హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూముల వల్లనే హైదరాబాద్ వివాదం?

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

Hyderabad
రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాదు వివాదంగా మారడానికి, హైదరాబాదుపై సీమాంధ్రులు పట్టు వీడకపోవడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. ఈ కారణంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. హైదరాబాదును అభివృద్ధి చేశాం కాబట్టి తాము హైదరాబాదుపై హక్కును వదులుకోవడానికి సిద్ధంగా లేమని సీమాంధ్ర రాజకీయ నాయకులు వాదిస్తున్నారు. హైటెక్ సిటీ వంటి అభివృద్ధి హైదరాబాదులో జరిగిన మాట వాస్తవమే. కానీ, విలీనానికి ముందు, విలీనం తర్వాత హైదరాబాదు అభివృద్ధి రేటులో తేడా లేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు హైదరాబాదు దేశంలోని నగరాల్లో ఐదో స్థానంలో ఉంది, ఇప్పుడూ అదే స్థానంలో ఉంది. విలీనం జరగడం వల్లనే హైదరాబాదు అభివృద్ధి చెందిందనే వాదనలో బహుశా పస లేకపోవచ్చు.

ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాల అమలు వేగవంతమైన తర్వాత, నిరర్థక ఆస్తుల అమ్మకం పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేయడం పెంచిన తర్వాత హైదరాబాదు స్వరూప స్వభావాల్లో మార్చు వచ్చింది. హైదరాబాదు, హైదరాబాదు పరిసరాల్లోని స్థానికులు భూములు కోల్పోతూ వచ్చారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు పెద్ద యెత్తున ఈ ప్రాంతాల్లో భూములు స్వాధీనం చేసుకున్నారు. బహుశా, డబ్బులు పెట్టే కొన్నారని కూడా అనుకోవచ్చు. అయితే, ప్రభుత్వ విధానాల్లోని వెసులుబాటును వాడుకుని తక్కువ ధరలకు కూడా చాలా మంది భూములు పొందారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, హైదరాబాదు ఇందులో ఉంటే ఆ భూములు మరోసారి వివాదంగా మారవచ్చు. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుతోనే ముగిసే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూములపై పోరాటాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దాని వల్ల హైదరాబాదు, హైదరాబాదు పరిసరాల్లోని భూముల లెక్కలు తేల్చే పరిస్థితి రావచ్చు. ఎకరాల కొద్ది సొంత చేసుకున్న సీమాంధ్ర రాజకీయ నాయకుల భూములకు ఎసరు రావచ్చు. సీమాంధ్ర రాజకీయ నాయకులకు ఈ భయం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

విశాఖపట్నం, చిత్తూరు వంటి ప్రజలకు హైదరాబాదు అందుబాటులో లేదు. ఆ జిల్లాలకు చెందినవారు ఎంత మంది సామాన్య, పేద ప్రజలు హైదరాబాదును చూశారనే లెక్కలు తీస్తే ఆశ్చర్యకరమైన గణాంకాలే రావచ్చు. హైదరాబాదు పీటముడి సీమాంధ్ర ప్రజల వల్ల కాదు, రాజకీయ నాయకుల వల్లనే అనేది చెప్పకుండానే తెలిసే పరిస్థితి ఉంది.

English summary
Lands may be main aspect for becoming Hyderabad a hurdle to form Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X