• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లైంగిక వివక్ష: నిన్న స్మితా సబర్వాల్, నేడు వనజాక్షి

By Pratap
|

హైదరాబాద్: ఆధునిక సమాజంలోకి అడుగు పెట్టామని విర్రవీగుతున్నప్పటికీ మానవ ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పడానికి నిన్నటి స్మిత సబర్వాల్, నేటి వనజాక్షి ఉదంతాలే నిదర్శనం. మహిళా అధికారులు అదనంగా లైంగిక వివక్షను ఎదుర్కుంటున్న వైనం ఈ రెండు ఉదంతాలు బయటపెడుతున్నాయి. స్మితా సబర్వాల్ మహిళా అధికారి కాకుండా ఉంటే ఔట్‌లుక్ పత్రిక అటువంటి అసభ్యకరమైన కార్టూన్ వేసి, వ్యంగ్య రాత రాసి ఉండేదా అనేది ప్రశ్న.

శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై అంత దురుసుగా ప్రవర్తించి ఉండేవారా అనేది కూడా ప్రశ్ననే. ఆమెపై దాడి చేయించడమే కాకుండా ఆమె కుటుంబంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. మహిళ కాబట్టే కుటుంబసభ్యులపై, ఆమె వ్యక్తిత్వంపై చింతమనేని ప్రభాకర్ అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనేది వేరుగా చెప్పనక్కరలేదు.

సమాజానికి దారి చూపాల్సిన ఓ పత్రిక స్మిత సబర్వాల్‌పై అత్యంత దారుణంగా వ్యవహరించింది. పైగా, తామేమీ తప్పు చేయలేదన్నట్లుగా బుకాయించే ప్రయత్నం చేసింది. తాము వ్యంగ్యం రాస్తుంటామని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, ఎవరైనా బాధపడితే విచారం వ్యక్తం చేస్తున్నామని అత్యంత నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చింది. జీన్స్ ధరించిన స్మితా సబర్వాల్ ర్యాంప్‌పై నడుస్తుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫొటో తీస్తున్నట్లుగా, మిగతా మంత్రులు ఆసక్తిగా చూస్తున్నట్లుగా కార్టూన్‌ను ప్రచురించి, ఆ పత్రిక వ్యంగ్యమైన కథనం రాసింది.

K Nishanth: vanajakshi faces gender discriminations after Smita Sabharwal

స్మితా సబర్వాల్‌కు అధికారిగా మంచి పేరుంది. ఆమె పనితీరు, సమర్థత కారణంగానే ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చారు. కానీ, దానికి మరో అర్థం వచ్చే విధంగా, మహిళ కాబట్టే ఆమె ఆ స్థాయికి వచ్చినట్లుగా ఆ పత్రిక ఆచరణ చూపిస్తోంది. మహిళ కాకపోతే అటువంటి కార్టూన్ గానీ, అటువంటి వ్యంగ్య కథనం గానీ పత్రి రాసి ఉండేదా అనేది ప్రశ్న. లైంగిక వివక్ష కోణం అందులో స్పష్టంగా కనిపిస్తోంది.

అలాగే, వనజాక్షి వ్యవహారం. ధైర్యం చేసి, చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నించిన వనజాక్షి పట్ల శాసనసభ్యుడు, ఆయన అనుచురులు వ్యవహరించిన తీరు లైంగిక వివక్షను బయటపెడుతుంది. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యలు అదే విషయాన్ని పట్టిస్తున్నాయి. మహిళలను కించపరచాలంటే, వారిని ముందుకు సాగనీయకూడదంటే వారి వ్యక్తిత్వంపై మచ్చలు వేస్తే చాలుననే విషయం నాగరికులకు తెలుసు. అందుకే చింతమనేని, ఆయన అనుచరులు అత్యంత దారుణంగా వ్యవహరించారని చెప్పవచ్చు.

వనజాక్షి దాడి విషయంలో మరో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఎదురు కేసులు పెట్టడం. ఓ మహిళా అధికారిపై తోటి మహిళలనే ప్రేరేపించిన వైనం చింతమనేని వ్యవహారశైలికి అద్దం పడుతుంది. డ్వాక్రా మహిళలతో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పైగా, వనజాక్షిని చింతమనేనితో రాజీకి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించడం మరో కోణం. మొత్తం మీద, మహిళా అధికారులే ఈ విధమైన దాడులను ఎదుర్కుంటున్న స్థితిలో సామాన్య మహిళల స్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమే అవుతున్నది.

- కె. నిశాంత్

English summary
K Nishanth says as women officers Smita Sabharwal and Vanajakshi faced gener descrimination in Telangana and Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X