వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్సార్ - కర్మయోగి, కారణ జన్ముడు, స్థితప్రజ్ఞుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
వైఎస్ రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) గారు గతించి ఈ రోజుకి మూడో సంవత్సరం. ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం ఎంత అల్లకల్లోలం అయిందో అని చూస్తుంటేనె గుండెలు తరుక్కుపోతున్నాయి రాస్ట్ర ప్రజలకి. 2004 ఎన్నికల సందర్భంగా దక్కన్ క్రానికల్ లో ఒక జ్యోతిష్యుడు వివిధ అభ్యర్ధుల బలాబలాల గురించి వారి వారి జాతకం బట్టి విశ్లేషించేవారు. అందులో ఓసారి వైఎస్సార్ గురించి వేశారు. అయన అధికారం లోకి వచ్చే టైం దగ్గర పడింది అని, ఆయనకు అరవై ఏళ్ళు వచ్చేంతవరకు ఏలుతారు అని చెప్పారు. అరవై దాటిన తర్వాత రాజకీయ రంగం నుండి ఆయన వెళ్ళిపోతారు అని, అస్సలు ఆయన మొత్తంగా రిటైర్ అవుతారు అని రాసారు. అది ప్రచురితం అయినప్పడు ఆయన ఎలా రిటైర్ అవుతారని అందరూ అనుకున్నారు. వైఎస్సార్ అన్న మాట 'అరవై ఏళ్ళ తర్వాత తాను రాజకీయాలలో ఉండను' అందరూ గుర్తుచేసుకున్నారు. చాలా మంది అనుకున్నాం ఆయన రిటైర్ అవుతారు అని. కాని ఇలా జరుగుతుంది అనుకోలేదు.

వైఎస్సార్ గారు మతానికి క్రిస్టియన్ అయినా ఆయన అన్ని మతాల పట్ల సమాన గౌరవం కలిగినవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనది ప్రజామతం. 2004 ఎన్నికల సందర్భంగా సుదర్శన యాగం చేసారు తిరుపతిలో. అలాగే పాదయాత్ర తర్వాత ఏడుకొండలు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు . వాళ్ళ తాతగారు మతం మారకమునుపు వారి కుల దైవం తిరుమల వెంకన్నే. ఎవరో జ్యోతిష్యుడు వైఎస్సార్‌కే చెప్పినట్లు వున్నారు - అరవై తర్వాత ఇంక తను ఉండరు అని. అందుకే ఆయన అరవై తర్వాత ఉండను అని చెప్పేవారు. అందుకే వున్న అయిదు సంవత్సరాల లోనే అన్ని కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. భారత దేశానికే పరిపాలనలో ఒక దార్శనీకతను ఏర్పరిచారు. నిజంగా ఆయన ఒక కర్మ యోగి. కారణ జన్ముడు. తను ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళారు. బహుశా తన అంతం కూడా ముందే తెలిసిన వారు. అందుకే ఏ నాడు మరణం గురించి గాని , తను చేసే పని గురించి కాని ఎటువంటి సందేహం లేకుండా వుండే వారు. అంతటి స్థిత ప్రజ్ఞుడు మళ్ళీ పుడతారు అని నేననుకోను.

ఆయన చనిపోయినప్పుడు తెలుగు ప్రజలంతా గుండెలవిసేలా ఏడ్చారు. ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని ఆయన కుమారుడు జగన్ ఓదారుస్తున్నాడు, అక్కున చేర్చుకుంటున్నాడు. వైఎస్సార్ ఈరొజు ప్రతి పల్లెలో, ప్రతి బజార్లో ఉన్నారు ఆయనను ప్రేమించే ప్రజలమధ్యన. వైఎస్సార్ ఒక గొప్ప కుటుంబ వ్యక్తి. ఎప్పుడు తన భార్య, పిల్లలతో తీరిక సమయాన్ని గడిపిన విషయం మనందరికి తెలుసు. ఆయన పోయాక తల్లడిల్లి పూయిన విజయమ్మ గారిని అందరం చూసాము, తండ్రి కోసం మాటిచ్చి, నిలబెట్టుకోవడానికి తపించే కొడుకు జగన్ని చూస్తున్నాము. వైఎస్సార్ని ఆయన కుటుంబం ఎంత ప్రేమిస్తుందో మనకర్దమవుతుంది. ఇంటా బయటా అందరూ ఆయన్ని అందరూ ప్రేమించారు, ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటారు. గొప్ప వ్యక్తులకే ఇది సాధ్యం. వైఎస్సార్ చావులో కూడా ఆ దేవుడు మనందరికీ ఆయన పార్థివ శరీరాన్ని, ఆ చెరిగిపోయిన నవ్వుని చూపించకుండా ఆ నవ్వే మారాజునే మిగిల్చాడు. ఆ మనిషి పోయేటప్పుడు కూడా త్ర్రునధాన్య శాస్త్రజ్ఞులకి ఇచ్చిన మాట ప్రకారం కొర్రన్నం తన భోజనంగా తీసికెళ్ళిన మాట తప్పని జననేత ఆయన. కాకిలా వందేళ్ళు బ్రతికేకంటే వైఎస్సార్లా అరవయ్యేళ్ళు బ్రతికితే చాలదా?

వైఎస్సార్ ధన్యజీవి. ప్రజలకోసం పుట్టి ప్రజల మధ్య జీవించి ప్రజల కోసం రచ్చబండకి వెళ్తూ ప్రమాదంలో చనిపోయిన వైఎస్సార్ జన్మ సార్ధకం. ఆయనని అమితంగా ప్రేమించే కోట్లాది మందికి, జీవితంలో ఒకసారి ఆయన్ని కలవడమే వరంలా భావించేవాల్లకి ఆయన ఒక కర్మయోగి, ఒక కారణజన్ముడు, ఒక స్థితప్రజ్ఞుడు.

గురవారెడ్డి, అట్లాంటా, అమెరికా (వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ)

English summary
NRI from USA Guruva Reddy writes his opinion on late YS Rajasekhar Reddy's qualities. He pays homage to YS Rajasekhar Reddy on the occasion of death anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X