వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్లవిజయభాస్కర్‌ రెడ్డి మొదలు పెట్టినకార్యాన్ని సంపూర్ణం చేయడానికి ఇప్పుడుడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికంకణం కట్టుకున్నారు. ఈ ప్రమాదాన్నిఅప్పుడు కోస్తా నాయకులుగ్రహించలేకపోయారు. తమకుకాకుండా కృష్ణా జలాలు మరెవరికిపోతాయనే ధీమా కావచ్చు. ఇప్పుడురాజశేఖర్‌ రెడ్డి ఆ ప్రమాదమేమిటోప్రత్యక్షంగా చూపించేసరికి గుడ్లుతేలేయాల్సిన పరిస్థితి. ఎన్‌.టి.రామారావు ఒకందుకు, మరోఉద్దేశంతో ప్రారంభించినదాన్ని ఇప్పుడురాజశేఖర్‌ రెడ్డి తనకు పూర్తిఅనుకూలంగా మార్చుకున్నారు. నికరజలాలను అందించాలనే ఆనాటి డిమాండ్‌నుఆయన ఇప్పుడు తానే స్వయంగానెరవేర్చుకుంటున్నారు.                      నీళ్లతరలింపు వెనక.....-కె. నిశాంత్‌ప్రభుత్వంలోలేకపోవడం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటోతొలిసారి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)శాసనసభలో నిర్మాణాత్మకంగాప్రదర్శించి చూపింది. తెలంగాణ రాష్ట్రంఏర్పాటు డిమాండ్‌ కోసం ఉద్యమంజరుగుతున్న సమయంలోనేతెలంగాణకు జరుగుతున్నఅన్యాయాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపేఅవకాశం దాని వల్ల లభిస్తుందనేవిషయాన్ని, ఈ పరిస్థితిని తెలంగాణ ప్రజలుఆశిస్తారని తెరాస నిరూపించింది.పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు40వేల క్యూసెక్కుల నీటిని తరలించేముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ తెరాస సోమవారంశాసనసభలో గట్టిగా గొంతు విప్పింది.రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగిన కాలంలోతెరాస ఇలా గొంతెత్తిన సందర్భాలులేవు. అన్నిటినీ తెలంగాణ రాష్ట్రంఏర్పడే వరకు వాయిదా వేసే వ్యూహాన్ని ఆకాలంలో అనుసరిస్తూ వచ్చింది. తెలంగాణరాష్ట్రం ఏర్పాటు అనేది మొదటి నుంచీ ఒకఅనుమానాస్పద వ్యవహారంగానే ఉంటూవస్తోంది. కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకుఎప్పుడూ నమ్మకం లేదు. తెరాసకాంగ్రెస్‌తో దోస్తీ కట్టినప్పుడుమొదలైన అనుమానం ఇప్పుడుపెనుభూతంగా మారి, తెరాస ఉనికినేసవాల్‌ చేసేదిగా మారింది. అందువల్లతెలంగాణకు అన్యాయం జరుగుతున్నఅంశాల విషయంలో గట్టిగా ప్రతిస్పందించేగొంతు ఒకటి ఉండాలని తెలంగాణ ప్రజలుకోరుకుంటున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

అవినీతి,స్వార్థపరప్రయోజనాలు రాజ్యమేలుతున్న దేశంలోఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. దీనికి -అంతూ దరీ లేని బోఫోర్స్‌ నుండిగుజరాత్‌ మారణకాండ వరకు ఎన్నిఉదాహరణలైనా ఇవ్వవచ్చు. అలాగేఇందిరాగాంధీ హత్య, దానికి దారి తీసినకారణాలు వేరుగా ఉండగా,తద్విరుద్ధంగా స్పందిస్తూ వేల మందిఅమాయక నిర్భాగ్య సిక్కుల వూచకోత,దానిపై కపట అహింసా మార్గీయుల ఔచిత్యసమర్థన మొదలైన వుదంతాలుఎన్నయినా చెప్పవచ్చు. కోర్టుల్లోఅవమానకరమైన కేసులునడుస్తుండగా కేంద్రమంత్రులుగాఅధికారాన్ని చలాయించడం యిక్కడేసాధ్యం. ఇక్కడ దేనికీ సహేతుకగీటురాయి కానరాదు. ఆ ప్రకారంచూసినప్పుడు యిక్కడ ఎప్పుడైనా ఏదైనాజరగవచ్చు. బహుశా రేపు వూహంచనిమరొక మలుపు తిరిగి జయేంద్ర స్వామినిరపరాధిగా బయటకు రావొచ్చు. గాలిదుమారంగా వచ్చిన ఆరోపణల వెల్లువఅంతే వేగంగా వెనక్కి వెళ్లిపోవచ్చు.నాటకీయంగా అంతాసద్దుమణిగిపోవచ్చు. పీఠం పూర్వప్రతిష్ఠకు ప్రయత్నాలు జరగవచ్చు.లేదూ, దీని వెనక వుండి చక్రంతిప్పేవారికి తాము అనుకున్న పని యింకాపూర్తి కాలేదు అనుకుంటే స్వామిఅపరాధిగా నిర్ధారణ కావొచ్చు. శిక్షపడవచ్చు. ఆ తర్వాత కూడా యామొత్తం వ్యవహారాన్ని పక్కన పెట్టితిరిగి పీఠం పూర్వ ప్రతిష్ఠ కోసంపూనుకోవచ్చు.ఆధ్యాత్మికప్రాంగణంలో అవాంఛనీయ ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయని తెలిసినమరుక్షణమే ప్రభుత్వాలు మేలుకొనిసరిదిద్దడానికి పార్టీ రాజకీయాలకుఅతీతంగా ప్రయత్నించి వుంటే యివాళభక్త జనహృదయాలు యింతగాసంక్షోభానికి గురి అయి ఉండేవి కాదు.పీఠాధిపతి అరెస్టు వరకు వెళ్లివుండేది కాదు. ఆధ్యాత్మిక విలువలువ్యక్తి ప్రవర్తన స్థాయికి దిగజారివుండేది కాదు.ఈసందర్భంలో లౌకికవాదులకు వచ్చేరెండు సందేహాలున్నాయి. ఒకటిప్రభుత్వానికి సంబంధించినది. జయేంద్రస్వామిని అరెస్టు చేయడానికి పెట్టినముహూర్తం, ప్రదేశం, సమయం,సందర్భం, తదనంతరంక్షణక్షణం వెలుగులోకి తీసుకొచ్చినవుదంతాలు, చూపించిన చొరవ,సామాన్యులయినా పీఠాధిపతులయినాన్యాయం ముందు అంతా సమానులేఅన్నది చూపించి ప్రభుత్వానికి కితాబుసంపాదించడానికి ఆతృత చూపించినట్లుకనిపిస్తున్నది. అయినా, యిదిసామాన్యమైన చర్య కాదు. కోట్లాదిభక్తుల హృదయాలనుగాయపరిచైదైనా, యిటువంటి చర్యతీసుకోవడానికి సన్నద్ధం కావడంమామూలు విషయం కాదు. హత్య,హత్యాయత్నాలు, నేరాలు ఘోరాలు, అనైతికలైంగిక క్రీడలు వీటి వెనకసర్వసంగ పరత్యాగి వున్నారనినిరూపించే రుజువులు తమ వద్దవున్నాయని ప్రకటిస్తూ యా చర్యకుపూనుకోవడం చిన్నది కాదు,సాధారణమైంది కాదు.పారదర్శకత కోసం, న్యాయంముందు అంతా సమానులే అన్నట్లు దీనిపైచర్యలు తీసుకోవడం తప్పకుండాహర్షించవలసిందే. ఆహ్వానించవలసిందే.బలపరచవలసిందే. అయితే యివాళహత్యలు, హత్యాయత్నాలు, ప్రోత్సాహాలు,రాజకీయాలు, చీకటి ఆర్థిక లావాదేవీలు ఏలినమతప్రాంగణమేదీ లేదు కాబట్టియితర మత పెద్దలపై కూడాసమయం వచ్చినప్పుడు యింతటికఠినచర్యలు తీసుకోవడానికిప్రభుత్వాలకు దమ్ములున్నాయా? ఇటువంటిదృష్టాంతం యింతకు ముందులేదు, భవిష్యత్తులో వుంటుందనిసూచించే హామీ ఏమీ లేదు. అందువల్ల ఓట్లుఏరుకునే దారిలో అడుగడుగునా కులం,మతం మన అభివృద్ధికిఅడ్డుపడుతూనే ఉన్నాయి. అందువల్లనేభారతదేశం యింతవరకూలౌకిక దేశంగా ప్రఖ్యాతిపొందలేకపోయింది.సరే.జయేంద్ర స్వామి సంఘటన నేపథ్యంలోయితర మతాల ప్రాంగణాలు ఎలావున్నాయో డేగకన్నుతో చూడడానికిమన ప్రభుత్వాలుసన్నద్ధమవుతాయా?రెండవది- శంకర మఠాలకు సంబంధించినవి.దేశవ్యాప్తంగా గల శంకర మఠాలలోవలెనే కంచి మఠంలో కూడావారసుడయ్యే పీఠాధిపతినిముందుగానే నిర్ణయించడంజరుగుతుంది. పీఠాధిపతి కాబోయేవ్యక్తి తల్లిదండ్రులకు ఏకైకసంతానం అయి వుండకూడదు. జీవితకాలమంతా బ్రహ్మచర్య దీక్ష విధిగాపాటించాలి. ఆ మఠానికి నిర్దేశించినవేదంలో నిష్ణాతులై వుండాలి. ఇవన్నీగాక, అతి ముఖ్యమైనది వారసుడిజాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు.జాతకంలో గ్రహాల స్థానాలను, ప్రభావాలనునిశితంగా పరికిస్తారు. అవన్నీ సరియైనస్థానాలలో సక్రమంగా వున్నాయనిగమనించిన తర్వాతే వారసుడిగానియమిస్తారు.సందేహంఇక్కడే వస్తున్నది. ఇక్కడే మూలాల్లోకివెళ్లవలసి వస్తున్నది. జయేంద్ర స్వామిహయాంలోనే వ్యక్తిగతంగాఆయనకూ, వారి ద్వారా కంచి పీఠం మీదమాయని మచ్చ పడింది. రేపు వారునిరపరాధులని తేలితే కేసుల నుండిబయటపడవచ్చు. అ తేలకపోతేశిక్షార్హుల కావచ్చు. ఏది జరిగినా చరిత్రలోనేయిదొక చెరపలేని మచ్చగామిగిలిపోతుంది. హేయమైన, దుర్భరదుర్ఘటనగా నిలిచిపోతుంది.ఇంతటితీవ్రాతితీవ్రమైన ఆధ్యాత్మిక కంపం ఎలాజరిగింది? జయేంద్ర స్వామి జాతకం క్షుణ్ణంగాపరిశీలించి, పద్నాలుగు సంవత్సరాలునడవడిక నిశితంగా గమనించి,దీక్షనిచ్చి, తరువాతనే వారిని వారసునిగానియమించినది సాక్షాత్తు జ్ఞానసిద్ధులు,స్థితప్రజ్ఞులు, సర్వసంగ పరిత్యాగులుచంద్రశేఖర సరస్వతి. మరి, వారుజయేంద్ర స్వామి జాతకంపరిశీలిస్తున్నప్పుడు యా జాతకుని ద్వారాకంచిపీఠం ప్రతిష్ఠకు భంగంకలుగుతుందని ఆ జాతకం ద్వారాతెలియరాలేదా? ఇటువంటి పరిస్థితిలోచంద్రశేఖరేంద్ర సరస్వతికిజాతకశాస్త్రం తెలియదనే సాహసంచేయలేం కదా! లేక, జాతానికి శాస్త్రస్థాయి లేదనే వాదంతో ఏకీభవిద్దామా!మూలాల్లోకి వెళ్లినప్పుడు యిటువంటిమౌలికాంశాలు ముందుకొస్తాయి. ఈసందేహాలపై ఆయా రంగాలకు చెందినమేధావులు ఆలోచించవలసి వుంటుంది.ఇటువంటిసంకట స్థితిలోంచి అనాది ప్రశ్న ఒకటితలెత్తుతుంది. పారిమార్థికమూ,వ్యావహారికమూ ఎటువంటి మానవుణ్ణితయారు చేయాలని అనుకుంటున్నాయి?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X