వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలోనే భారతదేశంలో 29వ రాష్ట్రం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌పై 60ఏళ్లపాటు ప్రయోగాలు జరిపి విఫలమైన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను గుర్తించింది. ప్రపంచలో ఏ గొప్ప ఉద్యమానికి తీసిపోని విధంగా రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారు. ఈ శతాబ్ధంలో జరిగిన గొప్ప శాంతియుత ఉద్యమంగా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలమని సీమాంధ్ర రాజకీయ నాయకులు చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందో.. వారు చేసిన ప్రకటనలను మరిచి సీమాంధ్ర రాజకీయ నాయకులందరూ తెలంగాణపై యూటర్న్ తీసుకున్నారు.

ఇటీవల ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోబాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు పొద్దున లేస్తే ఆంధ్రా హోటళ్లలో టిఫిన్ తినలా, పొద్దున లేస్తేనే ఆంధ్రా పాఠశాలల్లో చదువాలా, తెలంగాణ ప్రజలకు జబ్బు చేస్తే ఆంధ్రా వైద్యులు చూడలి అని అన్నారు.

Telangana

ఎన్నో శతాబ్ధాల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ వీళ్లు(ఆంధ్రావాళ్లు) రాకముందు ఉపవాసం ఉందా?, వీరు పెట్టిన టిఫిన్ సెంటర్లు, హోటళ్లపై ఆధారపడాల్సిన అవసరం మహా నగరానికి ఏ మాత్రం లేదు. విద్యా విషయంలోనూ అశోక్‌బాబు మాట్లాడిన మాటలు ఘోరమైన తప్పిదాలు మాత్రమే. తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ, కేంద్రీయ విశ్వ విద్యాలయాలు తెలంగాణ ప్రజలకు విద్యనందించడంలో గర్వించే స్థాయిలో ఉన్నాయి. గ్రామర్ స్కూల్స్, మిషనరీ స్కూల్స్ తమ సేవలను అందిస్తున్నాయి. అంతేగానీ ఈ ఆంధ్రా పాలకుల దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆధారపడలేదు.

తెలంగాణ ప్రజలకు ఆంధ్రా వైద్యంపై అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అశోక్ బాబుకు తెలియనట్లుంది.. తెలంగాణ, ఆంధ్రాతో కలవకముందు నుంచే గొప్ప వైద్యశాలలుగా వెలుగొందుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు నగరంలో నెలకొని ఉన్నాయి. అశోక్ బాబు తన వ్యాఖ్యల ద్వారా ఆంధ్రావారిపై తెలంగాణ ప్రజలు ఆధారపడుతున్నట్లు తెలిపే ప్రయత్నం చేశారు. ఇది అతని దురాహంకారానికి నిదర్శనం మాత్రమే.

ఆయన ప్రసంగంలో అశోక్ బాబు తెలిపిన కొత్తి విషయాలేమి లేవు. ఇలాంటి వారి దురాహంకార వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఎప్పట్నుంచో ఎదుర్కొన్నారు. మేమే తెలంగాణ వాళ్లకు వ్యవసాయం నేర్పాము, మేమే వీరికి నాగరికత నేర్పాము అనే వాటిలో కొన్ని. అయితే వాస్తవానికి 1956 కంటే ముందే హైదరాబాద్ నగరం దేశంలోనే సుసంపన్న నగరంగా వెలుగొందింది. ఇలాంటి దురాహంకార వ్యాఖ్యలే తెలంగాణ ఉద్యమానికి కారణాలుగా నిలిచాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి ఉన్న 9ఏళ్లలో ఆంధ్రా ప్రాంతం పట్ల తీవ్ర పక్షపాతమే చూపారు. ఆయన పాలనలో తెలంగాణ ప్రజలు తమ సొంత రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల ఉద్యమం గురించి ఏనాడూ మాట్లాడలేదు. తెలంగాణ కోసం వేలాది మంది పౌరులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారికి సంఘీభావం కూడా తెలియజేయలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన 42రోజులపాటు సకల జనుల సమ్మెతో ప్రజా రవాణా, ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చంద్రబాబు హృదయం కరగలేదు.

ప్రస్తుతం సీమాంధ్రలో చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మాత్రం చంద్రబాబు తన పూర్తి మద్దతును తెలుపుతున్నాడు. సమైక్య ఉద్యమం గురించి ఆలోచిస్తూ తాను నిద్రపోవడం లేదని ప్రకటించిన చంద్రబాబుకు తెలంగాణలో ఉద్యమం జరిగినన్ని రోజులు నిద్ర పట్టలేదమో. ఇలాంటి పక్షపాత దోరణులే కేంద్రానికి కనువిప్పు కలిగించినట్లున్నాయి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఏర్పాటు సమయంలో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. తనకు తెలంగాణను ఏర్పాటు చేసే శక్తిగానీ, అడ్డుకునే శక్తి గానీ లేదని చెప్పాడు. అది కేంద్రం చేతిలో ఉందని పేర్కొన్నాడు. అయితే కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీకుసుకున్న తర్వాత ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది జగన్ పార్టీ. ప్రస్తుతం తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని చెబుతున్నాడు.
అందుకోసం సమైక్య సభలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎన్నోసార్లు బహిరంగ సభలలో తెలిపాడు. తెలంగాణ తన చేతిలో లేదని కేంద్రం పరిశీలించిన తర్వాత సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని గతంలో చెప్పాడు. ఎప్పుడైతే తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందో.. అప్పటి నుంచి తాను సమైక్యవాదినని ప్రకటించుకున్నాడు. తాను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రినని, రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు కృషి చేస్తానని ప్రకటించాడు. రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు జరుగుతాయని కొత్త వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రపంచంలోని పలు దేశాల మధ్య శాంతియుతంగా నీటి పంపకాలు జరుగుతున్నప్పుడు ఒక దేశంలోని రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి యుద్ధాలు ఎలా జరుగుతాయో కిరణ్‌కే తెలియాలి.

సీమాంధ్ర నాయకులందరి నాటకాలను పరిశీలించిన కేంద్రానికి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా నష్టపోతున్న విషయంపై స్పష్టత వచ్చినట్లుంది. అందుకే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్రం ప్రక్రియను వేగవంతం చేసింది. ఇరు ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు విభజన వల్ల ఎలాంటి నష్టం లేకున్నా కొందరు పెట్టుబడిదారులు, ఆక్రమణదారులు తమ స్వార్థ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని విభజనను వ్యతిరేకిస్తున్నారు.

విభజనతో రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, ఒంగోలు లేదా విజయవాడలను సీమాంధ్ర రాజధానిగా ప్రకటిస్తే దక్షిణ భారతదేశంలో అవి కూడా గొప్ప నగరాలుగా రూపుదిద్దుకుంటాయి. విభజనతో సామాన్య ప్రజలకు వచ్చే లాభాలను పరిగణలోకి తీసుకోకుండా విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దురదృష్టకరం.

కేంద్ర ప్రభుత్వం విశాల దృక్పథంలో ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం మాని, ఈ నిర్ణయం వల్ల పొందే లాభాలపై సీమాంధ్ర నాయకులు దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుంది. కొంతమంది స్వార్థపరుల ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్రం త్వరితగతిన చేపట్టాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

-నాగేందర్ చిందం

English summary
After 60 long years of miserably failed experiment of Andhra Pradesh, Center has realized the importance of Telangana state formation. Telangana revolution is nothing less than any sort of great revolutions this world has seen, probably the most peaceful revolution of this century.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X