• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిజాంపై పొగడ్తలు: కెసిఆర్ అతి

By కె. నిశాంత్
|


నిజాం నవాబును పొగడ్తలతో ముంచేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు మరో వివాదానికి తెర లేపారు. నిజాం మించిన పాలకుడు లేడని ఆయన అనిపించే ప్రయత్నం చేశారు. చరిత్రలో నిజాంపై అత్యంత నిరంకుశ పాలకుడిగా ముద్ర పడింది. రజాకార్ల ఆగడాల వల్ల నిజాం చరిత్రలో అత్యంత దుర్మార్గుడిగా ఖ్యాతి సాధించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత చారిత్రాత్మక పోరాటంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం పేరు పొందింది. ఈ పోరాటంలో వేలాది మంది మరణించారు. షోయబుల్లా ఖాన్ వంటి ప్రజాస్వామికవాది కూడా హత్యకు గురయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో నిజాంను పూర్తిగా సొంతం చేసుకునే పద్ధతిలో కెసిఆర్ మాట్లాడడం ఎంత వరకు సమంజసం అనేది ప్రశ్న.

నిజాం పాలనకు సంబంధించిన చరిత్ర చీకటి కోణం మాత్రమే చరిత్రలో రికార్డయిందనేది నిజం. నిజాం పాలన అంతంలో రజాకార్ల అరాచాకాలు సాగింది కొద్ది కాలమే అయినా అవి ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి నెమరేసుకుంటే గుండె మండిపోతుంది. పాశవిక హత్యాకాండ సరే, ఆడవాళ్లను నగ్నంగా బతుకమ్మ ఆడించడం, చెరచడం వంటి అనేక దురాగతాలు జరిగాయి. భూమి కోసం బందగీ, చాకలి ఐలమ్మ వంటి వారు చారిత్రాత్మకమైన పోరాటం చేశారు. నిజాం ఏకపక్షంగా పొగడడం వల్ల ప్రజా పోరాట చరిత్రను తక్కువ చేయడమే కాకుండా నిజాం పాలనలోని అరాచకాలను సమర్థించినట్లు కూడా అవుతుంది.

నిజాం హైదరాబాదు ప్రజలకు మంచినీరందించడానికి హుస్సేన్ సాగర్ ను నిర్మించాడు. మంచినీరు సరఫరా చేసి పన్ను వసూలు చేయాలని నిజాం దీని కోసం వేసిన కమిటీ సూచించింది. ప్రకృతి వనరులపై పాలకులకు హక్కు ఉండదని, పన్ను వసూలు తగదని నిజాం అన్నాడు. మంచినీటి వ్యవస్థ నిర్వహణకు ఖర్చవుతుందని, దాన్ని వసూలు చేయడం తప్పేమీ కాదని కమిటీ సభ్యులు సూచించారు. దాంతో ప్రతి వీధిలో నల్లాలు ఏర్పాటు చేయాలని, ఈ వీధి నల్లాల నుంచి నీటిని తీసుకునే వారి నుంచి పన్ను వసూలు చేయకూడదని, ఇళ్లలో నల్లాలు బిగించుకునేవారి నుంచి పన్ను వసూలు చేయాలని చెప్పాడు. ఇది నిజాం ప్రజానుకూల వైఖరికి ఉదాహరణ.

మూసీ నదికి వరదలు వచ్చి తీవ్ర నష్టం వాటిల్లినప్పుడు హిందూ సంప్రదాయంలో పాలకుడు పూజలు చేయాలని ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాన్ని గుర్తించి నిజాం పూజలు చేశాడు. ఇది అతని మతసామరస్యానికి, ప్రజల మనోభీష్టానికి అతను గౌరవించిన తీరుకు ప్రతీక. అలాగే, కాళోజీకి ఒక అజ్ఞాత పోరాట నాయకుడి నుంచి ఉత్తరం వచ్చింది. అది తమ చేతికి చిక్కడంతో పోలీసులు కాళోజీపై కేసు పెట్టారు. ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. లేఖ అందుకున్నవారిది నేరం కాదని, అది రాసిన వారిది నేరమని న్యాయమూర్తి చెబుతూ ఇటువంటి లేఖనే నిజాంకు ఎవరైనా రాస్తే ఏం చేయాలని అడిగారు. ఇది నిజాం పాలనలో చట్టానికి లభించిన గౌరవానికి నిదర్శనం. ప్రజాస్వామిక దృక్పథానికి లభించిన వెసులుబాటుకు గుర్తు.

రైతు సమస్యలపై పొట్లపల్లి రామారావు అనే కవి పాలకుల తీరును విమర్శిస్తూ ఒక కవిత రాశారు. అది నిజాం దృష్టికి వచ్చింది. దాంతో అప్పటి కోత్వాల్ బహదూర్ వెంకటరామిరెడ్డి ద్వారా ఆ కవితను చదివించుకుని రైతుల సమస్యను పరిష్కరించడానికి పూనుకున్నాడు. నిజాంను హత్య చేయడానికి నారాయణరావు పవార్ తదితరులు పథకం పన్ని బాంబులు వేశారు. వారు పోలీసులకు పట్టుబడ్డారు. కేసు విచారణ సమయంలో నిందితులకు ఇష్టమైన న్యాయవాదులను కుదిర్చి పెట్టడానికి నిజాం పాలకులు ముందుకు వచ్చారు. ఇటువంటి సందర్భాల్లో ఇప్పటి పాలకులు ఎలా వ్యవహరిస్తున్నారు, ఇటువంటి విషయాల్లో ఇప్పటి కన్నా నిజాం ఎంత వరకు మెరుగు అని మాట్లాడడం, ఇటువంటి విషయాలను వెలికి తీసి మాట్లాడడం ఇప్పటి తెలంగాణ ఉద్యమానికి అవసరమే. కాకతీయులను పాలకులను ప్రశంసించే విషయంలో సమ్మక్క సారక్కల పోరాటానికి కూడా గౌరవం ఇస్తున్నట్లే నిజాం పాలనలోని చెడును మాత్రమే కాకుండా మంచిని కూడా మాట్లాడే ఒక సంయమన ధోరణి, ఇప్పటి పాలకుల కన్నా నిజాం నయమని చెప్పేందుకు వీలైన వాదన ఇప్పటి తెలంగాణ ఉద్యమానికి అవసరం.

నిజాం ఫ్రాన్స్ నుంచి ఇంజనీర్లను పిలిపించి గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నాడు. ఇప్పటికీ అది పూర్తి కాలేదు. ఇటువంటివన్నింటిని ఉటంకిస్తూ ప్రస్తుత సమైక్యాంధ్రవాదులను ప్రశ్నించాల్సి ఉంది. రజాకార్ల ఆగడాలు పాలనావ్యవహారాలు నిజాం చేతిని దాటిపోయిన సందర్భంలోనే జరిగాయా అనే విషయాన్ని కూడా విశ్లేషింటాల్సి ఉంది. నిజాం పాలనాంతంలో చెలరేగిన నిర్బంధం, అరాచకం వంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిజాంను బాధ్యుడిగా చేయకతప్పదనే విషయాన్ని కూడా కెసిఆర్ గుర్తించాల్సి ఉంటుంది. నిజాం పాలనలోని చీకటి రోజులను అతిగా చేసి చూపడంలో సమైక్యాంధ్రులు కుట్ర ఉండడం నిజమే కావచ్చు, కానీ నిజాం గురించి తెలంగాణవారు మాట్లాడే విషయంలో కూడా ఒక సంయమన, హేతుబద్ధ ధోరణి అవసరమని ఆయన గమనించాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+40313353
CONG+117889
OTH5644100

Arunachal Pradesh

PartyLWT
BJP102030
JDU257
OTH178

Sikkim

PartyLWT
SKM31316
SDF6814
OTH000

Odisha

PartyLWT
BJD1132115
BJP21021
OTH10010

Andhra Pradesh

PartyLWT
YSRCP11139150
TDP61824
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more