వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిత్వ వికాసం: వ్యక్తులుగా సాధించలేనిది...

By Pratap
|
Google Oneindia TeluguNews

నేడు సైన్స్‌ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆధునిక విద్యా విధానాలు, జీవన ప్రమాణాలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. అందరికీ ఇవి అందించడం అవసరం. అందరికీ వీటి ఫలాలను అందిస్తే కేవలం రోజుకు రెండు గంటలు పనిచేస్తే ప్రపంచంలోని 700 కోట్ల జనాభా నేటి ప్రభుత్వ డిగ్రీ కాలేజి లెక్చరర్‌ స్థాయిలో జీవించవచ్చు. అంతగా సైన్స్‌ అభివృద్ధి చెందింది. సి.కె.ప్రహ్లాద్‌ సైన్స్‌, ఉత్పత్తి, ప్రమాణాలు ఇలాగే సాగితే మూడింట రెండు వంతుల ప్రపంచ జనాభా ఇలాగే పేదరికంలో ఉంటుంది అని ఫార్చూన్స్‌ ఎట్‌ ది బాటమ్‌ ఆఫ్‌ పిరమిడ్‌ గ్రంథంలో స్పష్టం చేశారు.

సైన్స్‌ ఎంత ఎదిగినా మూడింట రెండువంతుల జనాభా ఇంకా వందేళ్ళ వెనుకబాటుతో జీవిస్తోంది. ఆయుధాల ఉత్పత్తికి, రక్షణ పేరిట, మద్యం పేరిట, యుద్ధాల పేరిట 30 శాతం జాతీయ ఆదాయం దుర్వినియోగం అవుతున్నది. 5 శాతం ఈ ఖర్చు తగ్గిస్తే దేశంలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు రెట్టింపు చేయవచ్చు. వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక వికాసానికి మధ్య ఇలా అంతర్గత సంబంధం ఉందని గుర్తించడం అవసరం. అప్పుడే వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక వికాసం ఎంతో అవసరమని, సామాజిక వికాసం లక్ష్యంగా వ్యక్తులు, సమాజాలు, మహిళలు, వర్గాలు, కులాలు, దేశాలు, ముందుకు సాగడం సాధ్యపడుతుంది. ఆఫ్రికా, ఇండియా, ఆసియా, దక్షిణ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సామాజిక ఉద్యమాల అవసరం ఎంతో ఉంది. రాజకీయ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి.

Personality development: BS Ramulu stresses the need of technology

సంస్థ, సంఘం, ట్రేడ్‌ యూనియన్‌, ఉద్యమం అనేవి వెనుకబడిన చైతన్యానికి, ముందు చూపుగల చైతన్యానికి మధ్య ఐక్య సంఘటన.

వ్యక్తులుగా సాధించడం అనేది వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత విజయం. వ్యక్తులు సంఘటితమై, సంస్థలుగా, సంఘాలుగా, ఉద్యమాలుగా, సామూహిక శక్తిగా, బలమైన సామాజిక శక్తిగా ముందుకు సాగినపుడు సమాజాలు కదల బారతాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అనేక పరిణామాలు, మార్పులు హింసాయుతంగా, అహింసాయుతంగా, శాంతియుతంగా, కల్లోలభరితంగా ఇంకా అనేక విధాలుగా వచ్చిన మార్పులు, పరిణామాలు అన్నీ సామాజిక శక్తులుగా ప్రజలు, ఉద్యమాలు ముందుకు సాగినప్పుడు సాధ్యమయ్యాయి. వ్యక్తిగా సాధించలేనివన్నీ సంఘటితంగా సాధించుకోవడం జరుగుతుంది.
సైన్స్‌ ఆవిష్కరణలు, వాటి ఫలాలు అందుబాటులోకి రావడానికి ఉద్యమాల ఆవశ్యకత పెరుగుతుంది. ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలకు వాటిని అందించే, విస్తరించే కృషి చేయకపోతే ఉద్యమాల ద్వారా ప్రజలు సాధించు కుంటారు. ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు స్వయంగా అందిస్తే, సామాజిక పరిణామం శాంతియుతంగా సాగుతుంది.

16 గంటల పని విధానం నుండి 8 గంటల పని విధానాన్ని ఎన్నో పోరాటాల ద్వారా రక్తతర్పణల ద్వారా సాధించుకోవడం జరిగింది. అలా ప్రావిడెంట్‌ ఫండ్‌, సెలవులు, పిల్లలకు ఫీజులు, పెన్షన్‌, ప్రసూతి సెలవులు, ప్రభుత్వ వసతి, పరిశ్రమలే గృహవసతి కల్పించడం, ఆరోగ్య భీమా మొదలైనవి సాధించుకోబడ్డాయి. ఇవేవి వ్యక్తులుగా సాధించుకోగలిగేవి కావు. 1967లో ఫ్రాన్స్‌లో విద్యార్ధులు ఉద్యమించి ప్రభుత్వాలను మార్చారు. ఇటీవల ఈజిప్టు దేశాల్లో ప్రజలు ఇంటర్నెట్‌ సౌకర్యంతో ఉద్యమించారు. ప్రభుత్వా లను మార్చుకున్నారు.

ఉద్యమాల ద్వారానే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఉద్యమాలు చేయకుండా ఉండిపోతే అభివృద్ధి ఫలాలు కొందరివద్దే ఆగిపోతాయి. వ్యక్తిత్వ వికాసంలో సామాజిక చైతన్యం, సామాజిక ఉద్యమాల ప్రాధాన్యత గుర్తించినపుడు సమగ్ర వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది.

English summary
An eminent writer BS Ramulu asks whether the development equally distributed among all the sections with modern technology?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X