వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవితం - లక్ష్యాలు: పాదముద్రలే మరుజన్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్ష్యంతో సాగేవారు గమ్యం చేరతారు. ఎందుకంటే ఎక్కడికి పోతు న్నారో వారికి తెలుసు. 'గోల్స్‌ ఆర్‌ డ్రీమ్స్‌ విత్‌ డెడ్‌లైన్స్‌'... అని అంటారు. ప్లాన్‌ లేకుండా లక్ష్యం గురించి కలలు కంటే అది ఒక ఆశ మాత్రమే.

జీవితంలో, వ్యక్తిత్వ వికాసంలో, లక్ష్యాల్లో, సంస్కృతి, విలువలు, విశ్వాసాలు ప్రధానపాత్ర వహిస్తాయి. ఆ తర్వాత ఆత్మ విశ్వాసం, మానవ ప్రయత్నం, సాహసం, ధైర్యం, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం మొద లైనవి విజయాలను, వైఫల్యాలను నిర్దేశిస్తాయి.

జీవితమంటే ఏమిటి అనేది ఒక తాత్విక ప్రశ్న. అలాగే అది నిత్యజీవిత సమస్య కూడా. జీవితం ఎలా వుండాలి అనే ప్రశ్నకు... అనేకమంది అనేక రకాల సూచనలు చేశారు. వీరిలో తల్లిదండ్రులున్నారు, పెద్దలున్నారు, మత పెద్దలున్నారు. తత్వవేత్తలున్నారు. సైకాలజిస్టులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఉన్నారు. సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారు. పౌరనీతి శాస్త్రజ్ఞులు వున్నారు.

ఒక సూర్యుండు సమస్థ జీవులకు తానొక్కక్కడై తోచు...

Personality development: Life and aims

ప్రశ్నకు నైతిక విలువల కోణంలో చెప్పారు. కుటుంబ కోణంలో చెప్పారు. కులం కోణంలో చెప్పారు. వర్గం కోణంలో చెప్పారు. సమాజ కోణంలో చెప్పారు. రాజకీయ కోణంలో చెప్పారు. సుఖదుఖ్ఖాల కోణంలో చెప్పారు. అరిషడ్వర్గాల కోణంలో చెప్పారు. అష్టేంద్రియాల కోణంలో చెప్పారు. జీవిత ప్రమాణాల కోణంలో చెప్పారు. సైన్సు కోణంలో చెప్పారు. కళల కోణంలో చెప్పారు. సంస్కృతి కోణంలో చెప్పారు. తాత్విక కోణంలో చెప్పారు. సైకాలజీ కోణంలో చెప్పారు.

జీవితానికి అనేక పార్శ్వాలు

జీవితానికి అనేక పార్శ్వాలున్నాయి. వ్యక్తిగత జీవితంలో బాల్యం- యవ్వనం- వృద్ధాప్యం. చదువు-ఉద్యోగం-వృత్తి. పెళ్లి-భార్య-భర్త-పిల్లలు. సామాజిక జీవితంలో మనిషి ఒక సభ్యుడు. పౌరసమాజంలో మనిషి ఒక పౌరుడు. కుటుంబంలో ఒక తల్లి. ఒక తండ్రి. ఒక కొడుకు. ఒక కూతురు.

జీవితాన్ని రెండు థలుగా లేదా రెండు భాగాలుగా చెప్పారు. ఒకటి - వ్యక్తిగత జీవితం. కుటుంబ జీవితం. రెండు - సామాజిక జీవితం. రాజకీయ జీవితం. ప్రైవేట్‌ లైఫ్‌లో ప్రైవసీ ఉంటుంది. మనిషి ఇష్టాయిష్టాలు మొదలుకొని కాలకృత్యాల దాకా... కుటుంబ జీవితం, గృహస్థ జీవితం ప్రైవేట్‌ లైఫ్‌గా భాగించారు. కడపదాటిన తర్వాతి జీవితమంతా పబ్లిక్‌ లైఫ్‌ అని భాగించారు. ప్రైవేట్‌ లైఫ్‌ కూడా పబ్లిక్‌ లైఫ్‌లో భాగమే. పబ్లిక్‌ లైఫ్‌ కూడా ప్రైవేట్‌ లైఫ్‌ కోసమే. ఏదీ విడిగా వుండదు. బెడ్రూమ్‌లోకి రాకూడదు అనేది ప్రైవసీ. డ్రాయింగ్‌ రూమ్‌ ప్రైవేట్‌ లైఫ్‌లో చిన్న పబ్లిక్‌ లైఫ్‌. మిగతా ఇల్లంతా ప్రైవేట్‌ లైఫ్‌.

వ్యక్తిగత జీవితంలో రహస్యాలుంటాయి. భార్యభర్తల పోట్లాటలు రహస్యం. కుటుంబ కలహాలు రహస్యం. బ్యాంకు బ్యాలెన్సులు రహస్యం. అందులోకి ఇతరులు చొరబడకూడదు. లోగుట్లు అన్నీ అందరికీ తెలియాల్సిన అవసరంలేదు. గృహస్థు జీవితం, కుటుంబం ప్రైవేట్‌ లైఫ్‌లో ఒక దేశం.

ఆనందంగా జీవించాలి. కష్టపడి జీవించాలి.

జీవితాన్ని ఆనందంగా జీవించాలి. కష్టపడి జీవించాలి. పరోపకారం చేస్తూ జీవించాలి. అమ్మా నాన్నలను గౌరవిస్తూ జీవించాలి. పెళ్లి చేసుకుని జీవించాలి. పిల్లల్ని పెంచి పోషిస్తూ జీవించాలి. కుటుంబంగా జీవించాలి. సామాజికంగా జీవించాలి. బౌద్ధ భికక్షువుగా జీవించాలి. ప్రజలకోసం జీవించాలి. తన కోసం జీవించాలి. తనవారికోసం జీవించాలి.

ఎందుకు జీవించాలంటే పుట్టాం కనుక జీవించాలి. జీవించడం ప్రాణి లక్షణం కనక జీవించాలి. రాజకీయంగా జీవించాలి. భావజాలంగా జీవించాలి. బాధ్యతగా జీవించాలి. కర్తవ్యంగా జీవించాలి. కొన్ని లక్ష్యాలతో జీవించాలి. ఆశతో జీవించాలి. సాహసంతో జీవించాలి. ధైర్యంగా జీవించాలి. పాజిటివ్‌ దృక్పథంతో జీవించాలి. చర్య, ప్రతి చర్య ప్రభావాలకు అతీతంగా లక్ష్యాలతో, వ్యక్తిత్వ వికాసంతో జీవించాలి. వాస్తవాలతో జీవించాలి. అనుభవం, అభిప్రాయాలు, అధ్యయనం, పాఠాలు నేర్పితే ప్యారడైమ్‌ షిప్ట్‌తో జీవితంలో మలుపులు తీసుకుంటూ ముందుకు సాగాలి.

అందరి తలలో నాలుకలా జీవించాలి. సమాజంలో భాగంగా జీవించాలి. సమాజాన్ని మార్చుతూ జీవించాలి. సమాజానికి ముందు నడుస్తూ జీవించాలి. స్వేచ్ఛాసమానత్వంతో జీవించాలి. ఆత్మగౌరవంతో జీవించాలి. సస్నేహంగా జీవించాలి. ఆదర్శవంతంగా జీవించాలి. ఆదర్శవంతమైన లక్ష్యాలతో జీవించాలి. జీవితానికి సార్ధకత ఉండాలి.

నువ్వు బస్సులా జీవించాలి. రైలులా జీవించాలి. విమానంలా జీవించాలి. వానలా జీవించాలి. గాలిలా జీవించాలి. రుతువులా జీవించాలి. ప్రకృతికి పచ్చని రంగేసే ఎండలా జీవించాలి.

ఎగిరే పక్షిలా, పూసే పువ్వులా...

నువ్వు ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా జీవించాలి. మొగ్గ తనంత తానే పూసే పువ్వులా ఎదగాలి. చుట్టూ సౌరభం వెదజల్లాలి. వేళ్లూనుకున్న చెట్టులా జీవించాలి. పండిన చెట్టులా జీవించాలి. చెట్టులా పాత ఆకులు రాల్చుకుంటూ జీవించాలి. కొత్తచిగుర్లు వేసుకుంటూ జీవించాలి. చెట్టులా నిత్యనూతనంగా జీవించాలి. పూలతీగలా జీవించాలి. నదిలా జీవించాలి. నదీజలపాతంలా జీవించాలి. సముద్రంలా జీవించాలి. నీళ్లలా జీవించాలి. నీళ్లలోని చాపలా జీవించాలి.

జీవితం చెట్టులా నీడనివ్వాలి...

నీ జీవితం చెట్టులా నీడనివ్వాలి. నీ లక్ష్యాలు చెట్టులా పండ్లనివ్వాలి. మార్గదర్శిలా జీవించాలి. క్రాంతదర్శిగా జీవించాలి. నాయకుడుగా జీవించాలి.

నీవు నెచ్చెలిలా జీవించాలి. చెలికాడులా జీవించాలి. అన్నలా జీవించాలి. తమ్ముడులా జీవించాలి. చెల్లెలిలా జీవించాలి. అక్కలా జీవించాలి. నీవు ఆదర్శవంతమైన కొడుకులా జీవించాలి. మంచి కూతురుగా జీవించాలి. మంచి తండ్రిగా జీవించాలి. మంచి తల్లిగా, గృహస్థుగా, భర్తగా, ఇల్లాలిగా జీవించాలి. నీవు ఆదర్శవంతమైన పౌరుడుగా, పౌరురాలిగా జీవించాలి. ఆదర్శవంతమైన విద్యావంతులుగా జీవించాలి. మీరు ఆదర్శవంతమైన కళాకారులుగా జీవించాలి.

జీవితం ఒక జీవనది.

మన జీవితం ఒక ప్రవహించే పాట. జీవితం ఒక జీవనది. ఎన్నో ఉప నదులు కలుస్తాయి. తానే ఒక ఉపనదిగా మారిపోతూ ఉంటుంది.

జీవితాన్ని ఒక ఆటలా జీవించాలి. ఒక పాటలా జీవించాలి. భాషలా జీవించాలి. అన్వేషణలా జీవించాలి. లక్ష్యాలుగా జీవించాలి. కర్తవ్యాలుగా జీవించాలి. కంప్యూటర్‌లా జీవించాలి. బ్యాటరీ రీచార్జర్‌లా జీవించాలి. మంచి పుస్తకంగా జీవించాలి. అవసరమైనప్పుడే తెరిచే గొడుగులా జీవించాలి. సాగిపోయే దారిగా జీవించాలి. దారిచూపే వారుగా జీవించాలి. దారివేసే వాళ్లుగా జీవించాలి. మైలురాళ్లుగా జీవించాలి.

మనం ఒక మహాసభలా జీవించాలి. ఒక జాతరలా జీవించాలి. ఒక ఊరేగింపులా జీవించాలి. తాతలా జీవించాలి. నానమ్మలా వాత్సల్యంగా జీవించాలి. బతుకు బండికి రెండు చక్రాల్లా జీవించాలి.

మనం బస్సు డ్రైవరులా బతకాలి. నీ జీవితానికి బస్సు నువ్వే. బస్సు డ్రైవరువూ నువ్వే. బాట నీదే. గమ్యం నీదే. గమనం నీదే. బాటసారివి నీవే. మైలు నీవే, మైలురాయివి నీవే.

తనను తాను తెలుసుకోవడమే జీవితం

తనను తాను తెలుసుకోవడమే జీవితం. తనను తాను గెలుచుకోవడమే జీవితం. తన జీవితానికి తానే కర్త కర్మ క్రియ అని... తెలుసుకొని ఆచరించడమే జీవితం. స్వయంసంపూర్ణంగా వుండడమే జీవితం. తనను తాను మలుచుకోవడమే జీవితం. తనను తాను ప్రేమించుకోవడమే జీవితం. తనను తాను గౌరవించుకోవడమే జీవితం. తనను తాను సమాజంలో అస్థిత్వాన్ని పెంచుకోవడమే జీవితం. తనను తాను ఎదిగించుకోవడమే జీవితం. తన లక్ష్యాలు, గమ్యాలు సాధించుకోవడమే జీవితం. అవి సమాజానికి కూడా ప్రయోజనకరంగా ఉండడమే జీవితం. తన గమ్యం, గమనం ఒక్కటి కావడమే జీవితం.

జీవితం ఒక అడవి. నీ జీవితానికి నువ్వే దారి వేసుకోవాలి. నీ దారి నువ్వే చూసుకోవాలి.

ఈ లోకంలోకి నీవు ఒంటరిగానే వచ్చావు. ఈ లోకంలోంచి ఒంటరిగానే వెళ్ళిపోతావు. నీ రాకకు ఆనందించారు. నీ పోకకు ఏడుస్తారు. ఎవరూ వెంట రారు. ఏదీ నీ వెంట రాదు. నీ జ్ఞాపకాలే ఇక్కడ మిగిలిపోతాయి. నీవు జ్ఞాపకాలలోనే కొనసాగుతావు.

అనుబంధాలు, జ్ఞాపకాలే నీ చరిత్ర. చావు పుట్టుకల మధ్య నున్నదే జీవితం. జీవితం ఒక చరిత్ర. జీవితం ఒక నోటుబుక్కు. నీ చరిత్ర నువ్వే రాసుకోవాలి. నోటుబుక్కు నీదే. పెన్ను నీదే. రాసే చెయ్యీ నీదే. రాసేదీ నువ్వే. రాసే దృక్పథమూ నీదే.

నీ జీవితానికి నీవే దిక్సూచి

నీ జీవితానికి నీవే దిక్సూచి. దిక్సూచిలా బతకాలి. దిక్కుల్లా బతకాలి. దిగంతాల్లా బతకాలి. దిక్కున్న చోటల్లా బతకాలి. దిక్కులేని చోట కూడా బతకాలి. అద్దంలో కొండలా బతకాలి. చేనేత బట్టలా బతకాలి. చేనేత బట్టలోని పోగుల కలనేతలా బతకాలి. కుండలా బతకాలి. మట్టిని మలచిన కుండలా బతకాలి.

నువ్వే బుద్ధుడివి. నువ్వే దైవానివి. నీకు నువ్వే బద్ధుడివి. నువ్వే లీడరువి, కేడర్‌వి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లా బతకాలి. లెక్చరరులా బతకాలి. సృష్టికర్తలా బతకాలి. రాజులా బతకాలి. నీ కిరీటం నువ్వే తయారుచేసుకోవాలి. నీ సైన్యం నువ్వే. నీ రాజ్యం నువ్వే. నీ అంతఃపురం నువ్వే. నీ రక్షణకోట నువ్వే.

విత్తు నువ్వే. మొలకెత్తే మొక్క నువ్వే.

ప్రేమ కరుణ తోటి మనిషికి ఆధారం. స్వేచ్ఛ సమానత్వం తనకు తానే ఆధారం. స్వేచ్ఛతో, సమానత్వంతో జీవించాలి. కళలు సాహిత్యం వినోదం ఆటపాటలు వినోదయాత్రలు... కొత్తప్రదేశాల పర్యటనలు అన్నీ మనిషి జీవితానికి అవసరం. సంగీతం లయ నాట్యం నటన అనుకరణ అన్నీ మనిషి జీవితావసరాలే.

విత్తు నువ్వే. మొలకెత్తే మొక్క నువ్వే. పంట నువ్వే. మట్టిలోని పసిడి నువ్వే. పసిడిలోని వన్నె నువ్వే.
నువ్వు వార్తలా బతకాలి. జ్ఞానంలా బతకాలి. సమాచారంలా బతకాలి. నువ్వు నడుస్తున్న గ్రంథాలయంలా బతకాలి. భూమిని తలకిందులు చేసి బువ్వపంచిపెట్టే రైతులా బతకాలి. సూర్యుని వెలుగులా ప్రసరించాలి. వెన్నెల్లా వెలగాలి.

జీవిత పరిణామాలే జీవితం...

ఈ జీవితం శాఖోపశాఖలుగా విస్తరించడానికే. జీవిత చక్రమే జీవితం. జీవిత పరిణామాలే జీవితం. బతకడమే జీవితం. బతుకు గెలుచుకోవడమే జీవితం. ఓడిపోయిన బతుకు కూడా జీవితమే. తిరిగి గెలుచుకోవడమే జీవితం. చావు పుటకల మధ్య వున్నదే జీవితం. మరుజన్మ అంటూ ఏదీ లేదు. మళ్ళీ బతికి వచ్చినవారు ఎవరూ లేరు. నీవు చనిపోయాక మిగిలే నీ జ్ఞాపకాలు, పాదముద్రలే నీ మరుజన్మ.

English summary
An eminent writer BS Ramulu stressed explained about life and aims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X