంగాణ నాయకులు గానిఅంతా గొంగళిలోని వెంట్రుకలే. వీళ్ల పదవీఅధికార దాహానికి సామాన్యులుఅహుతవుతూ వుంటారు.చాలాప్రాంతాల్లో దరిద్రం తాండిస్తోంది. దీనికితోడు ప్రకృతి వైపరీత్యాల వల్లకరవులు ఏర్పడుతున్నాయి. ఉపాధి లేమివెంటబడితే జీవితాన్ని భుజాన వేసుకొనివలసలు పోవడం, మిగిలినవారుఆత్మహత్య తప్ప మరో మార్గంలేదనే దుస్థితికి రావడంజరుగుతోంది. ఈ దీనస్థితే యానాయకులకు పెట్టుబడి. పదవీ అధికారలాలసతో మునిగి తేలే యా నాయకగణంకాసేపు అధికారానికి దూరమైతే యాదరిద్రానికి, దురవస్థకి మరొకప్రాంత ప్రజలు, నాయకులే కారణమనిచూపుడు వేలుతో అటువైపు చూపిస్తారు.ప్రజల మధ్య చిచ్చు రేపుతారు.ప్రాంతీయమే పరిష్కారమని సెంటిమెంటుకలగలసి భావోద్రేకాన్ని రెచ్చగొడతారు.పబ్బం గడుపుకోజూస్తారు. ప్రజలు తమపైపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.ఉద్యమం పేరుతో చక్కగాసంపాదించుకుంటారు. ఒకటికి మించిననియోజకవర్గాల్లో నిలబడతారు.బంధువర్గాన్నీ దింపేస్తారు. ప్రజలనుత్యాగం చెయ్యమంటారు. తాముపదవులు పొందుతారు.నాఅభిప్రాయంలో తెలుగువారంతా ఒకేరాష్ట్రంలో వుండి తీరాలనేమీ లేదు. ఎన్నిరాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నా ఫర్వాలేదు.కాని పదవీకాంక్షతో ప్రజల మధ్యవిభేదాలు సృష్టిస్తూ విషం చిమ్మే యావినాయకులు ఏ రాష్ట్రానికి పరిపాలకులుగావున్నా నష్టపోయేదీ ప్రజలే. పదవులువదలి ప్రజల్లోకి రమ్మని ముందు యావూసరవెల్లి నాయకుల్ని నిలదీయాలి.అంతవరకు వీరిని వుద్యమనేతలుగా చూడరాదు. అలాగే, ఏనాడూఅధికార పదవులలో లేనటువంటినిష్కళంక చరిత నాయకులతోయిటువంటి వుద్యమాలు రావడానికిప్రజలు ప్రోత్సహించాలి. వారిమార్గదర్శకత్వంలో తెలుగువారుఎన్ని రాష్ట్రాలుగా వున్నా ప్రజలకు న్యాయంజరుగుతుంది.మూడవది- ఇటీవలి సాధారణ ఎన్నికలలో ప్రజలనుసాయుధ తీవ్రవాదంపై తీర్పునుకోరడం.అలిపిరిసంఘటనలతో మొత్తం సమస్యనిసిద్ధాంత పరంగా గాకవ్యక్తిగతంగా తీసుకున్నారుచంద్రబాబు నాయుడు. రాజకీయాలనువ్యక్తిగతంగానో, ఏ వర్గం దఋష్టినుండో, పోలీసు దృష్టి నుండో ఆలోచించిచర్యలు తీసుకుంటే అవి సత్ఫలితాలుయివ్వకపోవడమే గాక సమాజంపైదుష్ప్రభావం చూపుతాయి. మొత్తంసమాజానికి ఏది ప్రయోజనకరం,సమస్యలు ఏ మార్గంలో వెడితేపరిష్కారమవుతాయనేదూరదృష్టితో పరిపాలనచెయ్యవలసిన వుంటంది. ఈయన గారివైయక్తిక భావనలకువ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు.ఫలితంగా ఆయన ఏకాకి అయినాడు. ఆపార్టీయే ఎన్నికలలో గెలిచి వుంటే సాయుధవిప్లవాన్ని తొక్కి వెయ్యడమేప్రధానాంశం అయివుండేది.ప్రభుత్వమంటే పోలీసులే అనే స్థితివచ్చేది. సమస్యలన్నీ పక్కకు పోయి ప్రజలుకొత్త కష్టాల్లో పడేవారు.కొత్తప్రభుత్వం చొరవతో యిటీవలవిప్లవపార్టీలకు, ప్రభుత్వానికి మధ్యశాంతికోసం చర్చలుప్రారంభమయినాయి. సద్భావనతోకొనసాగి మొదటి విడత ముగిసింది.అయితే కొత్త ప్రభుత్వం కూడా పాతప్రభుత్వం చేసిన తప్పిదాన్నే మరోవైపు నుండి చేసే ప్రమాదంకనబడుతోంది. ఆయుధం ఎవరుపట్టుకోవాలి? ఎవరు పట్టుకోకూడదు? అనేదిప్రధానాంశం అయిపోతున్నది. దీనినిచూడటానికి అటు వైపు, యిటు వైపుప్రతినిధులు, పర్యవేక్షకులు ఎలాగూవున్నారు గదా, దీనిని వారికి వదిలెయ్యాలి.శాంతి ఏ విధంగా, ఏ చర్యల వల్లవస్తుందనే అంశం చుట్టూ చర్చలుజరగాలి. లేకపోతే చర్చలవుద్దేశమే పక్కదారి పట్టే అవకాశంవుంది. ఈ సందర్భంలోగమనించవలసిన విషయాలు కొన్నివున్నాయి. మొదట రాజకీయ రంగంనుండి ప్రారంభమై మొత్తంసమాజంలోని మౌలిక విలువల్నేకబళిస్తున్నది అవినీతి. రక్షణ లేనివ్యవసాయ రంగం, ఒక వైపు గిట్టుబాటుధరలు లేకపోవడం, మరొకవైపుకొనుగోలుదారుపై పడుతున్న అధికధరల భారం, దానికి కారణమైనదళారీ వ్యాపారుల దోపిడీ, ప్రపంచీకరణ,సరళీకరణ, ప్రైవేటీకరణల వల్లగ్రామసీమల్లో అధికమవుతున్నఆర్థిక సమస్యలు, కనీస సౌకర్యాలు లేనిగ్రామసీమలు, గ్రామాలు పట్టణాల మధ్యపెరుగుతున్న ఆర్థిక సంబంధసమస్యలు, వ్యత్యాసాలు, శాఖలు, అధికారులు,ప్రజల మధ్య సమన్వయ స్థితిలేకపోవడం, మేధావులు, నిపుణులు,న్యాయకోవిదులు, సుశిక్షితులైనవృత్తిదారులు, గత చరిత్రనువర్తమానానికి అన్వయించి నూత్నమార్గాలను సూచించగలిగినవారుప్రజాప్రతినిధులుగా శాసనసభలోకిఅడుగు పెట్టలేని దుస్థితి యామొదలయినవి శాంతి చర్చల్లోముఖ్యమైన విషయాలుగా వుండాలి. వీటికిశాంతికి సంబంధం వుంది. వీటికిఆచరణ సాధ్యమైన పరిష్కారాలు,సూచనలు విప్లవపార్టీలు, ప్రభుత్వంయివ్వాలి. వీటిని మినహాయించి చర్చిస్తేఅర్థాంతరంగా ఎక్కడో ఒక్కచోట చర్చలుఆగిపోతాయి. అన్ని వర్గాలవారూ యా చర్చలనుఆహ్వానించారు. కొంత వరకైనా శాంతినెలకొంటుందని ఆశిస్తున్నారు. దీనిలోప్రభుత్వంపై బాధ్యత ఎక్కువగావుంటుంది.తాముచేస్తున్నది ప్రతిహింస అని విప్లవపార్టీలుచెబుతున్నాయి. రాజకీయ రంగంనుండి, భూస్వామ్య పెత్తందారీ వర్గాలనుండి, అధికారుల నుండి సామాన్యులపైజరుగుతున్న హింస కాదనలేనిది.ఈ హింసపై ప్రభుత్వం కఠినంగావ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటేప్రతిహింస కు ఆస్కారం తగ్గుతుంది.అప్పుడు ప్రజలే విప్లవపార్టీలు ఆయుధంపట్టుకోవలసిన అవసరం లేదనిచెబుతారు. దీనికి యిక్కడ ఒకవుదాహరణ చెప్పుకోవాలి. గతంలోఎన్నికల సమయంలో విప్లవ పార్టీలు ప్రజలనుఎన్నికలను బహిష్కరించమనిపిలుపునివ్వడం జరిగింది. కాని ప్రజలు ఆపిలుపును లక్ష్యపెట్టకుండా ఓటింగులోపాల్గొనడం జరిగింది. ఆ విధంగానేఆయుధం విషయమై కూడా ప్రజలుస్పందిస్తారు. పౌరులు ఆయుధాలు పట్టుకునేపరిస్థితి రాకుండా చెయ్యవలసినబాధ్యత ప్రభుత్వంపై వుంది.విప్లవపార్టీలు గమనించవలసిన విషయాలు కూడాకొన్ని వున్నాయి. బస్సులను, రైళ్లనుతగులటెట్టడం, ట్రాన్స్‌ఫార్మర్లను,రైల్వే స్టేషన్లను, పోలీసు స్టేషన్లనుధ్వంసం చేయడం, టెలిఫోన్‌మొదలైన సమాచార యంత్రాంగాన్నిఅడ్డుకోవడం, యిటువంటి పనులుమానుకోవాలి. ప్రజల ఆస్తులను ధ్వంసంచెయ్యడం వల్ల తిరిగి ప్రజలపై ఆర్థికభారంపెరుగుతుంది. మర్నిన్ని యిబ్బందులుచుట్టుముడుతాయి. అలాగే భయపెట్టిచందాలు వసూలు చేసే నకిలీ నక్సలైట్లు,దారిదోపిడీ గ్యాంగులు, కిడ్నాపర్లుమొదలైనవారి సంఖ్యపెరుగుతున్నది. వీరిని అదుపుచెయ్యకపోతే విప్లవ పార్టీలపైగౌరవభావం తగ్గుతుంది.విప్లవపార్టీల నాయకులు ప్రజా తెలంగాణ ఏర్పాటుచెయ్యడానికి తాము కృషి చేస్తామనిచెబుతున్నారు. ఈ ఆలోచన ప్రజల దృష్టికివేరే విధంగా వెడుతుంది. ప్రస్తుతభూస్వామ్య పెత్తందారీ పదవీలాలసనాయకత్వాన్ని ఎప్పటికప్పుడుతార్పూరపట్టకుండా వారి వెంట ప్రజలనుకంచె మేకలా గుడ్డిగాఅనుసరించకుండా, దానిపై వారికి తగుఅవగాహన యివ్వకుండా ప్రజాతెలంగాణ అని అంటే, ప్రత్యేకతెలంగాణ వుద్యమాన్ని విప్లవ పార్టీలుయధాతథంగా సమర్థిస్తున్నాయనేఅనుకుంటారు. పైగా యిది పీడితులు,తాడితుల వైపు నుంచి గాక ఒకప్రాంతంలోని వారిని ఆకర్షించే మాటఅవుతుంది. గతంతో విశాలాంధ్ర కోసంవామపక్షంలోని వేల మంది ప్రాణత్యాగంచేశారనే విసయం మరవరాదు.విప్లవ పార్టీలు నిజంగానే ప్రజాతెలంగాణ కోసం కృషిచేయదలుచుకుంటే ముందుగాప్రజాంధ్రప్రదేశ్‌ను నిర్మించి ఆతర్వాత తెలుగువారికి ఎన్ని ప్రజారాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఎవరికీఅభ్యంతరం వుండదు. సామాన్యప్రజల ప్రయోజనాలకు అడ్డంకి వుండదు.ఇంకాచర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి యావిషయాన్ని యిరు వైపులవారూ దృష్టిలోపెట్టుకుని శాంతి వైపు ప్రయాణిస్తారనిఆశించవచ్చు.నాలుగవది- పార్లమెంటరీ ప్రజాస్వామ్య పార్టీల్లోని నీతినిజాయితీలు.తీవ్రవాదులనుజనస్రవంతిలో కలవాలనీ ఓటింగులో అంతాపాల్గొనాలనీ ఢిల్లీలోని రాష్ట్రపతి నుండి గల్లీనాయకుని వరకు అందరూ పిలుపునిస్తూవుంటారు. కాని రాజకీయ పార్టీల్లోని,నాయకుల్లోని నీతినిజాయితీ గురించి, శీలంసిద్ధాంత నిబద్దత గురించి వీళ్లెవరూగట్టిగా చెప్పరు. ఇవాళ కోర్టుల్లోరాజకీయ రంగంలోని వారిపై ఎన్ని వేలకేసులున్నాయో గమనిస్తే పరిస్థితి కొంతఅర్థమవుతుంది.ఇవిగాక,కోర్టుకు పోలేని, వాటి పరిధిలోకి రాని పార్టీలప్రశ్నార్థకమయ్యే ప్రవర్తన,నీతీనిజాయితీ, శీలం మొదలైన అంశాలకుచెందినవి ఎన్నో వుంటాయి. మనకుస్వాతంత్య్రం వచ్చిన క్షణంలోనేఅవినీతికి, దుర్వినీతికి రెక్కలున్నాయి.పట్టపగ్గాలు లేని స్వేచ్ఛ వొచ్చింది.అంతవరకు కాస్తయినా వున్న నీతినిజాయితీ శీలం క్రమంగా ఆవిరై పోయాయి. ఈవిషయంలో అన్ని పార్టీలూ గొంగళివెంట్రుకలే.ప్రతిసారీఎన్నికలకు ముందూ ఆ తర్వాతాప్రభుత్వాలు ఏర్పరిచే ముందూ, ఆతర్వాతా ప్రజాప్రతినిధులు వేసేకప్పగెంతులు చూసి ప్రజలు ముక్కు మీదవేలేసుకునేవారు. క్రమంగా ఆ దొంగకప్పలకు అలవాటు పడ్డారు. రాజకీయాలంటేయిలాగే వుంటాయి అని సర్దిచెప్పుకునేపరిస్థితికి వచ్చారు. ఉదాహరణకియిటీవల మన కళ్ల ముందుబాహాటంగా, నిస్సిగ్గుగా జరిగిన ఒక సంఘటనతీసుకుందాం. ఇది దానం నాగేందర్‌ఉదంతం. తాను అడిగిననియోజకవర్గానికి టికెట్‌ ఇవ్వలేదనిచివరి క్షణంలో తాను అంతవరకుఎన్నికల సభల్లో శాసనసభా వేదికపైనతీవ్రంగా విమర్శించిన తెలుగుదేశంపార్టీలోకి ఏ మాత్రం బిడియం లేకుండాగెంతు వేశాడు. మొదటి నుండిఅతనికి ప్రజాభిమానం లాంటిదివుండడం, యితర కారణాల వల్లరాష్ట్రమంతటా తెదేపాకి వ్యతిరేకప్రభంజనం వీస్తున్నా ప్రజలు అతన్నిగెలిపించారు. కాని అతను వూహించిందివేరు, జరిగింది వేరు. కాంగ్రెసు పార్టీఅనూహ్యంగా అఖండ విజయం సాధించిప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదినాగేందర్‌కు పరాభవం. తనుకాంగ్రెస్‌లో వుండి వుంటే గెలిచేవాడు.పదవి దక్కేది. ఆ ఛాన్సు యిప్పుడు పోయింది.ఇప్పుడు ఇంతకాలం విమర్శించిన ఆ పార్టీలోయిమడలేదు. ప్రతిరోజు ప్లేటు మార్చికాంగ్రెసును ఏ ముఖం పెట్టుకునివిమర్శించగలడు? ఏదో ఒక ముఖం పెట్టుకునికాంగ్రెసును విమర్శించేవాడు తెదేపాఅధికారంలోకి వచ్చి వుంటే డామిట్‌ ....కథం అడ్డం తిరిగింది. తిరిగిపూర్వవైభవంతెచ్చుకోవాలనుకున్నాడు యా గిరీశంగారు. ఎన్నికల పారాణి ఆరకముందేశాసనసభా సభ్యత్వానికి రాజీనామాయిచ్చాడు. తద్వారా ప్రజల డబ్బుతోనే తిరిగిజరిగే ఉప ఎన్నికలకుకారణభూతుడయ్యాడు. కాంగ్రెసు పార్టీఅతన్ని కౌగలించుకుని పార్టీలోకిచేర్చుకుంది. ఉప ఎన్నికలో నిలబెట్టింది. ఈసారినిజంగా వివేకంతో చాలా మంది బోటర్లుబూతుల వద్దకే రాలేదు. నాగేందర్‌చెంపదెబ్బ కొట్టినట్లు ఓడిపోయాడు. ఈమొత్తం ఉదంతం ఏం చెబుతున్నది?ఇందులోతప్పు పట్టవలసింది నాగేందర్‌నేకాదు, చంద్రబాబునాయుడు, వైయస్‌రాజశేఖర్‌ రెడ్డి - వీళ్లను కూడాతప్పు పట్టవలసి ఉంది. అంత వరకూతననీ తన పార్టీనీ విమర్శించే వాణ్ని ఏసిద్ధాంత ప్రాతిపదికపై బాబు తనపార్టీలోకి చేర్చుకున్నాడు? ఒకవేళచేర్చుకున్నా కొంతకాలం అతనిప్రవర్తన, తన పార్టీ ఆలోచనలుఆచరణలోకి ఎంతవరకుఅనువదిస్తున్నాడు అనేది చూడకుండా, పార్టీనినమ్ముకుని పనిచేస్తున్నవారినందరినీపక్కనబెట్టి, ఎందుకని వెంటనేఅభ్యర్థిగా నిలబెట్టాడు? దీని వెనకఎటువంటి సిద్ధాంత పునాది వుంది?అలాగేముఖ్యమంత్రి వైయ్‌ వైపు నుండినాగేందర్‌ ప్రత్యర్థుల శిబిరంలోకివెళ్లిపోవడం, తిరిగి వచ్చేయడం, మళ్లీఉప ఎన్నికలో అభ్యర్థిగా నిలబెట్టడం ఏమీటీకంగాళీ పనులు! దీని వెనక వున్న నీతి,నిజాయితి, నిబద్దత, శీలం ఏమున్నాయి?ఇటువంటి బాధ్యతారహిత చర్యలుసమాజంపై దుష్ప్రభావాన్ని కలగజేస్తాయి.నాగేందర్‌ ప్రతినిధిగా ప్రజల్లోపనిచేస్తున్నవాడు, ఒకరుయింతవరకూ ముఖ్యమంత్రిగావున్నవారు, యింకొకరు యిప్పుడుముఖ్యమంత్రిగా వున్నవారు, అంతాసీనియర్లు వీరే యిలా ప్రవర్తిస్తే యింకఛోటాలు ఎలా ప్రవర్తిస్తారు?ముఖ్యమంత్రిగారుఆయుధాలు పోలీసులే పట్టుకోవాలి అంటున్నారు.సరే. ఒప్పుకున్నాం. మరి నాగేందర్‌లాంటి వాళ్లు పదవి, అధికారం,సంపాదన కోసం పాకులాడుతూసిద్ధాంతం తుంగలో తొక్కి,ప్రజావసరాలకు వ్యతిరేకంగాప్రవర్తిస్తుంటే ఆ పోలీసులు నాగేందర్‌మీద, అటువంటివాళ్ల మీద ఏదయినాచర్య తీసుకోగలరా? ప్రజల ఓటునుఅవమానిస్తుంటే పోలీసుల చేతిలోని ఆయుధంపనిచేస్తుందా? ప్రభుత్వంలోని వారు,ప్రతిపక్షంలోనివారు అంతా అలా ప్రవర్తిస్తూవుంటే స్వాతంత్య్రం, సమాజం, విలువలు,నీతి, నిజాయితీ, నిబద్ధత, అన్నీ గాలిలో ధూళిలోకొట్టుకుపోతుంటే యింక ప్రజలు ఎవరిదగ్గరికెళ్లి మొరపెట్టుకొవాలి?ఆయుధంగురించి కాదు, ముందుగాప్రభుత్వంలోనివారు, రాజకీయరంగంలోనివారందరూ, అధికారులూసత్ప్రవర్తనతో మెలగడానికి కృషిచెయ్యాలి. ఆ మార్గంలో అంతాపయనించడానికి ప్రోత్సహించాలి.మార్గదర్శకత్వం వహించాలి.అలాగేపౌరులు కత్తులు, తుపాకులుపట్టుకోవడం ప్రధానం కాదు. ప్రజలనేఆయుధంగా మలుచుకుని ప్రతి ప్రజావ్యతిరేకాంశం మీద ఉద్యమించాలి.శాసనసభ లోపలా వెలుపలా పోరాడాలి.ఎక్కడప్రజలే ఆయుధం అవుతారో అక్కడ నుంచేకొత్త చరిత్రప్రారంభమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X