వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ / మా అభిమాన పోర్టల్ లో మీ ఆర్టికల్స్ కు అవకాశం

By Super
|
Google Oneindia TeluguNews

మీరు ఫ్రీలాన్స్ జర్నలిస్టా?
మీకు రాయాలని తపన ఉందా?
మీకెన్నో మంచి ఆలోచనలు ఉన్నాయా? వాటిని నలుగురికీ చెప్పడానికి వేదిక కావాలా?
మంచి రచయిత కావాలన్న మీ ఆకాంక్షకు ఇక్కడ మంచి అవకాశముంది.
ప్రతిభావంతులైన ఔత్సాహిక రచయితలను, బ్లాగర్లను, విద్యార్ధులను మా పాపులర్ పోర్టల్ లో రాయవలసిందిగా వన్ ఇండియా, దట్స్ తెలుగు డాట్ కాం ఆహ్వానిస్తోంది.

దట్స్ తెలుగులో ఫ్లాష్ వార్తలు, ఆలోచన రేకిత్తించే ఫీచర్లు, టాక్ ఆఫ్ టుడే, లోగుట్టు, క్రీడావార్తలు, ఆసక్తికరమైన తెలుగు సినిమా వార్తా విశేషాలు, సినిమా సమీక్షలు, బాలీవుడ్ మసాలా, సాహిత్య వ్యాసాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి.

మాకు రచనలు పంపే ముందు ఈ విషయాలను తెలుసుకోండి:
మీ సొంత రచన: రచనలు ఒరిజినల్ గా ఉండాలి. వార్తా పత్రికలు, వెబ్ సైట్లు, టీవీ, రేడియోల నుంచి కాపీ చేసినవి కాకూడదు. క్లూను ఎక్కడి నుంచైనా తీసుకోండి కానీ మీ సొంత విశ్లేషణ, లాజిక్ మీ ఆర్టికల్ లో కన్పించాలి.

రచనాంశాలు

.వ్యక్తులు (ఆదర్శవ్యక్తులు, వార్తల్లో ఉన్న వ్యక్తుల గురించి రాయవచ్చు)
.ప్రధానాంశాలు ( రవాణా, ఆరోగ్యం, విద్య, పర్యావరణం, ప్రజా సౌకర్యాలు.. ఇటువంటివే ఎన్నైనా)
.ప్రాంతీయ క్రీడలు
.మీ నగరంలో ఈవెంట్స్
.మీ నగరంలో ముఖ్యమైన ప్రదేశాలు
.తేదీల ప్రకారం చారిత్రక సంఘటనల మననం
.విద్యా సంస్ధల, కార్యక్రమాల సమాచారం
.యువతకు సంబంధించిన వార్తలు
.వినోదం- మీరు చూసిన సినిమా సమీక్షను పంపండి
.పోర్టల్ ఎడిటర్ ను సంప్రదించి మీకిష్టమైన ఆర్టికల్ రాయండి

ఇలా చేయకూడదు:
రాజకీయ, క్రైమ్, ఇతర ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు పంపకూడదు.
రచనలో అశ్లీల, అసభ్య పదజాలం ఉపయోగించకూడదు.

ఈ ఫార్మాట్ లో పంపండి:
.ఎలక్ట్రానిక్ కాపీలు మాత్రమే పంపాలి
.మీ ఆర్టికల్స్ తెలుగు భాషలో మాత్రమే ఉండాలి
.యూనికోడ్ ఫాంట్స్ లో తెలుగులో పంపండి. ఈ ఫాంట్స్ ను ఇంటర్నెట్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ విషయంలో సందేహముంటే ఎడిటర్ ను సంప్రదించండి.
.ఆర్టికల్ శీర్షిక ఆరు పదాలకు మించి ఉండకూడదు
.ఆర్టికల్ 600 పదాల లోపు ఉండాలి
.ఆర్టికల్ కు అనుగుణమైన ఫోటోలను మీకు అందుబాటులో ఉంటే పంపవచ్చు.
.కాపీరైట్ లేని ఫోటోలు, బొమ్మలు మాత్రమే తీసుకుంటాం.
.రచయిత స్వయంగా తీసిన ఫోటోలు కూడా పంపవచ్చు.
.అన్ని ఆర్టికల్స్ ను టెక్స్ట్ (*.txt*) డాక్యుమెంట్లుగా ఈమెయిల్ ద్వారా [email protected] కు ఈ సబ్జెక్ట్ లైన్ తో పంపాలి Telugu- itizen Journalism అని.

*షరతులు & నిబంధనలు*
.మీ ఆర్టికల్ ప్రచురించే విషయంలో తుది నిర్ణయం పోర్టల్/ ఎడిటర్ దే
.ఆర్టికల్ ను ఆన్ లైన్ లో ప్రచురించే ముందు ఎడిటర్ సముచితంగా ఎడిటింగ్ చేస్తారు.
.ఆర్టికల్ ను రచయిత పేరుతో ప్రచురిస్తాం. రచయితలు తమ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కూడా పంపవచ్చు. వీలుని బట్టి వాటిని కూడా ప్రచురిస్తాం.
మీకు సందేహాలు ఏమైనా ఉంటే [email protected] ను సంప్రదించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X