వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌.కె.కొండెపాటి జర్మనీలో ఉంటున్నారు. ఆయనరీసెర్చ్‌ స్కాలర్‌. రాస్ట్రంలోని సామాజిక,రాజకీయ పరిణామాలపై ఆయనఎప్పటికప్పుడుప్రతిస్పందిస్తుంటారు.

By Staff
|
Google Oneindia TeluguNews

నేడుబిజెపి శిబిరం సంక్షోభంలోఅతలాకుతలం అవుతోంది. దీనిలో భాగమేబిజెపి నుంచి ఉమాభారతి బహిష్కరణ.బిజెపి, సంఘ్‌ పరివార్‌లలో అతివాదనాయకురాలిగా ఉమాభారతికి పేరుంది.ఇదే పరిస్థితిలో సంఘ్‌ పరివార్‌లోని విశ్వహిందూ పరిషత్‌ వంటి కరుడుగట్టిన అతివాద సంస్థలు కూడాఉమాభారతికి వెన్నుదన్నుగా ఉన్నట్లుకనబడటం ఆశ్చర్యకరమేమీ కాదు.కాగా బిజెపి నుంచి ఉమాభారతిబహిష్కరణకు ముఠా తగాదాలేకారణమని అంటూ ఒక వాదనవినపడుతోంది. అయితే ఈ వాదనకు పసలేదు. వాస్తవానికి గత దశాబ్ద కాలంగాబిజెపి వర్గ పునాదిలో ఏర్పడ్డవైరుధ్యాలే ఈ పరిణామాలకు కారణం.ప్రపంచీకరణ,సరళీకృత ఆర్థిక విధానాల అమలులోతన పరిపాలనా కాలంలో బిజెపి అంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్‌ కంటేకూడా రెండు ఆకులు ఎక్కువే చదివింది.వాస్తవానికి తమ పరిపాలనా కాలంలో బిజెపినేతలు కూడా దళారులుగా మారిసామ్రాజ్యవాదుల బహుళజాతి సంస్థలకుమన దేశంలోకి తలుపులు బార్లాతెరిచారు. బిజెపి పరిపాలనా కాలంలోనే బయటపడ్డ పలు కుంభకోణాలు నాటి పాలకులుదళారులుగా మారిన తీరుకు అద్దంపడుతున్నాయి. కాగా సామ్రాజ్యవాదులకుతైనాతీలుగా మారి దేశప్రయోజనాలనుతాకట్టు పెట్టే ఏ రాజకీయ పక్షమైనా(కాంగ్రెస్‌తో సహా) ఇందుకు మినహాయింపుకాదు.ఇకబిజెపి వర్గపునాదిలో వచ్చిన చీలిక వల్లేనేడు బిజెపిలో ముసలం పుట్టిందని, ఇదికేవలం ముఠా తగాదా మాత్రమేకాదని అర్థం చేసుకోవాలి. దానికికారణాలను చూద్దాం. అసలు బిజెపివర్గపునాదిలో ప్రధానంగా మొదటినుంచి ఉంటూ వచ్చిన వర్గాలు ఏమిటి అన్నదిమొదటి అంశం. ఫాసిస్టు పోకడలు గలమతవాద పార్టీ అయిన బిజెపివర్గపునాదిగా వ్యాపార వర్గాలు, వివిధశ్రేణుల మధ్య తరగతిలోని పెద్దవిభాగాలు వుంటూ వచ్చాయి. ఈ వర్గపునాదిప్రాతిపదికపైనే తాను అధికారంలోకిరాక ముందు నుంచి బిజెపినాయకత్వం, సంఘ్‌ పరివార్‌ కూటములుతమ అజెండాలో ప్రధానంగా రెండుఅంశాలను ఉంచుకున్నాయి. ఆ అంశాలు - ఒకటిహిందూత్వ, రెండవది స్వదేశీ. బజెపిఅజెండాలోని ఈ రెండు అంశాల మధ్యవిడదీయరాని సంబంధం ఉందనేదిమనం గమనించాలి. హిందూత్వమతోన్మాద నినాదం ద్వారా, చేష్టల ద్వారావిస్తృత ప్రజారాశుల సెంటిమెంట్లనురెచ్చగొట్టి బిజెపి అధికారంలోకిరాగలిగింది. అయితే ఎజెండాలోని ఈ ఒక్క అంశంద్వారా మాత్రమే ప్రజలను ఎల్ల కాలంతన వెనక ఉంచుకోలేదు. దీనికికారణం పందొమ్మిది వందల తొంబైదశకంలో మన దేశంలో కూడా ఒకపక్కన కొద్ది శాతంగా ఉన్న ధనాఢ్యవర్గా ప్రభావం పెరగటం, రెండవపక్కన అత్యధిక శాతంగా వున్నసామాన్య ప్రజల జీవన స్థితిగతులునిరంతరంగా దిగజారడం జరిగింది. ఈక్రమంలో భాగంగానే బిజెపి వర్గపునాదిలో వున్న రెండు ప్రధానఅంతర్భాగాలైన వ్యాపార వర్గం,మధ్యతరగతి వర్గం కూడా తమశ్రేణులలో చీలికకు గురయ్యాయి. ఎన్ని మాటలుచెప్పినా బిజెపి ప్రభుత్వం కడూసంస్కరణలను మొదట ఆరంభించినకాంగ్రెస్‌ ప్రభుత్వం కంటే కూడామరింత వేగంగా బహుళ జాతి సంస్థలఅనుకూల సరళీకృత ఆర్థిక విధానాలనురెట్టింపు వేగంతో అమలు జరిపింది. దీనివల్ల వ్యాపార వర్గాలలో పైపొర వారు,అందులోను దళారీ వ్యాపార వర్గంవారువందల, వేల కోట్లకు పడగలెత్తి ఒకకులీన వర్గంగా ఎదిగారు. కాగా చిన్నవ్యాపారులు పారిశ్రామికులు అడుగడుగునాబహుళ జాతి సంస్థల పోటీని తట్టుకోలేకకుదేలయ్యారు. వారి ఆర్థిక పరిస్థితిక్షీణించింది. లెక్కకు మించిన సంఖ్యలో చిన్నవ్యాపారులు దెబ్బ తిన్నాయి. అదే విధంగాచిన్నా, మధ్యతరగతిపారిశ్రామికవేత్తలు కూడా నష్టాలపాలయ్యారు. దీనితో బిజెపి వర్గపునాదిలోని ఈవిభాగం వారిలో ఇక ఎంత మాత్రమూ ఒకేరకమైన ఆర్థిక ప్రయోజనాలు ఉండటంఅసాధ్యం. ఇక అలాగే మధ్యతరగతివర్గంలో కూడా లోతైన చీలిక ఏర్పడింది.వాస్తవానికి దశాబ్ద కాలంపైనా జరిగినసంస్కరణల ప్రభావం కింద ఈ వర్గందరిదాపు అంతరించిపోయే పరిస్థితులుతీవ్రంగా ఏర్పడ్డాయి. ఈ వర్గంలోని విద్యాధికవిభాగం వారు సంస్కరణల వల్ల బాగాలాభపడి ఆర్థికంగా పరిపుష్టమై నయాధనవంతుల శ్రేణులలో చేరారు.మరో పక్కన ఉద్యోగస్తులు,మధ్యతరగతి రైతులవంటివారు తమ జీవన పరిస్థితులలోతీవ్రమైన దిగజారుడుకుగురయ్యారు. నేటి మన దేశగ్రామీణ ప్రాంతాల దుస్థితి పెరిగిపోయిననిరుద్యోగం, మూతపడిపోతోన్నప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇవన్నీకలగలిపి మధ్యతరగతిలోని ఒకపెద్ద విభాగాన్ని వీధుల పాలు చేశాయి.కాబట్టి గతంలో సంస్కరణలకుముందు దరిదాపు ఒక తరహా ఆర్థికస్థాయితో పలు సారూప్యతలను కలిగివున్న మధ్యతరగతి వర్గంఇప్పుడు ఆ స్వభావాన్ని కోల్పోయింది. నిలువునాచీలిపోయింది.ఈపరిస్థితిలో బిజెపి వర్గ పునాదిలోనే నేడుసంక్షోభం వుందన్న వాస్తవాన్నిమనం అర్థం చేసుకోవాలి. కాగా బాబ్రీమసీదు కూల్చివేతతో ఆరంభించి తానుహిందూత్వ సెంటిమెంటుతోకూడగట్టిన ప్రజాపునాదినికాపాడుకోగలగాలంటే బిజెపి తనఅజెండాలోని రెండవ అంశమైన స్వదేశీనిఅమలు చేసి ఉండవలసింది. అటువంటిస్వదేశీ నినాదం అమలు ద్వారా మాత్రమేబిజెపి తన పరిపాలనా కాలంలో తనవర్గంలోని చిన్న వ్యాపారులు, పారిశ్రామికులు,మధ్యతరగతి రైతులు, ఉద్యోగులజీవన స్థితిగతులను కాపాడగలిగిఉండేది. అయితే అధికారంలోకి వచ్చినవెనువెంటనే తన వర్గస్వభావందృష్ట్యా సామ్రాజ్యవాదులకు, బహుళ జాతిసంస్థలకు తైనాతీగా మారిన బిజెపిపాలకులు స్వదేశీ నినాదానికి తిలోదకాలుఇచ్చారు. పెట్టుబడులు ఉపసంహరణ మంత్రితన శాఖను ఏర్పరచడం వంటినిర్లజ్జ అయిన తమ చర్యల ద్వారాదేశ స్వావలంబనకు తూట్లు పొడిచారు.అధికారంలోకి రాక ముందు ఎన్రాన్‌సంస్థ విషయంలో కౌంటర్‌ గ్యారంటీలకుసంబంధించి కాంగ్రెస్‌ను విమర్శిస్తూవచ్చిన వాజ్‌పేయి నాయకత్వంలోని బిజెపిప్రభుత్వం గతంలో మొదటి దఫాతాను అధికారంలో వున్న పదమూడురోజుల కాలంలోనే ఎన్రాన్‌కు ఈ కౌంటర్‌గ్యారంటీలను ఇచ్చే ఫైలుపై సంతకంచేయడం ద్వారా తన బహుళజాతిసంస్థల అనుకూల బంట్రోతు గిరిని బయటపెట్టుకుంది.పైవిధంగా స్వదేశీ నినాదానికి స్వయంగాతూట్లు పొడవటం ద్వారా తన అసలుఎజెండా అయిన హిందూత్వకు కూడా బిజెపినాయకత్వం న్యాయం చేయగలపరిస్థితిని చేజార్చుకుంది. తన వర్గపునాదిలోనే వున్న మెజారిటీ విభాగంజీవన స్థితిగతులు రోజురోజుకుదిగజారడానికి కారణమైన ఆర్థికవిధానాలను అనుసరించిన బిజెపి కేవలంసెంటిమెంటు పేరుతో మతోన్మాదాన్నిరెచ్చగొట్టి తన వర్గపునాదిలోనిమెజారిటీ ప్రజలను ఎంతో కాలం కూడగట్టిఉంచుకోలేకపోయింది. ఫలితమే పలుసంవత్సరాల నుంచి సంఘ్‌ పరివార్‌కూటమిలో ఏర్పడుతున్న లుకలుకలు,గోవిందాచార్య వంటి బిజెపి నాయకులుపార్టీకి గుడ్‌బై చెప్పివేయడం,అంతిమంగా ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌బెడిసికొట్టి మొన్నటి లోక్‌సభఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూడటం.ఇకఇప్పుడు నైతిక స్థయిర్యాన్ని కోల్పోయినకోల్పోయిన బిజెపి, సంఘ్‌పరివార్‌ల కూటమిలోలుకలుకలు ఆరంభం కావడంఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.తమ వర్గపునాదిపై పట్టునుకాపాడుకోవాలంటే మౌలిక అంశమైనస్వదేశీకి తిరిగి మళ్లడం మినహాసంఘ్‌పరివార్‌లోని కరడుగట్టినహిందూత్వ శక్తులకు మరోమార్గాంతరం లేకుండా పోయింది. దీనిఫలితమే అద్వానీపై ధ్వజం ఎత్తడంద్వారా పార్టీ నుంచి బహిష్కరణకుగురైన ఉమాభారతి నవంబర్‌పదకొండవ తేదీన అద్వానీకి రాసినలేఖలో తాను ఏ తప్పూ చేయలేదని,సస్పెండ్‌ చేసినా తన దారి, లక్ష్యంమార్చుకోనని, పేదల సంక్షేమమేతన లక్ష్యమని పేర్కొనడం. అలాగేకమ్యూనిస్టులను కాల రాయడం,విదేశీయులను పాలనలోకి రాకుండాచూడట, అందరికీ తిండి దొరికేలా చూడటం,రామభక్తి తన లక్ష్యాలని ఆమెతన లేఖలో పేర్కొనడం. లేఖలోని ఈఅంశాలను పరిశీలిస్తే పేదల సంక్షేమం,అందరికీ తిండి దొరికేలా చేయడం బిజెపిమొదట అధికారంలోకి రానప్పుడుప్రకటించుకున్న ఎజెండాలోని స్వదేశీనినాదానికి సన్నిహితమైనవి. దాని నుంచివిడదీయరానివి. అలాగే ఇక రామభక్తి అనేమాట మత ఛాందస వాదం తాలూకుబిజెపి సంఘ్‌పరివార్‌ల అజెండాలోనిహిందూత్వకు సంబంధించింది. తమఅజెండాలోని ఈ రెండు అంశాలకు పెద్ద పీటవేయడం ద్వారా సామ్రాజ్యవాదులతైనాతీగా వ్యవహరించి బిజెపి కోల్పోయినవర్గ పునాదిని తిరిగి రాబట్టుకొనేందుకు. ఇదిఉమాభారతి వంటి సంఘ్‌ పరివార్‌,బిజెపిలోని వారు చేస్తున్న బ్యాక్‌ టుబేసిక్స్‌ అనే ప్రయత్నం తాలూకుసూచిక.అయితే,బిజెపి కనుక స్వదేశీ పేరిటవ్యవహరిస్తే అది దాని యజమానులు అయినసామ్రాజ్యవాదులకు, వారి బహుళ జాతిసంస్థలకు ఏ మాత్రం అంగీకార యోగ్యంకాదనేది తిరుగులేని వాస్తవం. కాబట్టిఈ పరిస్థితిలో విదేశీ బహుళ జాతి సంస్థలు,సామ్రాజ్యవాద దేశాల ఒత్తిడిని తట్టుకొనిస్వదేశీని అమలు జరపగల సత్తా సంఘ్‌పరివార్‌ కూటమిలోని కరుడుగట్టినఅతివాదులకు సైతం ఉన్నదా అనేది నేడుఅసలు ప్రశ్న. కాగా, తన పార్టీలోనినాయకులనే ఛీత్కరించి బహిష్కరణకుగురైన ఉమాభారతి ఒక్క రోజులోనే శాంతించిమరుసటి రోజున తానే వెళ్లి బిజెపిఅధ్యక్షుడు అద్వానీ, సీనియర్‌ నాయకుడువాజ్‌పేయిలను కలుసుకోవడం బహుశా ఈచిక్కుముడికి అసు జవాబు కావచ్చు.తర్వాత జరిగిన పరిణామాలలో ఉమాభారతిమరింత మెత్తబడినట్లుగాకనబడుతోంది. ఈ నేపథ్యంలోనేప్రపంచీకరణ తర్కానికి, దానికొనసాగింపుకు ఏ బూర్జువా రాజకీయపక్షం అతీతంగావ్యవహరించలేదనేది మనంగమనించాలి. కాగా నేడు కేంద్రంలోవున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడావామపక్షాల మద్దతుతో కొనసాగేపద్ధతి, వామపక్షాల ఒత్తిడి లేకుంటేప్రస్తుత పరిస్థితికి ఏమంత భిన్నంగావ్యవహరించేది కాదు. మించివ్యవహరించగలిగి వుండేది కాదు.ఏదిఏమైనా బిజెపిలోని ఈ లుకలుకలు ఆ పార్టీని ఏ దిశగాతీసుకు వెళ్తాయో వేచి చూడవలసినఅంశం. అయితే బిజెపి, సంఘ్‌ పరివార్‌లకూటములు తమ వర్గపునాదిలోఏర్పడిన చీలిక తాలూకు ప్రతిబింబమైన ఈసంక్షోభాన్ని అట్టే కాలం వాయిదావేయలేవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X