వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మల్కాజిగి లోకసభ సీటు: జెపితో నాగేశ్వర్ ఢీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nageswar to face JP in Mallagigiri
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ స్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైన స్థానంగా మారుతోంది. మేధావులుగా పేరుపడిన ఇద్దరి సమరానికి వేదికగా మారుతోంది. మేధావిగా పేరుబడిన లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, తెలంగాణకు చెందిన మేధావిగా గుర్తింపు సాధించిన ఎమ్మెల్సీ కే నాగేశ్వర్ మధ్య పోటీ జరిగే అవకాశాలున్నాయి.

తనకు లోక్‌సభకుపోటీచేసే యోచన ఉందని, ఒక వేళ చేయాల్సి వస్తే మల్కాజిగిరి నియోజకవర్గంనుంచే బరిలోకి దిగుతానని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్‌నారాయణ్ (జేపీ) స్పష్ట్టం చేశారు. తాను ఢిల్లీలో ఉంటే దేశ స్థాయిలో మరిన్ని మార్పులు, సంస్కరణలకు దోహదపడవచ్చని తన అభిమానులు, మరికొందరు సూచిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఒక్క పార్లమెంటు స్థానం కూడా తమ పార్టీకి లేకుండానే దేశంలో 9 చట్టాల ఏర్పాటుకు లోక్‌సత్తా కారణమైందని ఆయన చెప్పారు.

మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకిదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన బరిలో దిగితే నాగేశ్వర్‌కు మద్దతివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆనందకుమార్ నాగేశ్వర్‌కు ఫోన్ చేసి మల్కాజిగిరి నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ ప్రతిపాదించినట్లు తెలిసింది. దానికి ఆయన నిరాకరిస్తూ ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగుతానని చెప్పినట్లు సమాచారం. స్వతంత్రంగా బరిలోకి దిగినా నాగేశ్వర్‌కు మద్దతివ్వాలని ఏఏపీ నిర్ణయించినట్లు తెలిసింది.

ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు లభిస్తే నాగేశ్వర్‌కు నైతికంగా మంచి బలం చేకూరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జెపి, నాగేశ్వర్ మల్కాజిగిరి బరిలోకి దిగిన పక్షంలో మేధావుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. నాగేశ్వర్ రావుకు వామపక్షాల మద్దతు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుడిగా నాగేశ్వర్ మంచి గుర్తింపు పొందారు.

English summary
MLC Nageswar may fight against Loksatta leader Jayaprakash Narayana at Malkagigiri loksabha seat with the help of Aam Aadmi parti and left.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X