వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యపై కెసిఆర్ రుసరుస

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews


తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కార్పోరేట్ విద్యా సంస్థలపై చేసిన తీవ్ర ప్రకటన చాలా మందికి ఆగ్రహం తెప్పించవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర కార్పోరేట్ విద్యా సంస్థలను మూసేస్తామని ఆయన ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. అది సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకమే. అయితే కార్పోరేట్ విద్యా సంస్థలు ప్రవేశపెట్టిన విలువలు మాత్రం దారుణంగా, అత్యంత హేయంగా ఉన్నాయి. విద్యా సంస్థలు మంచి వ్యాపార కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.

కార్పోరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా శ్రీచైతన్య విద్యా సంస్థకు వ్యతిరేకంగా తెరాస విద్యార్థి సంస్థ ఆందోళనలకు దిగింది. హైదరాబాదులో ఆ సంస్థ కార్యకర్తలు శ్రీచైతన్య విద్యా సంస్థలను బాయ్ కాట్ చేయించారు. దిల్ షుక్ నగర్ చౌరస్తాలో రాస్తారోకోకు దిగారు. కరీంనగర్ జిల్లాలోనూ ఆందోళన పెల్లుబుకింది. కార్పోరేట్ విద్యా సంస్థల్లో తెలంగాణకు వ్యతిరేకంగా పాఠాలు చెబుతున్నారనేది ఆందోళనకారుల ఆరోపణ. వారి ఆరోపణల్లో అబద్ధమేమీ లేదు.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన కార్పోరేట్ విద్యా సంస్థలు, ముఖ్యంగా నారాయణ, శ్రీచైతన్య, విజ్ఞాన్ హైదరాబాదులో, హైదరాబాదు చుట్టుపక్కల జడలు విరబోసుకుని విస్తరించాయి. ఎకరాల కొద్దీ భూములను సొంతం చేసుకున్నాయి. ఐఐటి, ఎమ్ సెట్, ఎఐఇఇఇ పేర్లతో అవి కాసుల పంటలను పండించుకుంటున్నాయి. ముఖ్యంగా నారాయణ, శ్రీచైతన్య కళాశాలలు వేలాది మంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఇలా చేర్చుకుంటున్న విద్యార్థులందరికీ వారు చెప్పిన రీతిలోనైనా మంచి ఫలితాలను సాధించి పెట్టగలుగుతున్నాయా అంటే అందులో నిజం లేదని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. బాగా మార్కులు వచ్చే విద్యార్థులను వేరు చేసి ప్రత్యేకంగా ఒక సెక్షనును ఏర్పాటు చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం పరిపాటి అయింది. మిగతా విద్యార్థులు చెల్లించే ఫీజులోని సొమ్ములో చాలా భాగాన్ని 60, 70 మంది ఉండే ఆ ఒక సెక్షన్ మీద ఖర్చు పెడుతున్నారు. విద్యార్థులను ఆ మూడు విభాగాల్లో చేర్చుకుంటున్న సమయంలో ఆయా విద్యార్థులను వ్యక్తిగత ప్రతిభను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీనివల్ల ఒత్తిడి పెరిగి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనాలు అనుభవంలో వస్తూనే ఉన్నాయి. ఒక సెక్షను నుంచి కొద్దిపాటి ర్యాంకులు సాధించి ఆ కార్పోరేట్ కాలేజీలు ఊదరగొడుతున్నాయి. ఆ వ్యాపార ప్రకటనలకు ఆకర్షితులై, తమ పిల్లలు కూడా ఐఐటియన్లు కావాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. వాటిలో తమ పిల్లలను చేర్పించిన తర్వాత వారు అనుభవిస్తున్న మానసిక హింస చెప్పనలవి కాకుండా పోతున్నది. వ్యక్తిగత ప్రతిభను పరిగణనలోకి తీసుకుని కొద్ది మందిని మాత్రమే ఎంపిక చేసుకుని చుక్కా రామయ్య చాలా కాలంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎస్ ఆర్ ఎం స్పెషల్ కోచింగ్ సెంటరు ర్యాంకులు సాధించడం లేదు గానీ ఉత్తమ ఫలితాలనే సాధిస్తున్నది. ఈ బాటను కాసుల వేటలో పడిన ఆంధ్రా కార్పోరేట్ సంస్థలు పట్టించుకోవడం లేదు. పైగా ఇతర ప్రైవేట్ విద్యాసంస్థలను అవి మింగేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని ప్రైవేట్ విద్యా సంస్థలను అవి మింగేశాయి. తెలంగాణలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు పాలకవర్గాలతో లాబీయింగ్ లేకపోవడం, సిలబస్ లాంటి వంటిని ప్రభావితం చేయలేకపోవడం పెద్ద ఆటంకంగా మారింది.

ఆంధ్రకు చెందిన ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి పెద్ద యెత్తున దిగిన వైనం చూస్తే వారి ప్రాబల్యం మనకు అర్థమవుతుంది. రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి అవి ఎదిగిపోయాయి. అందువల్ల అవి సహజంగానే తెరాసకు, తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాయి. అందువల్ల అనివార్య పరిస్థితిలోనే వాటిని చంద్రశేఖర రావు వ్యతిరేకించాల్సి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X